»   » ఈ యేడు అప్పుడే మూడో సినిమా

ఈ యేడు అప్పుడే మూడో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఒక హీరో ఓ సినిమా పూర్తి చేసి విడుదల చేయటానికి ఏడాది పైగా సమయం తీసుకుంటున్న సమయం ఇది. అలాంటిది ధనుష్ లాంటి స్టార్ హీరో అప్పుడే ఈ సంవత్సరం మూడో సినిమా పూర్తి చేసి విడుదల కు సిద్దం చేస్తున్నారు.

ధనుష్ సినిమా రిలీజవుతోందే ఆ క్రేజే వేరు. అభిమానులకు నచ్చే అంశాలు అందించటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అలాగే తనదైన డైలాగులు, స్టెప్పులు, ఫైట్ సీన్స్ తో ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు నటుడు ధనుష్‌. తాజాగా ఆయన కొత్త చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాతో ఈ ఏడాది ధనుష్‌ మూడు సినిమాల హీరోగా అవుతారు.

ప్రస్తుత ఏడాది ఆరంభంలో ఆయన హీరోగా నటించిన 'అనేగన్‌' (అనేకుడు) చిత్రం తెరపైకి వచ్చి ఒకింత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా అభిమానులను మాత్రం రంజింపజేసింది. అనంతరం బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో నటించిన 'మారి' సినిమా ఇటీవల విడుదలైంది.

Dhanush's 'Thangamagan' gets a release date

ఇప్పుడు సినిమాల పరంగా ఈ ఏడాదిలో హ్యాట్రిక్‌ను కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన వేల్‌రాజ్‌ దర్శకత్వంలో నటిస్తున్న 'తంగమగన్‌' చిత్రం వచ్చేనెల 18వ తేదీన విడుదల కానుంది. గతంలో ధనుష్‌, వేల్‌రాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'వీఐపీ' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. వచ్చేనెల 18వ తేదీన సినిమాను తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ధనుష్‌ సరసన ఎమీజాక్సన్‌, సమంతలు నటించారు.

English summary
Dhanush who has produced and acted in the lead role in the film ‘Thangamagan’ directed by Velraj has fixed December 11 as the release date of the film.
Please Wait while comments are loading...