‘గడ్డం గ్యాంగ్’ సెన్సార్ రిపోర్టు

By Bojja Kumar

హైదరాబాద్: డా.రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గడ్డం గ్యాంగ్‌'. షీనా హీరోయిన్. పి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని శివాత్మిక మూవీస్‌ పతాకంపై జీవితారాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల చేయటానికి నిర్ణయించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు వారు ఈచిత్రాని U/A సర్టిఫికెట్ జారీ చేసారు. అంటే పిల్లలు కూడా పెద్దల సమక్షంలో చూడదగ్గ సినిమా అని అర్థం. సెన్సార్ సర్టిఫికెట్ తాము కోరుకున్న విధంగా రావడంతో యూనిట్ సబ్యులు హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రంపై రాజశేఖర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి తొలిసారిగా రాజశేఖర్ సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

Gaddam Gang gets U/A

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళ 'సూదు కవ్వమ్' చిత్రానికి రీమేక్ గా ‘గడ్డం గ్యాంగ్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి రాజశేఖర్ మాట్లాడుతూ.....తమిళ మాతృకలోని ఫీల్‌ను చెడగొట్టకుండా తెలుగులో రీమేక్ చేశాం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. జర్నీ ఫేమ్ శరవణన్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురేష్ పీటర్ జయకుమార్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అచ్చు అందించిన నేపథ్య సంగీతం, విమల్ రాంబో ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుంది. అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X