X
తెలుగు » సినిమాలు » డీజే దువ్వాడ జగన్నాథమ్
డీజే దువ్వాడ జగన్నాథమ్

డీజే దువ్వాడ జగన్నాథమ్

Action | 23 Jun 2017 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

డీజే దువ్వాడ జగన్నాథమ్ స్టోరీ

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్,  పూజ హెగ్దే, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి, శతృ, మురళి శర్మ, ప్రభాకర్, హరిస్ ఉత్తమన్, జీవా, రావు రమేష్, తనికెళ్ళ భరణ   తదితరులు ఇతర  ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరీష్ శంకర్ వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.   కథ బెజవాడకు సమీపంలోని సత్యనారాయణపురం అనే అగ్రహారానికి చెందిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన వాడు దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) తండ్రికి అన్నపూర్ణ క్యాటరింగ్‌ను నడుపుతుంటాడు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వంటలు చేస్తుంటారు. తండ్రికి దువ్వాడ సహకరిస్తుంటాడు. కానీ దువ్వాడకు అన్యాయమంటే సహించదు. చిన్నతనం నుంచే అన్యాయాలను, అక్రమాలను, చెడును ఎదురిస్తుంటాడు. ఆవేశం ఎక్కువ. బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి ఆవేశం ఉండకూడదు అనే నెపంతో దువ్వాడ జగన్నాథానికి మెడలో రుద్రాక్షతో కూడిన మాలను వేస్తాడు. దానిని తన చేతులతో తీయకూడదని ఒట్టు వేయించుకొంటాడు తండ్రి (తనికెళ్ల భరణి). ఓ పెళ్లి కార్యక్రమంలో పూజా హెగ్డేను కలుస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే పెళ్లిలో ఆటపట్టించడానికే చనువుగా ఉన్నానని, పెళ్లి, ప్రేమ వ్యవహారాలు తనకు తగవని దువ్వాడ జగన్నాథానికి స్పష్టం చేస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో జగన్నాథం ప్రేమలో ఉన్న స్వచ్ఛతను తెలుసుకొంటుంది. ఇదిలా ఉండగ ఇలాంటి ఆవేశమున్న జగన్నాథం చిన్నతనంలోనే పోలీస్ అధికారి దృష్టిలో పడుతాడు. డీజే పేరుతో అండర్ కవర్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మాఫియా, సంఘ విద్రోహశక్తుల పనిపడుతుంటాడు. తనకు బాబాయి (చంద్రమోహన్) లాంటి వ్యక్తి అనుకోకుండా ఆత్మహత్య చేసుకొంటాడు. ఆత్మహత్యకు అగ్రి డైమండ్ అనే సంస్థ కారణమని తెలుస్తుంది. అగ్రి డైమండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ అనే పనిలో పడుతాడు. అగ్రి డైమండ్ వ్యవహారాలను రొయ్యల నాయుడు (రావు రమేశ్) గుట్టు చప్పుడు కాకుండా బినామీల పేరు మీద నడుపుతాడు. 9 వేల కోట్ల అక్రమాలకు తెర తీసిన అగ్రి డైమండ్ వెనుక దుష్ట శక్తుల పనిపట్టడానికి కంకణం కట్టుకొంటాడు. ఈ క్రమంలో దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే ఎదుర్కొన్న సమస్యలేంటి.? రొయ్యల నాయుడు గుట్టు ఎలా రట్టు చేశాడు. అగ్రి డైమండ్ బాధితులను ఎలా ఆదుకొన్నాడు. బాధితులకు ఎలా డబ్బు తిరిగి వచ్చేలా చేశాడు. వంటమనిషి అని గేలి చేసిన జగన్నాథాన్ని ఇష్టపడటానికి కారణం ఏమిటి? ఇలా ప్రశ్నలకు సమాధానమే దువ్వాడ జగన్నాథం సినిమా. 
Read More

డీజే దువ్వాడ జగన్నాథమ్ కాస్ట్ & క్రూ

డీజే దువ్వాడ జగన్నాథమ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డీజే దువ్వాడ జగన్నాథమ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అగ్రి గోల్డ్ కుంభకోణాన్ని పోలిన నేపథ్యాన్ని అగ్రి డైమండ్ పేరుతో కథను అల్లుకున్నాడు. చాలా సీరియస్ సమస్యకు దర్శకుడు హరీశ్ శంకర్ బ్రహ్మణ నేపథ్యాన్ని జోడించాడు. స్వతహాగా హరీశ్ బ్రహ్మణుడు కావడంతో కథలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, గ్రౌండ్ వర్క్ బాగా చేయడానికి అవకాశం లేకుండా వెసలుబాటు కలిగింది. అల్లు అర్జున్‌లో ఉండే ఎనర్జీని, సానుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంటు ఎక్కువగా మేలవించి, కొంత యాక్షన్ జతచేసి ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. పూజా హెగ్డే గ్లామర్, అల్లు అర్జున్ స్టయిల్‌ను మిక్స్ చేసి ఫస్టాఫ్‌ను పరుగు పెట్టించాడు. ఇక రెండో భాగంలో విలన్‌తో వైరం ప్రధాన అంశంగా మారింది. దీంతో క్లైమాక్స్‌ ఏంటో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది అయితే కథను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడనే ఆసక్తి కరమైన పాయింట్ ప్రేక్షకుడికి ఇంటర్వెల్ కలిగుతుంది. క్లైమాక్స్‌ను చేరుకోవడానికి దర్శకుడు అనుసరించిన పద్ధతి, కమర్షియల్ ఎలిమెంట్లను వాడుకొన్న విధానం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. కొత్తగా చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రొటీన్ భిన్నంగా క్లైమాక్స్‌ను కామెడీతో ముగించడంతో ప్రేక్షకుడు నవ్వుతూ ఓ సంతృప్తితో బయటకు వచ్చే అవకాశాన్ని కల్పించాడు. అయితే ఫైట్స్, భారీ హంగామా లాంటి రెగ్యులర్ క్లైమాక్స్‌ను కోరుకొనే సాధారణ ప్రేక్షకుడికి కొంత ఇబ్బందే ఉంటుంది. జులాయి, రేసుగుర్రం, అదుర్స్ లాంటి ఛాయలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి.

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డీజే దువ్వాడ జగన్నాథమ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+