»   » మళ్లీ వివాదంలో మోహన్‌లాల్.. లీగల్ నోటీసులు జారీ

మళ్లీ వివాదంలో మోహన్‌లాల్.. లీగల్ నోటీసులు జారీ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మళ్లీ వివాదంలో ఇరుక్కొన్నారు. గత వారం మలయాళ నటి కిడ్నాప్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ వ్యవహారం కూడా ఆయనను ఇబ్బందుల్లో పెట్టింది. తాజాగా ఓ చేనేత కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో సరికొత్త విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలో చరఖాను తిప్పడంపై సామాజిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన నటించిన వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపించింది. దాంతో రంగంలోకి దిగిన కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చర్యలకు ఉపక్రమించడమే కాకుండా నోటీసులు పంపడం వివాదంగా మారింది.

  కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధ్యక్షురాలు శోభన జార్జి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాపార ప్రకటన ఉందని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో మోహన్‌లాల్‌కు, చేనేత కంపెనీకి నోటీసులు పంపించాం. స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నమైన చరఖాకు సదరు ప్రకటనకు సంబంధం లేదు అని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాపార ప్రకటనల్లో మోహన్‌లాల్ నటించకుంటే మంచిదనేది నా సలహా అని పేర్కొన్నారు.

   Mohanlal in trouble over misleading textile advertisement

  ఇదిలా ఉండగా, మోహన్‌లాల్ ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించే ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఒడియాన్, కయాంకులం, కొచున్ని, నీరాళీ అనే మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి.

  English summary
  Malayalam actor Mohanlal once again in the news healines. Kerala Khadi and Village Industries Board Issued notices. He has been served a legal notice for being part of a misleading advertisement. In the commercial, he is seen spinning the charkha.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more