»   » నమ్మలేరు కానీ ఇదే నిజం... అదితీ రావు హైదరీ "డైవోర్సీ"

నమ్మలేరు కానీ ఇదే నిజం... అదితీ రావు హైదరీ "డైవోర్సీ"

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదితి రావు హైదరి. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్య బాగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న ఈ భామ మన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. తన హాట్ అండ్ సెక్సీ అందాలను మేగజైన్ల, ప్రత్యేక ఫోటో షూట్లలో ఆరబోస్తూ హాట్ టాపిక్ అయింది. చాలా మందికి అదితి కుటుంబ నేపథ్యం గురించి తెలియదు.

రాజవంశీయులు

రాజవంశీయులు

ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె రెండు రాజవంశీకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. అస్సాం రాజకుటుంబానికి చెందిన మహమ్మద్ సాలేహ్ హైదరి మరియు వనపర్తికి చెందిన రాజవంశీయులు జె. రామేశ్వర రావులకు ఆమె మనవరాలు అవుతుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కూడా ఆమె బంధువు.

సపోర్టింగ్ రోల్స్

సపోర్టింగ్ రోల్స్

అదితి రావు తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. కొన్ని మళయాల చిత్రాల్లోనూ నటించింది. హిందీలో ప్రవేశించిన పెద్దగా పేరు రాలేదు. ఢిల్లీ 6, రాక్ స్టార్, మర్డర్ 3 చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. అక్షయ్ కుమార్ ‘బాస్' చిత్రంలో నటించింది. అయినా అదితి కి ఒరిగిందేం లేదు.

మణిరత్నం సినిమా

మణిరత్నం సినిమా

దాదాపు దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ?మర్డర్-3? లాంటి సినిమాల్లో అందాలు ఆరబోసినా.. అదితికి ఇప్పటిదాకా బాలీవుడ్లో ఆశించిన బ్రేక్ రాలేదు. భర్త సత్యదీప్ మిశ్రా నుంచి విడాకులు తీసుకుని.. పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టినా ఆమె కెరీర్ గాడిన పడలేదు. ఐతే ఎట్టకేలకు ఆమెకు మణిరత్నం సినిమా "కాట్రు వేళయిదే" రూపంలో ఒక బంపర్ ఆఫర్ తగిలింది.

ఆ స్థాయే వేరు

ఆ స్థాయే వేరు

ఇది తమిళ సినిమానే కావచ్చు. కానీ మణిరత్నం సినిమాలో చేస్తే వచ్చే గుర్తింపు అలాంటిలాంటిది కాదు. ఆయన సినిమాలపై బాలీవుడ్ జనాల కళ్లూ ఉంటాయి. బాలీవుడ్ సంగతలా వదిలేస్తే.. సౌత్ లో మంచి పేరొచ్చినా చాలు.. ఇక్కడ హీరోయిన్ల కొరత బాగా ఉంది కాబట్టి.. అవకాశాలు పట్టేయొచ్చు. మణిరత్నం సినిమాలో చేయడం అంటే ఆ స్థాయే వేరుగా ఉంటుంది. ఇందులో మెప్పిస్తే స్టార్ల సరసన అవకాశాలు ఆటోమేటిగ్గా తన్నుకుంటూ వచ్చేస్తాయి.

ఆ ఒక్కటీ తప్ప

ఆ ఒక్కటీ తప్ప

అయితే.. ఈ బ్యూటీకి ఇప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తక్కువ మందికే తెలుసు. అడిగినా కూడా ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా తప్పించుకోవడం ఈ భామకు అలవాటు. పెళ్లి మాత్రమే కాదు.. ఇప్పటికే అదితి విడాకులు కూడా తీసేసుకుంది. 2009లో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అదితి.

అసిస్టెంట్ కమిషనర్

అసిస్టెంట్ కమిషనర్

ఇతను గతంలో ఇన్ కం ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసి.. ఇప్పుడు తను కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోకే ఎంటర్ అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఇద్దరు 2013లో విడాకులు తీసేసుకున్నారు. విడాకుల తర్వాత ఇద్దరి కెరీర్ ఊపందుకోవడం విశేషం.

అద్భుతమైన ఆఫర్

అద్భుతమైన ఆఫర్

సినిమాల్లో అదితి తెగ బిజీ అయిపోగా.. ప్రస్తుతం మణిరత్నం సినిమాతో అద్భుతమైన ఆఫర్ వచ్చింది. సంజయ్ దత్ మూవీ భూమిలోను.. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో కూడా నటించేస్తుండడంతో.. వీటి రిలీజ్ తర్వాత స్టార్ గా మారిపోవడం ఖాయం అనే అంచనాలున్నాయి.

English summary
Aditi was reportedly married to Satyadeep Mishra, a former Assistant Commissioner of Income Tax and Indian Revenue Service officer in 2005 and then got separated due to different living styles which mean she was wedded at 19 years age and got separated at 23
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu