»   » క్రైమ్ కామిడీతో బ్యాంగ్ (రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్‌’ ప్రివ్యూ)

క్రైమ్ కామిడీతో బ్యాంగ్ (రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్‌’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజశేఖర్ కెరీర్ లో ఎక్కువ రీమేక్ లనే నమ్ముకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన హిట్ అనేది కొరవడింది. దాంతో రెగ్యులర్ టోన్ కి భిన్నంగా ఓ వినోదాత్మక చిత్రంలో నటిస్తూ మన ముందుకు వస్తున్నారు. తమిళంలో విజయవంతమైన చిత్రం 'సూదుకవ్వుమ్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'గడ్డం గ్యాంగ్‌' పేరుతో రీమేక్‌ చేసి ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. చిత్రం ద్వారా సంతోష్ పి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. గడ్డం దాస్‌ అనే ఓ విభిన్నమైన పాత్రలో రాజశేఖర్‌ కనిపిస్తారు. కిడ్నాపులు చేసే గడ్డం దాస్ ఓ రోజు ఓ బిజినెస్ మ్యాన్ కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. అది చూసి ఇంప్రెస్ అయిన ఆ బిజినెస్ మ్యాన్...తన శతృవైన ఓ డైనమిక్ పొలిటీషిన్ కొడుకుని కిడ్నాప్ చేయమని పురమాస్తాడు. అయితే ఈ లోగా ఆ పొలిటీషియన్ కొడుకు వేరే వారి చేత కిడ్నాప్ చేయబడ్డాడని తెలుస్తుంది. తన తండ్రి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయటానికి తనే స్వయంగా కిడ్నాప్ డ్రామా ఆడుతూంటాడు. ఈ లోగా ఆ పొలిటీషన్ ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించమని పురమాస్తాడు. ఈ క్రమంలో గడ్డందాస్ ఏం చేసాడనేది మిగతా కథ.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజశేఖర్ మాట్లాడుతూ...తమిళ చిత్రం 'సూదు కవ్వమ్' నచ్చడంతో, ఈ రీమేక్‌లో చేయడానికి ఒప్పుకున్నాను. మూస చిత్రాలు చేయడం ఇష్టం లేకే ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను. ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇకనుంచి ఈ తరహా చిత్రాలే చేస్తా. తమిళ మాతృకలోని ఫీల్‌ను చెడగొట్టకుండా తెలుగులో రీమేక్ చేశాం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. జర్నీ ఫేమ్ శరవణన్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురేష్ పీటర్ జయకుమార్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అచ్చు అందించిన నేపథ్య సంగీతం, విమల్ రాంబో ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు గడ్డంగ్యాంగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు.


జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో మేం నిర్మించిన చిత్రాలు మాకు నష్టాన్నే మిగిల్చాయి. చిత్రబృందం అంతా కష్టపడి ఈ సినిమా చేశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది. తమిళంలో హిట్‌ అయిన ‘సూదు కవ్వుమ్‌' సినిమాకు రీమేక్‌ ఇది. రాజశేఖర్‌ గడ్డందాస్‌గా నటిస్తున్నారు. ఇంతకు మునుపు ఎప్పుడూ చేయని డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నారు. అచ్చు మంచి సంగీతాన్ని అందించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. మాతృకను మించి తెలుగులో ఇంకా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.


సినిమా: ‘గడ్డం గ్యాంగ్‌'
బ్యానర్: శివాని, శివాత్మిక మూవీస్‌
నటీనటులు: డా.రాజశేఖర్, షీనా, గిరిబాబు, సీనియర్‌ నరేశ్‌, సీత, దీపక్‌, అచ్చు తదితరులు
కెమెరా: డేమిల్‌ జేవియర్‌ ఎడ్వర్డ్స్‌, సంగీతం: అచ్చు,
ఎడిటర్‌: రిచర్డ్‌ కెవిన్‌,
నిర్మాత: జీవితా రాజశేఖర్‌.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.సంతోష్‌
విడుదల తేదీ: 6, ఫిబ్రవరి 2015

English summary
After a long break from screen, Dr Rajasekhar back with his latest film “Gaddam Gang”. Gaddam Gang is a Telugu comedy film directed by P Santhosh and produced by Jeevitha Rajasekhar. This movie is a official remake of Tamil hit movie Soodhu Kavvum.
Please Wait while comments are loading...