For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవికి రాజశేఖర్ స్పెషల్ ఇన్విటేషన్

  By Srikanya
  |

  హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికీ డాక్టర్ రాజశేఖర్ మధ్య వచ్చిన కలతలు తొలిగిపోతున్న సంగతి తెలిసిందే. రకరకాల కారణాలు, పరిస్థితుల వల్ల గతంలో మనస్పర్ధలు చోటు చోటుచేసుకున్నాయి. అయితే నాగబాబు చొరవతో అవి మరిచి మళ్లీ ఇద్దరూ దగ్గరవుతున్నారు. ఈ ఇరువురి మధ్య మనస్పర్దలకు తెరపడింది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా తెలియజేశారు. అంతేకాకుండా చిరంజీవికి తన తాజా చిత్రం గడ్డం గ్యాంగ్ స్పెషల్ షో వేస్తానని అన్నారు. అందునిమిత్తం ఆయన్ని ఇన్వేట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రాజశేఖర్ మాట్లాడుతూ... " నేను చిరంజీవి గారిని గడ్డంగ్యాంగ్ ప్రీమియర్ షో కు పిలుస్తున్నా. అలాగే మిగతా హీరోలను కూడా ఆహ్వానిస్తున్నా. ఇక చిరంజీవికి ఆసక్తి ఉంటే.. ఆయన కు స్పెషల్ షో వేస్తాను," అని తెలియచేసారు. రాజశేఖర్ నటించిన గడ్డం గండ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం పై రాజశేఖర్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

  Rajasekhar's Special Invitation to Chiranjeevi

  రీసెంట్ గా రాజశేఖర్ ఇచ్చిన ఓ ప్రెస్ మీట్ లో చిరంజీవి తనకు మధ్య ఉన్న మనస్పర్ధలు చేరిగిపోయాయని, ప్రస్తుతం వారిద్దరి మధ్య మంచి సంభంధాలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంలో నాగబాబు కీకల పాత్ర పోషించాడని కూడా తెలిపాడు. అలాగే త్వరలోనే రాజశేఖర్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి తన ఇంట్లో జరగబోయే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

  డా.రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గడ్డం గ్యాంగ్‌'. షీనా హీరోయిన్. పి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని, శివాత్మిక మూవీస్‌ పతాకంపై జీవితారాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం.

  రాజశేఖర్ మాట్లాడుతూ... తమిళ మాతృకలోని ఫీల్‌ను చెడగొట్టకుండా తెలుగులో రీమేక్ చేశాం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. జర్నీ ఫేమ్ శరవణన్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురేష్ పీటర్ జయకుమార్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అచ్చు అందించిన నేపథ్య సంగీతం, విమల్ రాంబో ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు గడ్డంగ్యాంగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని జీవిత తెలిపింది.

  Rajasekhar's Special Invitation to Chiranjeevi

  జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘తమిళంలో హిట్‌ అయిన ‘సూదు కవ్వుమ్‌' సినిమాకు రీమేక్‌ ఇది. రాజశేఖర్‌ గడ్డందాస్‌గా నటిస్తున్నారు. ఇంతకు మునుపు ఎప్పుడూ చేయని డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నారు. ఓ పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అచ్చు మంచి సంగీతాన్ని అందించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. వచ్చే నెల్లో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం. మాతృకను మించి తెలుగులో ఇంకా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

  ''తమిళ చిత్రం 'సూదు కవ్వమ్' నచ్చడంతో, ఈ రీమేక్‌లో చేయడానికి ఒప్పుకున్నాను. మూస చిత్రాలు చేయడం ఇష్టం లేకే ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను. ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇకనుంచి ఈ తరహా చిత్రాలే చేస్తా'' అని రాజశేఖర్ అన్నారు.

  రాజశేఖర్‌ మాట్లాడుతూ.... ''గడ్డం దాస్‌ అనే వ్యక్తి జీవితంలో జరిగే మలుపులే ఈ చిత్రం. ఇందులో నాతో పాటు మరో నలుగురు యువ నటులు చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లోకెల్లా ఇది వైవిధ్యంగా ఉంటుంది'' అన్నారు.

  Rajasekhar's Special Invitation to Chiranjeevi

  జీవిత మాట్లాడుతూ ... ''సూదుకవ్వుమ్‌' సినిమాను తెలుగులో చాలా మంది చేద్దామనుకున్నారు. ఆఖరికి ఆ అవకాశం మాకు దక్కింది. 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ''తొలి సన్నివేశం నుంచి కొత్తదనం కూడుకున్న కథ ఇది. రాజశేఖర్‌ నటన, షీనా అందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు దర్శకుడు.

  మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని సైతం రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

  నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. గిరిబాబు, సీనియర్‌ నరేశ్‌, సీత, దీపక్‌, అచ్చు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: డేమిల్‌ జేవియర్‌ ఎడ్వర్డ్స్‌, సంగీతం: అచ్చు, ఎడిటర్‌: రిచర్డ్‌ కెవిన్‌, నిర్మాత: జీవితా రాజశేఖర్‌.

  English summary
  "I'd like to invite Chiranjeevi for the premiere of Gaddam Gang and I'd also love to invite other heroes. If Chiru is interested, I'd like to screen the film specially," said Rajasekhar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X