»   » సెట్స్ మీద వరుస అగ్నిప్రమాదాలూ: చెలియా హీరోయిన్ అదితీరావు సేఫ్

సెట్స్ మీద వరుస అగ్నిప్రమాదాలూ: చెలియా హీరోయిన్ అదితీరావు సేఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెలియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన భామ అదితి రావు హైదరి దాదాపు దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ?మర్డర్-3? లాంటి సినిమాల్లో అందాలు ఆరబోసినా.. అదితికి ఇప్పటిదాకా బాలీవుడ్లో ఆశించిన బ్రేక్ రాలేదు. భర్త సత్యదీప్ మిశ్రా నుంచి విడాకులు తీసుకుని.. పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టినా ఆమె కెరీర్ గాడిన పడలేదు. ఐతే ఎట్టకేలకు ఆమెకు మణిరత్నం సినిమా ?కాట్రు వేళయిదే? రూపంలో ఒక బంపర్ ఆఫర్ తగిలింది అనుకుంటే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు ఆ సినిమా కాస్తా డిజాస్టర్ అయి కూచుంది. దాంతో మళ్ళీ వేశాల కోసం వేటలో పడింది అదితి రావు.

వరస రెండు అగ్ని ప్రమాదాలు

వరస రెండు అగ్ని ప్రమాదాలు

ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈమె వరస రెండు అగ్ని ప్రమాదాల నుండి తప్పించుకొని బయటపడింది. రెండు ప్రదేశాలు కూడా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగినివే. సంజయ్ దత్త్ నటిస్తున్న ‘భూమి' సినిమా షూటింగ్లో ఒక టెలివిజన్ రియాలిటీ షూ సెట్ నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్టేజ్ పైకి వచ్చి అదితి నటించవలిసి ఉంది.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ఆమె రావడానికి కొద్ది నిముషాలు ముందే అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టం కొద్ది ఆ ప్రమాదం నుండి అమ్మడు బయటపడింది. మళ్ళీ మొన్ననే ఆర్ కే స్టూడియోలో ఒక పెళ్లి సన్నివేశం జరుగుతున్నప్పుడు మరోసారి అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఉన్న డెకరేషన్ వస్తువులు సెట్ డిజైన్ వస్తువులు మంటలో పడిపోయాయి.

లక్కీ గా తప్పించుకున్నాను

లక్కీ గా తప్పించుకున్నాను

కానీ అక్కడ పని చేస్తున్న వాళ్ళకు ఏమి కాకపోవడంతో ఎవరు అంతా టెన్షన్ పడలేదు. కానీ సెట్ మొత్తం చాలా విషాదంలో మునిగిపోయిందని అదితి చాలా బాధతో చెప్పింది. ''నేను రెండు సార్లు కూడా చాలా లక్కీ గా తప్పించుకున్నాను. లేకపోతే నన్ను ఎవరో వచ్చి కాపాడవలిసి వచ్చేది.

సునిల్ దత్త్

సునిల్ దత్త్

అప్పటిలో నర్గీస్ గారిని సునిల్ దత్త్ కాపాడినట్లు. మరో విషయం చెప్పనా అప్పుడు ఆ సెట్లో సంజయ్ కూడా లేడు.. నన్ను కాపాడడానికి'' అని జోక్ చేసింది. మొత్తానికి ఈ సొగసరికి అగ్ని ప్రమాదాలు రెండు తప్పించుకొని బయట పడటం అక్కడ ఉన్న ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.

నర్గీస్

నర్గీస్

మదర్ ఇండియా షూటింగ్ సమయంలో నర్గీస్ ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు అక్కడే ఉన్న సునిల్ దత్త్ వచ్చి రక్షించాడు ఆ తరువాత వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూనేసునీల్ దత్ కుమారుడు సంజయ్ దత్త్ ని ఉద్దేశించి "ఆ సెట్లో సంజయ్ కూడా లేడు.. నన్ను కాపాడడానికి" అంటూ నవ్వేసింది అదితి...

English summary
Aditi Rao Hydari , the charming actress, can quite set young hearts racing. Well, she seems to be in fiery situations off late.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu