twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుమార్తె మరణం.. వారంలోపే సంగీత దర్శకుడు కూడా మృతి, గుండెలు బరువెక్కే విషాదం!

    |

    ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అత్యంత విషాదకర ఘటనతో కన్నడ సినీ అభిమానులు, ప్రముఖులు శోకంలో మునిగిపోయారు. గత నెల 25న బాలభాస్కర్, అయన సతీమణి లక్ష్మి, రెండేళ్ల కుమార్తె తేజస్వి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం తీవ్రమైన ప్రమాదానికి గురికావడంతో వెంటనే తిరువనంతపురంలో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. బలమైన గాయాలు కావడంతో రెండేళ్ల చిన్నారి తేజస్వి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. గాయాలు కావడంతో బాల భాస్కర్, లక్ష్మి వెంటిలేటర్ పై వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.

    బాలభాస్కర్ మృతి

    బాలభాస్కర్ మృతి

    వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న బాలభాస్కర్ నేటి తెల్లవారు జామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన వైద్యానికి బాగానే స్పందించారు. గుండెకు సంబందించి సమస్యలు అధికం కావడంతో బాల భాస్కర్ తుదిశ్వాస విడిచారు.

     విషమంగానే లక్ష్మి పరిస్థితి

    విషమంగానే లక్ష్మి పరిస్థితి

    బాలభాస్కర్ సతీమణి లక్ష్మి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకన్నా విషాదకరమైన సంఘటన మరొకటి ఉండదని మలయాళీ సినీప్రముఖులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     వివాహం తరువాత

    వివాహం తరువాత

    బాల భాస్కర్, లక్ష్మి 2000 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహం జరిగిన చాలా కాలంపాటు ఈ దంపతులు సంతానం కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి ముద్దుల కుమార్తె తేజస్వి జన్మించింది. కుమార్తెని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడుపుతున్న సమయంలో బాలభాస్కర్ కుటుంబాన్ని ఈ ప్రమాదం చిన్నాభిన్నం చేసింది.

     17 ఏళ్ల వయసులోనే

    17 ఏళ్ల వయసులోనే

    బాల భాస్కర్ 17 ఏళ్ల వయసులోనే మలయాళీ చిత్రాలకు సంగీత దర్శకుడిగా మారారు. పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా, అద్భుత వయోలిన్ నైపుణ్యంతో బాలభాస్కర్ గుర్తింపు పొందారు.

    English summary
    Violinist Balabhaskar dies a week after car crash that killed his daughter. Popular singer and violinist Balabhaskar passed away on October 2 early morning
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X