»   » మణిరత్నం ‘చెలియా’ మూవీ టాక్ ఎలా ఉంది?

మణిరత్నం ‘చెలియా’ మూవీ టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో తెరక్కిన మరో చిత్రం 'చెలియా'. కార్తి, అదితి రావు హైదరి జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది.

సెన్సార్ నుండి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం నిడివి 148 నిమిషాలు ఉంది. ఈ చిత్రంలో కార్తి ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తుండగా, అదితి రావు డాక్టర్ గా నటిస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోల నుండి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది.

ఫస్టాఫ్, సెకండాఫ్

ఫస్టాఫ్, సెకండాఫ్

సినిమా ఫస్టాఫ్ ఎంటర్టెన్మెంటుతో కూడిన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని, కార్తి, అతిది రావు హైదరి మధ్యసన్నివేశాలు ఆకట్టుకుంటాయని, తనదైన మార్కును ప్రతిబింభిస్తూ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారనే టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా సెకండాఫ్ స్లో స్క్రీన్ ప్లే సాగినట్లు సమాచారం.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్లలో ఎస్ రవి వర్మన్ అందించిన ఫోటోగ్రఫీ, ఎంటర్టెన్మెంటుతో సాగే ఫస్టాఫ్, కార్తీ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు.

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పోస్టర్లలో హీరోయిన్ అదితి రావు అందంగా కనిపించినప్పటికీ... పెర్ఫార్మెన్స్ పరంగా మైనస్ అయిందని టాక్. స్లో స్క్రీన్ ప్లే కూడా సినిమాకు మైనస్ అనే అంటున్నారు. దీనికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా సరిగ్గా సెట్టవ్వలేదని టాక్.

ఆశించిన స్థాయిలో ఉందా?

ఆశించిన స్థాయిలో ఉందా?

అయితే సినిమా మణిరత్నం నుండి ఆశించిన స్థాయిలో లేదని కొందరు అంటుండగా, మరణిరత్నం సినిమాలు అభిమానులు మాత్రం ఫర్వాలేదని అంటున్నారు.

English summary
Mani Ratnam's Cheliyaa released today and get avarage talk. An epic romantic drama starring Karthi and Aditi Rao Hydari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu