X
తెలుగు » సినిమాలు » గౌతమిపుత్ర శాతకర్ణి
గౌతమిపుత్ర శాతకర్ణి

గౌతమిపుత్ర శాతకర్ణి

Action | Romance | 12 Jan 2017 | U/A | 135 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

గౌతమిపుత్ర శాతకర్ణి స్టోరీ

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ పౌరాణిక ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణా, శ్రియా సరన్, హేమ మాలిని, శివా రాజ్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమా దర్శకత్వం రాధా కృష్ణా జగార్లమూడి (క్రిస్) నిర్వహించారు మరియు నిర్మాతలు రాజివ్ రెడ్డి వై, జె సాయిబాబు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్ స్వరాలు సమకుర్చరు.  కథ అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేసుకుని పాలిస్తున్న శాత‌వాహ‌న సామ్రాజ్య యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి (బాల‌కృష్ణ‌) అఖండ భరత జాతి...ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అని కలలుకంటూంటాడు. అఖండ భార‌తావ‌నిని ఒకేతాటి మీద‌కు తేవాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలోనే ముందుగా క‌ళ్యాణ‌దుర్గం రాజును జయిస్తాడు. వ‌రుస‌గా 29 యుద్ధాలు చేసి ఆ రాజ్యాల‌ను జ‌యించి...వారిని త‌న సామంతులుగా చేసుకుంటాడు. కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు. ఈ క్ర‌మంలోనే శాతవాహన చక్రవర్తి శాతకర్ణి వరస యుద్దాలతో...దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా అవతరిస్తాడు. ద‌క్షిణ‌భార‌త‌దేశంలో పెద్ద రాజు అయిన సౌరాష్ట్ర నహపాణుడి(కబీర్‌బేడీ)ని ఓడించి భార‌త్‌ను ఏకం చేయాల‌నుకుంటాడు. ఈ భారీ యుద్ధంలో శాత‌క‌ర్ణి న‌హ‌పాలుడిని ఓడించి అత‌డి అల్లుడు అయిన వృష‌భ‌నాథుడిని అక్క‌డ త‌న సామంతుడిగా చేసుకుంటాడు. దాంతో శకపురుషుడిగా అవతరిస్తాడు. భార‌తేశాన్ని గ‌తంలో పాలించిన ఎందరో గొప్ప రాజులు అయిన అశోకుడు, చంద్ర‌గుప్తుడు చేయ‌లేని ప‌నిని శాత‌క‌ర్ణి చేస్తాడు. తన పౌరష,పరాక్రమాలతో, యుద్ద నైపుణ్యంతో..తంత్రాలతో....ఉత్తర,దక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తాడు. అయితే.. అనితర సాధ్యంగా,అప్రతిహంగా సాగుతున్న దండయాత్రకు అడ్డం పడే సమయం వస్తుంది. ఇక గ్రీకువీరుడైన అలెగ్జాండ‌ర్ సమయం నుంచి భార‌త‌దేశం మీద దాడులు చేస్తున్న యువ‌నులు (గ్రీకులు) డెమిట్రియ‌స్ ఆధ్వ‌ర్యంలో భార‌త్‌మీద దండెత్తేందుకు ఎదురు చూస్తుంటారు. శాతకర్ణి కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కించుకోవాల‌ని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. అఖండభారతాన్నిచేజిక్కించుకోవటంలో భాగంగా శాతకర్ణిపై కుట్రకు పూనుకుంటారు. ఆయనపై విషప్రయోగానికి పూనుకుంటాడు. ఈ నేపధ్యంలో శాతకర్ణి... డెమిత్రయస్‌ని వ‌చ్చిన గ్రీకుల‌ను చిత్తుచిత్తుగా ఓడించి భార‌త‌జాతి ఖ్యాతిని చివ‌ర‌కు ద‌శ‌దిశ‌లా శాత‌క‌ర్ణి ఎలా వ్యాపింప‌జేశాడు ? త‌న జీవిత ప్ర‌యాణంలో త‌న త‌ల్లి గౌత‌మి(హేమ‌మాలిని), భార్య వశిష్టి దేవి (శ్రియా), త‌న పిల్ల‌ల‌తో అత‌డు ఎదుర్కొన్న ప‌రిస్థితులు ఏంటి అన్న‌దే ఈ సినిమా కథ.
Read More

గౌతమిపుత్ర శాతకర్ణి కాస్ట్ & క్రూ

గౌతమిపుత్ర శాతకర్ణి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చిరంతన్ భట్
నిర్మాత వై రాజీవ్‌రెడ్డి, జె సాయి బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గౌతమిపుత్ర శాతకర్ణి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సాహో క్రిష్..తెలుగు జాతి మర్చిపోయిన ఓ సాహసవీరుడుని గాధని మన ముందుంచాడు. ఇక ఇలాంటి అరుదైన తెలుగువారు గర్వపడే ప్రాజెక్టు కోసం కష్టపడి, తెలుగు జాతి వీర‌త్వాన్ని చాటి చెప్పిన శ‌క‌పురుషుడు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌లోపాత్రలో ఒదిగిపోయి...తనదైన శైలి డైలాగులతో ప్రాణం పోసిన బాలయ్య అభినందనీయుడు.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గౌతమిపుత్ర శాతకర్ణి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+