»   » సింపుల్ అండ్ క్యూట్ ’మణిరత్నం’ ప్రేమకథ (చెలియా మూవీ రివ్యూ)

సింపుల్ అండ్ క్యూట్ ’మణిరత్నం’ ప్రేమకథ (చెలియా మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాయకుడు, రోజా, బొంబాయి, సఖీ లాంటి చిత్రాలతో దేశంలోనే గర్వించదగిన సినీ దర్శకుడిగా మణిరత్నం పేరు సంపాదించుకొన్నారు. బాక్సాఫీస్ వద్ద రావణ్, కడలి లాంటి చిత్రాల పరాజయం తర్వాత మణిరత్నం సినిమాలు తన స్థాయిలో ఉండటం లేదనే విమర్శలు వచ్చాయి. ఆయన తీసిన చిత్రాలను ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాయి. ఇటీవల వచ్చి ఓకే బంగారం పర్వాలేదనిపించింది. తాజాగా కార్తీ, అదితి రావు జంటగా ఓ అందమైన ప్రేమకథను చెలియా రూపంలో ఏప్రిల్ 7 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ నేపథ్యంలో ఓ ఫైటర్ పైలట్, డాక్టర్ మధ్య జరిగిన ప్రేమ కథ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకోవాలంటే ముందు అసలు సినిమా కథ ఏంటనే విషయాన్ని తెలుసుకొందాం.

కథ ఏంటంటే..

కథ ఏంటంటే..

వరుణ్ అలియాస్ వీసీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడిన వరుణ్‌ను అధికారులు హాస్పిటల్‌‌లో చేర్చుతారు. అక్కడ డ్యూటీ డాక్టర్‌గా అప్పుడే విధుల్లో చేరిన లీలా అబ్రహం ఆయనకు చికిత్స అందిస్తుంది. ఆ సమయంలో లీలాను చూసి ఇష్టపడుతాడు. ఆ తర్వాత మారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తమ ప్రేమలో కలతలు, కలహాలు చోటుచేసుకొంటాయి. ఈ సందర్భంలో వారిద్దరూ విడిపోతారు. అదే సమయంలో యుద్ధం చోటుచేసుకోవడంతో ఫైటర్ పైలట్‌గా తన కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కార్గిల్‌కు వెళుతాడు. యుద్ధంలో విమానం కూలి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కుతాడు. రావల్పిండి జైలులో వరుణ్ తన ప్రేమికురాలు లీలా అబ్రహం గురించి తలుచుకొంటూ బతుకుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ పాకిస్థాన్ జైలు నుంచి బయటపడ్డాడా? తన ప్రేమికురాలు లీలాను కలుసుకొన్నాడా? చివరికి కథకు ముగింపు ఏంటనే ప్రశ్నలకు సమాధానమే చెలియా చిత్రం.


ఎలా ఉందంటే

ఎలా ఉందంటే

చెలియా చిత్రం కథ యుద్ద పోరాటంతో ప్రారంభమవుతుంది. యుద్ధంలో పాకిస్థాన్ అధికారులకు బందీగా చిక్కిన వరుణ్ జైలు జీవితాన్ని అనుభవిస్తూ తన ప్రేయసి ఊహాల్లో గడుతుంటాడు. అదే సమయంలో జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే ఆలోచనతో సినిమా నడుస్తుంటుంది. రెండు కోణాల్లో కథ నడుస్తూ ప్రథమార్థం ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. ఒక టిపికల్ ప్రవర్తన కలిగిన వరణ్ ప్రేమ కోసం లీలా వెంటపడటం వంటి అంశాలతో కథ ఆసక్తి సాగుతుంది. ప్రథమార్థంలో వరుణ్ అన్నయ్య పెళ్లి ఎపిసోడ్ కూడా ఫీల్ గుడ్‌ భావన కలిగిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకోవడంతో సినిమా రెండో భాగంపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది.


రెండో భాగంలో

రెండో భాగంలో

వరుణ్, లీలా ప్రేమ కథను సాగతీయడంతో రెండో భాగంలో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అనే భావన ప్రేక్షకుడి కలుగుతుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలు కూడా అంతగా ఆసక్తి లేకపోవడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. తప్పించుకొనే క్రమంలో పాకిస్థాన్ అధికారులకు వరుణ్ బృందం మళ్లీ పట్టుబడటంతో ఇక క్లైమాక్స్‌ భారీగానే ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎలాంటి భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం.. కథ రొటీన్‌గా సాగిపోవడంతో చివరకు ఇది రోజా, బొంబాయి తరహా చిత్రం కాదని తేలిపోతుంది. మణిరత్నం నుంచి వచ్చిన సాదాసీదా ప్రేమకథ అని ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.


డైరెక్షన్..

డైరెక్షన్..

కార్గిల్ యుద్ద నేపథ్యంగా పైలట్, డాక్టర్ మధ్య పీరియాడిక్ లవ్ స్టోరిని దర్శకుడు మణిరత్నం ఎంచుకొన్నారు. కథకు అనుగుణంగా కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లను జోడించి దృశ్యకావ్యంగా మలిచేందుకు ప్రయత్నించారు. కథలో దమ్ము లేకపోవడం, కథనం మందగించడం వల్ల మణిరత్నం తన స్థాయిలో సినిమాను తెరకెక్కించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రేమకథలో ఉండాల్సిన ఎమోషనల్స్ సీన్స్ అక్కడక్కడ కనిపించాయే తప్ప.. పూర్తి స్థాయిలో ప్రేక్షకుడికి ఫీల్‌ను కలిగించకపోవడం మరో లోపం. రోజా, బొంబాయి, సఖి లాంటి రేంజ్‌లో చిత్రాలను ఆశించిన ప్రేక్షకులకు కొంత అసంతృప్తినే మిగిల్చారు.


కార్తీ నటన..

కార్తీ నటన..

ఇటీవల విభిన్నమైన చిత్రాలు, పాత్రల్లో కనిపించిన కార్తీకి చెలియా చిత్రం మరో డిఫరెంట్ మూవీ. పైలట్ పాత్రలో కార్తీ చక్కగా ఒదిగిపోయాడు. పైలట్‌గా, ప్రేమికుడిగా, యుద్ధ ఖైదీగా తన పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చాడు. కీలక సన్నివేశాల్లో మంచి నటనను కనబరిచాడు. రొమాంటిక్ సీన్లలోనూ అదరగొట్టాడు. టోటల్‌గా కార్తీ కెరీర్‌లో ఓ మంచి చిత్రమని చెప్పవచ్చు.


అదితిరావు హైదరీ.. అహో ఒహో..

అదితిరావు హైదరీ.. అహో ఒహో..

లీలా అబ్రహం పాత్ర భిన్న కోణాలున్న పాత్ర. ఎమోషనల్, ప్రేమ, విరహం లాంటి అంశాలు మేలవించిన పాత్రలో అదితి చక్కటి ప్రతిభ కనబరిచింది. అందం, అభినయంతో ప్రేక్షకుడిని కట్టపడేస్తుంది.
హైదరాబాదీ అమ్మాయి ప్రధానంగా గద్వాల ప్రాంతానికి చెందిన అదితిరావు కళ్లను చూసి మణిరత్నం ఫిదా అయిపోయాడా అనే భావన కనిపిస్తుంది. ఇప్పటివరకు వెండితెర మీద అదితి ఇంత అందంగా ఉంటుందా అనే భావన చెలియా చిత్రం చూస్తే తప్ప కలుగదు. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించినా రాని పేరును అదితి ఈ చిత్రంతో సంపాదించుకోవడం ఖాయం.


కనువిందు చేసిన ఫొటోగ్రఫీ..

కనువిందు చేసిన ఫొటోగ్రఫీ..

యుద్ధ నేపథ్య కథను అందమైన లొకేషన్లలో అద్భుతంగా కెమెరాలో బంధించడంలో సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు ఫొటోగ్రఫీనే ప్రాణంగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే అసలు హీరో రవి వర్మన్ మాత్రమే. యుద్ధ సన్నివేశమైనా, రొమాంటిక్ సీన్ అయినా, పాటలు, భావోద్వేగ సన్నివేశాలను తెరకెక్కించడంలో రవి వర్మన్ తనకు తానే సాటి అని నిరూపించుకొన్నారు. ఎత్తైన మంచు పర్వతాల మధ్య కార్తీ, అదితి ప్రేమ సన్నివేశం, కార్గిల్ యుద్ధానికి సంబంధించిన సీన్లు ప్రేక్షకుడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. లడక్, లేహ్‌లోని ఘాట్ రోడ్లలో చిత్రీకరించిన సన్నివేశాలు బ్రహ్మండంగా ఉన్నాయి. చెలియాను ఓ విజువల్ ట్రీట్‌గా మలచడంలో రవివర్మన్ కీలక పాత్రను పోషించాడు.


రెహ్మన్ మ్యూజిక్ మ్యాజిక్

రెహ్మన్ మ్యూజిక్ మ్యాజిక్

చెలియా చిత్రానికి మరో అదనపు ఆకర్షణ ఏఆర్ రెహ్మన్ సంగీతం. సన్నివేశాలకు అనుగుణంగా నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఒకట్రెండు పాటలు మినహా అన్ని పాటలకు సమకూర్చిన మ్యూజిక్ తెరమీద మ్యాజిక్ చేశాయి. అయితే గత చిత్రాలకు పొల్చితే రెహ్మన్ సంగీతం ఆ స్థాయికి లేదనే ఫీలింగ్ కలుగుతుంది.


ఇతర పాత్రలు గాలికి..

ఇతర పాత్రలు గాలికి..

ఈ చిత్రంలో కార్తీ, అదితి తప్ప మిగితా పాత్రల్లో కనిపించినవారెవరూ ప్రేక్షకులకు తెలియకపోవడం, ఆ పాత్రలు రిజిస్టర్ అయ్యేలా లేకపోవడం చెలియాకు మరో మైనస్ పాయింట్. పాత్రల క్యారెక్టరైజేషన్ నామమాత్రంగానే ఉండి, కేవలం హీరో, హిరోయిన్ల మీదనే ఆధారపడి ఉండటం కొంత ఇబ్బందిగా అనిపించింది. తెలుగు నేటివిటీకి తగినట్టుగా పాత్రధారులు లేకపోవడం టాలీవుడ్ ప్రేక్షకులు జీర్ణించుకోలేక విషయమనే చెప్పవచ్చు.


మణిరత్నం చిత్రాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రంలో కూడా కథ మొత్తం అదితి చుట్టే తిరుగుతుంది. అదితి పాత్రపైనే సినిమా భారమంతా వేశారు మణిరత్నం. అయితే రోజా, సఖి, మౌనరాగం చిత్రాల్లో మాదిరిగా చెలియా కథలో భావోద్వేగం లేకపోయిందనే మాట వినిపిస్తున్నది.


చెలియా కోసం తమిళం నేర్చుకొన్న అదితి

చెలియా కోసం తమిళం నేర్చుకొన్న అదితి

చెలియా ప్రారంభానికి ముందు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన అదితికి కూడా ఆడిషన్ నిర్వహించారు మణిరత్నం. తమిళ భాష నేర్చుకుంటేనే చెలియా అవకాశం ఇస్తామని చెప్పడంతో అదితి భాషను నేర్చుకోవాల్సి వచ్చింది. భాష రాకపోతే పాత్రను అర్ధం చేసుకోవడం కష్టమవుతుందనేది మణిరత్నం భావన.


మహిళా కథా నేపథ్యం

మహిళా కథా నేపథ్యం

మణిరత్నం చిత్రాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రంలో కూడా కథ మొత్తం అదితి చుట్టే తిరుగుతుంది. అదితి పాత్రపైనే సినిమా భారమంతా వేశారు మణిరత్నం. అయితే రోజా, సఖి, మౌనరాగం చిత్రాల్లో మాదిరిగా చెలియా కథలో భావోద్వేగం లేకపోయిందనే మాట వినిపిస్తున్నది.


కానరాని దేశభక్తి సీన్లు

కానరాని దేశభక్తి సీన్లు

మణిరత్నం సినిమాల్లో దేశభక్తి, సామరస్యత అనే అంశాలు కీలకంగా కనిపిస్తాయి. కార్గిల్ యుద్ద నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పాక్, భారత దేశాల మధ్య సంబంధాలపై అనేక అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సీన్‌లో పాక్ జెండా ఉన్న బంక్‌ను కార్తీ ట్రక్కుతో ధ్వసం చేయడం లాంటి అంశాలు ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాయి.


ఆసక్తికరమైన సన్నివేశాలు

ఆసక్తికరమైన సన్నివేశాలు

1. సినిమా ప్రారంభంలో వచ్చే కార్గిల్ యుద్ధ సన్నివేశం
2. హాస్పిటల్‌లో కార్తీకి అదితి ట్రీట్‌మెంట్ చేసే సీన్స్
3. కార్తీ అన్నయ్య పెళ్లి వేడుకకు సంబంధించినవి.
4. అదితి తల్లితండ్రులతో కార్తీ తన ప్రేమను వ్యక్తీకరించే సీన్
5. పాకిస్థాన్ జైలు నుంచి కార్తీ బృందం తప్పించుకొనే వచ్చే సన్నివేశం
6. కార్తీ, అదితిల మధ్య క్లైమాక్స్ సన్నివేశంలో ఓ ట్విస్టు..


నమ్మశక్యంగా లేని సీన్లు

నమ్మశక్యంగా లేని సీన్లు


1. అత్యంత భద్రత ఉన్న పాక్ జైలు నుంచి తప్పించుకోవడం
2. పాక్ నుంచి వచ్చిన తర్వాత అదితి కోసం వెతుక్కుంటూ వెళ్లే సీన్లు


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
మణిరత్నం డైరెక్షన్
రవి వర్మన్ ఫొటోగ్రఫీ
కశ్మీర్ లొకేషన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్


మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ,
నత్తనడకగా సాగిన కథనంచిత్రం పేరు: చెలియా

చిత్రం పేరు: చెలియా

నటీనటులు: కార్తీ, అదితి రావు హైదరీ, రుక్మిణి విజయ్‌కుమార్, ఢిల్లీ గణేశ్ తదితరులు
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: దిల్ రాజు, మణిరత్నం, శిరీష్
సంగీతం : ఏఆర్ రెహ్మన్
రిలీజ్ డేట్: ఏప్రిల్ 7, 2017
నిడివి: 2 గంటల 27 నిమిషాలుEnglish summary
Sensational Director Maniratnam's Latest movie is Cheliya. Karthi, Aditirao is lead pair. With Kargil War backdrop, Maniratnam narrated a love tale his own style. Ravi Varman Photography is the Best part of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu