X
తెలుగు » సినిమాలు » అనేకుడు
అనేకుడు

అనేకుడు

Romance | 05 Mar 2015 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అనేకుడు స్టోరీ

అనేకుడు తమిల్ సినిమా తెలుగు డబ్ చిత్రం ఇది ఒక రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుస్, అమ్య్ర దస్తుర్ , కార్తీక్ ముత్తురామన్, అశిశ్ విద్యార్తి, అతుల్ కుల్కర్ని, సూరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి ఆనంద్ నిర్వహించారు మరియు నిర్మాతలు కాల్పథి ఎస్ అఘొరామ్, కాల్పథి ఎస్ గణేష్, కల్పథి ఎస్ సురేష్ సంయుక్తంగ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హర్రిశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు. కథ కథ విషయానికొస్తే...మధుమిత (అమైరా దస్తూర్) ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలో క్రియేటివ్ డిజైనర్ గా పని చేస్తుంటుంది. ఆమె రిగ్రెషన్ థెరపీ చేయించుకుంటున్న తరుణంలో గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. గత జన్మలో తన ప్రేమికుడైన అశ్విన్(ధనుష్) ఈ జన్మలోనూ కనిపిస్తాడు. తను పని చేస్తున్న కంపెనీలోనే జాయిన్ అవుతాడు. తనకు ఎంతో నచ్చిన గత జన్మ ప్రియుడు కావడంతో అశ్విన్ ను ప్రేమిస్తూ ఉంటుంది మధు. గత జన్మ సంగతుల గురించి మధు అతనికి ఎన్ని సార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోడు. అయితే 25 ఏళ్ళ కింద జరిగిన ప్రేమకథలో మధు చెప్పింది నిజమని తేలుతుంది. అయితే ప్రతి జన్మలోనూ వీరి ప్రేమకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. దీంతో అశ్విన్ అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు అశ్విన్. వీరి గత జన్మలకు... ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ ఓనర్ కిరణ్ (కార్తీక్)కు లింకు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.....
Read More

అనేకుడు కాస్ట్ & క్రూ

అనేకుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె వి ఆనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత కాల్పథి ఎస్ అఘొరామ్, కాల్పథి ఎస్ గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అనేకుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ మధ్య కాలంలో పునర్జన్మల కథాంశం సక్సెస్ ఫార్ములాగా మారింది. దర్శకుడు ఈవిషయాన్ని పసిగట్టి సినిమాను బాగానే నడిపించాడు. కథనం థ్రిల్లింగ్ గా సాగింది. అయితే ట్విస్టులు మరీ ఎక్కువయ్యాయి. కథలో గత జన్మలను రివీల్ చేస్తూ ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయడంలో కాస్త కన్ఫ్యూజ్ చేసాడు. విలన్‌ పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేక పోయాడు. సినిమా మొదలైనప్పటి నుండి ఆసక్తిగా తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్, క్లైమాక్స్ లో మాత్రం కాస్త డిస్పప్పాయింట్ చేసాడు. ఫ్లాస్ బ్యాక్ తగ్గిస్తే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేదేమో. ఓవరాల్ గా చెప్పాలంటే....‘అనేకుడు' చిత్రం రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంది. ధనుష్, అమైరా దస్తూర్ పెర్ఫార్మెన్స్ చూడటం కోసం సినిమా చూడొచ్చు. భారీగా కాక పోయినా ప్రేక్షకులను ఓ మాదిరి సంతృప్తి పరుస్తుంది అనడంలో సందేహం లేదు.

అనేకుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అనేకుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+