For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కన్ఫ్యూజ్ చేసాడు, కానీ...( అనేకుడు రివ్యూ..)

  By Bojja Kumar
  |

  Rating:
  2.0/5
  హైదరాబాద్: ‘రఘువరణ్ బి.టెక్' సినిమా హిట్ కావడంతో ధనుష్ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ధనుష్ నటించిన ‘అనేకుడు' చిత్రం విడుదలైంది. గత జన్మల కథాంశంతో ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొత్తం మూడు జన్మల ఇతివృత్తంతో సినిమా సాగింది. ఆ సినిమా విశేషాలేమిటో చూద్దాం.

  కథ విషయానికొస్తే...మధుమిత (అమైరా దస్తూర్) ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలో క్రియేటివ్ డిజైనర్ గా పని చేస్తుంటుంది. ఆమె రిగ్రెషన్ థెరపీ చేయించుకుంటున్న తరుణంలో గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. గత జన్మలో తన ప్రేమికుడైన అశ్విన్(ధనుష్) ఈ జన్మలోనూ కనిపిస్తాడు. తను పని చేస్తున్న కంపెనీలోనే జాయిన్ అవుతాడు.

  తనకు ఎంతో నచ్చిన గత జన్మ ప్రియుడు కావడంతో అశ్విన్ ను ప్రేమిస్తూ ఉంటుంది మధు. గత జన్మ సంగతుల గురించి మధు అతనికి ఎన్ని సార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోడు. అయితే 25 ఏళ్ళ కింద జరిగిన ప్రేమకథలో మధు చెప్పింది నిజమని తేలుతుంది. అయితే ప్రతి జన్మలోనూ వీరి ప్రేమకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. దీంతో అశ్విన్ అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు అశ్విన్. వీరి గత జన్మలకు... ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ ఓనర్ కిరణ్ (కార్తీక్)కు లింకు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.....

  పెర్ఫార్మెన్స్ పరంగా ధనుష్ సూపర్బ్. అమైరా దస్తూర్ కూడా అతనితో పోటీ పడింది. ఈ ఇద్దరి నటనే సినిమాకు హైలెట్. హీరోయిన్ అందం పరంగా కూడా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది. ధనుష్, అమైరాల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది.

  Dhanush's Anekudu Movie Review

  ఇప్పటి పరిస్థితులను పునర్జన్మల ప్రేమకథను ముడిపెడుతూ కథను చాలా ఆసక్తికరంగా నడిపించారు. స్క్రీన్ ప్లే బాగుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి.. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు.

  ఈ మధ్య కాలంలో పునర్జన్మల కథాంశం సక్సెస్ ఫార్ములాగా మారింది. దర్శకుడు ఈవిషయాన్ని పసిగట్టి సినిమాను బాగానే నడిపించాడు. కథనం థ్రిల్లింగ్ గా సాగింది. అయితే ట్విస్టులు మరీ ఎక్కువయ్యాయి. కథలో గత జన్మలను రివీల్ చేస్తూ ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయడంలో కాస్త కన్ఫ్యూజ్ చేసాడు. విలన్‌ పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేక పోయాడు. సినిమా మొదలైనప్పటి నుండి ఆసక్తిగా తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్, క్లైమాక్స్ లో మాత్రం కాస్త డిస్పప్పాయింట్ చేసాడు. ఫ్లాస్ బ్యాక్ తగ్గిస్తే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేదేమో.

  ఓవరాల్ గా చెప్పాలంటే....‘అనేకుడు' చిత్రం రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంది. ధనుష్, అమైరా దస్తూర్ పెర్ఫార్మెన్స్ చూడటం కోసం సినిమా చూడొచ్చు. భారీగా కాక పోయినా ప్రేక్షకులను ఓ మాదిరి సంతృప్తి పరుస్తుంది అనడంలో సందేహం లేదు.

  English summary
  With the recent super hit, Raghuvaran Btech, Dhanush has once again kick started his trails to strengthen his market in Telugu land. Did Anekudu help him out in the journey? Check out the review of Anekudu to know.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X