Malaikottai Valiban మరో సెన్సేషనల్ పాత్రతో మోహన్ లాల్.. క్రేజీ డైరెక్టర్‌తో కలిసి.. !

విభిన్నమైన చిత్రాలతో, వైవిధ్యభరితమైన పాత్రలతో దేశంలోనే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకొన్న నటుడు మోహన్ లాల్. ప్రతీ చిత్రాన్ని డిఫరెంట్‌గా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాలతో కెరీర్‌ను అద్భుతంగా మలుచుకొన్న మోహన్ లాల్ ప్రస్తుతం మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తదుపరి చిత్రం కోసం న్యూ ఏజ్ డైరెక్టర్ లిజో పెల్లిసెరీతో జతకట్టారు. మోహన్ లాల్, లిజో జోస్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి మలైకొట్టే వలిబన్ అని టైటిల్‌ను ఖరారు చేశారు.

Malaikottai Valiban

గత కొన్నిరోజులుగా చిత్ర టైటిల్‌కు సంబంధించిన రకరకాల వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు చిత్ర టైటిల్‌ను మలైకొట్టై వలిబన్ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) గా ప్రకటించారు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు లిజో జోస్ పెల్లిసెరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్ానయి. మోహన్ లాల్ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగల టాలెంట్ ఆయన సొంతం. లిజో కూడా విభిన్న కథాంశాలతో కూడా చిత్రాలతో, మనిషి మనస్తత్వాలను భిన్నకోణంలో ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న దర్శకుడు. వీళ్లిద్దరి కలయికలో చిత్రం అంటే అంచనాలు తారాస్థాయిలో ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిత్రం ఉండబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. జనవరి నుండి చిత్రీకరణ ప్రారంభం కానున్న చిత్రం షూటింగ్ దాదాపు రాజస్థాన్ లోనే జరుపుకోనుంది. మోహన్ లాల్ రెజ్లర్‌గా నటించనున్నారు.

రచయిత: పీఎస్ రఫీక్
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సినిమాటోగ్రాఫర్: మధు నీలకందన్
నిర్మాతలు: జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్ లాబ్
దర్శకత్వం: లిజో జోస్ పెల్లిస్సెరి
ప్రమోషన్ కన్సల్టెంట్: ప్రతీష్ శేఖర్
పీఆర్వో: బి ఏ రాజు's టీం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X