X
చెలియా

చెలియా

Action | Romance | 07 Apr 2017 | U |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

చెలియా స్టోరీ

చెలియా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ ఇది తమిళ్ లో 'కాట్రు వెలియిదై' ఈ చిత్రాన్ని తెలుగులో 'డ్యాయెట్' అనే పేరును ఖరారుచేశారు ఇందులో నటిస్తున్నవారు కార్తీక్ శివకుమార్, అదితి రాయ్, శ్రద్దా శ్రీనాథ్, రుఖ్మిణి విజయకుమార్, ఆర్ జె బాలాజి, డిల్లీ గణేష్, హరీష్ రాజ్, విపిన్ శర్మ తదితరులు. ఈ సినిమాకి కథ - స్క్రీన్ప్లే- దర్శకుడు-: మణి రత్నం నిర్వహించారు మరియు ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు.  ఆస్కార్ విజేత ప్రఖ్యాత సంగీతకారుడు ఎ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి స్వరాలు సమకుర్చరు. కథ వరుణ్ అలియాస్ వీసీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడిన వరుణ్‌ను అధికారులు హాస్పిటల్‌‌లో చేర్చుతారు. అక్కడ డ్యూటీ డాక్టర్‌గా అప్పుడే విధుల్లో చేరిన లీలా అబ్రహం ఆయనకు చికిత్స అందిస్తుంది. ఆ సమయంలో లీలాను చూసి ఇష్టపడుతాడు. ఆ తర్వాత మారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తమ ప్రేమలో కలతలు, కలహాలు చోటుచేసుకొంటాయి. ఈ సందర్భంలో వారిద్దరూ విడిపోతారు. అదే సమయంలో యుద్ధం చోటుచేసుకోవడంతో ఫైటర్ పైలట్‌గా తన కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కార్గిల్‌కు వెళుతాడు. యుద్ధంలో విమానం కూలి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కుతాడు. రావల్పిండి జైలులో వరుణ్ తన ప్రేమికురాలు లీలా అబ్రహం గురించి తలుచుకొంటూ బతుకుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ పాకిస్థాన్ జైలు నుంచి బయటపడ్డాడా? తన ప్రేమికురాలు లీలాను కలుసుకొన్నాడా? చివరికి కథకు ముగింపు ఏంటనే ప్రశ్నలకు సమాధానమే చెలియా చిత్రం.
Read More

చెలియా కాస్ట్ & క్రూ

చెలియా సిబ్బంది సమాచారం

దర్శకత్వం మణిరత్నం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చెలియా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చెలియా చిత్రం కథ యుద్ద పోరాటంతో ప్రారంభమవుతుంది. యుద్ధంలో పాకిస్థాన్ అధికారులకు బందీగా చిక్కిన వరుణ్ జైలు జీవితాన్ని అనుభవిస్తూ తన ప్రేయసి ఊహాల్లో గడుతుంటాడు. అదే సమయంలో జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే ఆలోచనతో సినిమా నడుస్తుంటుంది. రెండు కోణాల్లో కథ నడుస్తూ ప్రథమార్థం ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. ఒక టిపికల్ ప్రవర్తన కలిగిన వరణ్ ప్రేమ కోసం లీలా వెంటపడటం వంటి అంశాలతో కథ ఆసక్తి సాగుతుంది. ప్రథమార్థంలో వరుణ్ అన్నయ్య పెళ్లి ఎపిసోడ్ కూడా ఫీల్ గుడ్‌ భావన కలిగిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకోవడంతో సినిమా రెండో భాగంపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. వరుణ్, లీలా ప్రేమ కథను సాగతీయడంతో రెండో భాగంలో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అనే భావన ప్రేక్షకుడి కలుగుతుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలు కూడా అంతగా ఆసక్తి లేకపోవడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. తప్పించుకొనే క్రమంలో పాకిస్థాన్ అధికారులకు వరుణ్ బృందం మళ్లీ పట్టుబడటంతో ఇక క్లైమాక్స్‌ భారీగానే ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎలాంటి భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం.. కథ రొటీన్‌గా సాగిపోవడంతో చివరకు ఇది రోజా, బొంబాయి తరహా చిత్రం కాదని తేలిపోతుంది. మణిరత్నం నుంచి వచ్చిన సాదాసీదా ప్రేమకథ అని ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.

చెలియా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

చెలియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+