»   » అనేకుడు అంటే ఏమిటి: నాగార్జునతో ధనుష్ ఇలా..

అనేకుడు అంటే ఏమిటి: నాగార్జునతో ధనుష్ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాటీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న ఎవరు కోటీశ్వరుడు గురువారంనాటి ఎపిసోడ్‌లో తమిళ హీరో ధనుష్ కనిపించాడు. నాగార్జున ఈ ఎపిసోడ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ తన షమితాబ్ సినిమా షూటింగ్ అనుభవాలను ఈ ఎపిసోడ్‌లో చెప్పారు. అమితాబ్‌ బచ్చన్‌తో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందం వేసిందని ఆయన చెప్పాడు. ఆ సినిమా ట్రయలర్స్ కూడా చూపించారు.

త్వరలో తెలుగులో విడుదల కాబోతున్న అనేకుడు సినిమా ట్రయలర్స్ ప్రసారం చేసి, దాని గురించి నాగార్జున ధనుష్‌ను ప్రశ్నించాడు. అనేకుడు అనే పేరు విచిత్రంగా ఉంది, అదేమిటని అడిగితే, ధనుష్ సమాధానం చెప్పాడు. నీడలు, రూపాలు చాలా ఉన్నా ఆత్మ ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు.

బోల్డ్ స్ట్రామినా చూపించావని నాగార్జున వ్యాఖ్యానిస్తే, సిగ్గుపడుతూ మురిసిపోయాడ ధనుష్. సినిమాల్లోనే ధనుష్ అసలు అని, ఈ షోలో మాత్రమే ధనుష్ నటిస్తున్నాడని దర్శకుడు ఆనంద్ చమత్కరించారు. అనేకుడు సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహించారు. రంగం సినిమాలో ఫొటోగ్రాఫర్ పాత్ర అనుభవాలు తనవేనని ఆయన చెప్పారు. సినిమాల్లోకి రాక ముందు వివిధ పత్రికలకు ఫొటో జర్నలిస్టుగా పనిచేసినట్లు ఆనంద్ చెప్పారు.

 Dhanusu reveals about Anekudu

షమితాబ్ దర్శకుడు ఆర్. బాల్కి గురించి చెబుతూ అతను విచిత్రంగా ఉంటాడని ధనుష్ అన్నాడు. షమితాబ్‌లో నటనకు ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ కాలేదని, నేరుగా సెట్స్‌లోకి వెళ్లానని ధనుష్ చెప్పాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దర్శకుడి సూచనల మేరకు నటించడమేనని అన్నాడు. ముందు డబ్బింగ్ చెప్పిన తర్వాత అందుకు అనుగుంగా నటింపజేయడమనేది బాల్కి ప్రత్యేకత అని చెప్పాడు. ఇది కష్టమైన పని అన్నాడు. షమితాబ్‌లో అమితాబ్ ఆయనతో సమానమైన పాత్రను తనకు ఇచ్చినా అంగీకరించడం ఆయన గొప్ప తనమని ధనుష్ అన్నాడు. అమితాబ్‌లో బేషజాలు లేవని, అతి సాధారణంగా ఉంటారని చెప్పాడు.

రజనీకాంత్‌కు తాను వీరాభిమానిని అని చెప్పుకున్నారు. తాను అల్లుడిగా కన్నా వీరాభిమానిగానే భావించుకుంటానని చెప్పాడు. రజనీకాంత్ దేవుడు అని, తాను మామూలు మనిషిని అని ఆడియన్స్‌లో ఓ అమ్మాయి వేసిన ప్రశ్నకు సమాధానంగా ధనుష్ చెప్పాడు.

ఆయన కోలావెరి డీ విశేషాలను కూడా వివరించాడు. ఆ పాట రికార్డింగ్ సందర్భంగానే ముగిసిందని ఆయన చెప్పారు. కేవలం 20 నిమిషాల్లో ఆ పాట రికార్డు జరిగిపోయిందని చెప్పాడు. కోలవెరీ డీ పాటను కొంత పాడి వినిపించాడు. మధ్యలో ఓ తమిళం సినిమా పాట కూడా ఆలపించాడు. ఎపిసోడ్‌ యావత్తు ధనుష్ సిగ్గుపడుతూ, నవ్వుతూ కనిపించాడు. ఇంగ్లీష్ మిక్స్ చేసిన తెలుగులో మాట్లాడాడు. అప్పుడప్పుడు ఆంగ్ల భాషలో మాట్లాడాడు. మొత్తంగా చాలా సరదా ఈ ఎపిసోడ్ సాగింది.

English summary
Tamil hero Dhanush participated episode with Nagarjuna of Meelo Evar Koteeswarudu has been telecasted.
Please Wait while comments are loading...