»   » డిఫెరెంట్ లవ్ స్టోరీ (ధనుష్ ‘అనేకుడు’ ప్రివ్యూ)

డిఫెరెంట్ లవ్ స్టోరీ (ధనుష్ ‘అనేకుడు’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ ఏడాది ప్రారంభంలో ‘రఘువరన్ బిటెక్', ‘పందెం కోళ్ళు' సినిమాలతో తెలుగులో విజయం సాధించిన ధనుష్...ఈ సారి ‘అనేకుడు'తో హట్రిక్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు.‘రంగం' ఫేం కెవి ఆనంద్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా ధనుష్ మార్కెట్ ని తెలుగులో పెంచేదిగా ఉంటుదంని చెప్తున్నారు. తమిళ సినిమా ‘అనేగన్' కు తెలుగు రూపం ‘అనేకుడు'. నీడలు, రూపాలు చాలా ఉన్నా ఆత్మ ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో ఆ పేరు పెట్టినట్లు ధనుష్ చెప్పాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అనేకుడు చిత్రం మల్టిఫుల్ లేయర్స్ లో కథను చెప్తూ సాగుతుంది. మురుగేశన్ తో సముద్ర(అమైరా దస్తూరి) ప్రేమలో పడటంతో కథ ప్రారంభం అవుతుంది. పరిస్ధితుల వల్ల వారిద్దరూ విడిపోతారు. అయితే కొన్ని శతాబ్దాల తర్వాత వారు మళ్లీ కలస్తారు. ప్రస్తుతానికి వస్తే... మధు(అమైరా దస్తూరి) ఓగేమ్ ఆర్టిస్టు, అశ్విన్(ధనుష్) ఆమె పనిచేసే కంపెనీలో సిస్టమ్ లీడ్ గా పనిచేస్తూంటారు. మళ్లీ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ సారైనా వారి ప్రేమ విజయం సాధించిందా...వంటి అంశాలు థ్రిల్లింగ్ గా సాగే నేరేషన్ తో సాగుతాయి.
డిఫరెంట్ స్క్రీన్‌ ప్లేతో కొనసాగే రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ఇది. ధనుష్ అద్బుతంగా నటించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుంది అనే దర్శకుడు కెవి ఆనంద్ అన్నారు.


ఇటివల ఈ సినిమా తమిళ వెర్షన్ విడుదలై మంచి విజయం సాధించింది. హారిస్ జయరాజ్ అందించిన ఆడియోకి తెలుగులో మంచి స్పందన లభించింది.


Dhanush's Anekudu movie preview

నిర్మాత కల్పతి ఎస్.గోరమ్ మాట్లాడుతూ- ముంబై అమ్మాయి అమీరా డస్టర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కనల్ కణ్ణన్ ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. బర్మా, మలేషియా, నార్త్ అమెరికాలలో సరికొత్త లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఓ సరికొత్త కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో విజయవంతం అవుతుందన్నారు.


బ్యానర్: ఎజిఎస్‌ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: ధనుష్, అమైరా దస్తూర్ , కార్తీక్‌, ఐశ్వర్య, ఆశీష్‌విద్యార్థి, అతుల్‌ కులకర్ణి తదితరులు
సంగీతం:హారిస్ జైరాజ్,
కెమెరా:ఓంప్రకాష్,
ఫైట్స్: కనల్ కణ్ణన్
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
ఎడిటింగ్‌: ఆంథోని,
ఆర్ట్‌: డిఆర్‌కె. కిరణ్‌,
సమర్పణ :కల్పాత్తి ఎస్‌. అఘోరం
నిర్మాత: కల్పాత్తి. ఎస్‌. గణేష్‌, కల్పాత్తి. ఎస్‌. సురేష్‌ లు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:కె.వి.ఆనంద్.
విడుదల తేదీ: 05,మార్చి 2015.

English summary
" Anekudu" is a romantic-thriller directed by KV Anand. Dhanush, Amyra Dastur and Karthik are in the lead roles in the movie.
Please Wait while comments are loading...