X
తెలుగు » సినిమాలు » గడ్డం గ్యాంగ్
గడ్డం గ్యాంగ్

గడ్డం గ్యాంగ్

Action | Comedy | 06 Feb 2015 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

గడ్డం గ్యాంగ్ స్టోరీ

గడ్డం గ్యాంగ్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డా రాజశేఖర్, అంజలి లవన్య, నరేశ్, సీత తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ పి నిర్వహించారు మరియు నిర్మాత జీవిత రాజశేఖర్ నిర్మించారు. ఈ చిత్రానికి అచ్చు సంగీత అందించారు.  కథ ఓ మంచి కిడ్నాపర్ గడ్డం దాస్ (రాజశేఖర్)కి ఉద్యోగం సద్యోగం లేని మరో నలుగురు తోడవుతారు. వాళ్లంతా అతని గ్యాంగ్ గా మారి కిడ్నాపులనే వృత్తిగా మొదలెడతారు. అందులో భాగంగా ఓ బిజినెస్ మ్యాన్(కాదంబరి కిరణ్) కొడుకుని కిడ్నాప్ చేసి, విజయవంతంగా డబ్బులు వసూలు చేస్తారు. ఇది గమనించిన ఆ బిజినెస్ మ్యాన్...తనను ఇరికించిన ఓ పొలిటీషన్ (నరేష్) పై పగ తీర్చుకోవటానికి వారిని వాడాలని ఫిక్స్ అవుతాడు. ఆ పొలిటీషన్ కొడుకుని కిడ్నాప్ చేయమని వారిని అడుగుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ...ఆ పొలిటీషన్ కొడుకు...మహా జాదూ... ఈ కిడ్నాప్ కు ఒప్పుకున్న గడ్డం దాస్... ఆ పొలిటీషన్ కొడుకుని కిడ్నాప్ చేసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి...చివరకు ఏమైంది...చిత్రంలో షీనా పాత్రమిటి అనేది మిగతా కథ.
Read More

గడ్డం గ్యాంగ్ కాస్ట్ & క్రూ

గడ్డం గ్యాంగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంతోష్ పి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచ్చు రాజమణి
నిర్మాత జీవిత రాజశేఖర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గడ్డం గ్యాంగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
యాగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్స్ తో దాదాపు కెరీర్ అంతా లాక్కొచ్చిన రాజశేఖర్... పెద్ద వాడ్ని అయ్యాను కదా అని హఠాత్తుగా కుందేలు వేషం వేస్తానంటే ఎలా... ఆయన ఇమేజ్ అలా లగేజ్ లా క్యారీ అవుతుంది కదా. ఈ విషయం మరిచి తమిళంలో హిట్టైన సినిమా..తక్కువ బడ్జెట్ లో అవుతుంది..కొత్త కుర్రాళ్లను నలుగురుని పెట్టుకుని...కొత్త డైరక్టర్ తో ఖర్చు తక్కువలో లాగేద్దామనుకుంటే ఎలా...అక్కడ ఎందుకు హిట్టైంది... వాళ్లకు నచ్చే విషయాలేంటి..అందులో మనకు పట్టని విషయం ఏమిటి..అనేది చూసుకోవాలి కదా..అలాగే...అసలు అక్కడ కుర్రాడు వేసిన పాత్రకు తను సూట్ అవుతానో లేదో చెక్ చేసుకోవాలి. దానికి తోడు... తమిళం నుంచి ...సీన్ టు సీన్ ...అనువదించినట్లు ఉంది కానీ....తెలుగుకి రీరైట్ చేసుకుని తెరకి ఎక్కించినట్లు లేదు...దాంతో ఏది కామెడీనో...ఏది సెటైరో ...ఎక్కడ నవ్వాలో....ఎక్కడ ఎమోషన్ అవ్వాలో అర్దం కాక ..ఆ సీన్స్ క్రింద ఆ విషయం రాస్తే బాగుండును అనిపించింది. ముఖ్యంగా రాజశేఖర్ ని పెట్టుకున్నప్పుడు అతని క్యారెక్టర్ కు ప్రయారిటి ఇచ్చి ఆ పాత్ర ప్యాసివ్ కాకుండా సీన్స్ రీరైట్ చేసుకుని సెకండాఫ్ అయినా మార్చుకోవాల్సింది. లేదా రాజశేఖర్ ని కాకుండా వేరే చిన్న హీరోని అయినా పెట్టుకుని లాగించాల్సింది నిర్మాత గా జీవిత అయినా సేఫ్ అయ్యేది.

గడ్డం గ్యాంగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గడ్డం గ్యాంగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+