»   » నేను తమిళబిడ్డను, ఎంజీఆర్ నాకు పెదనాన్న : బాలకృష్ణ

నేను తమిళబిడ్డను, ఎంజీఆర్ నాకు పెదనాన్న : బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ఘ‌న విజ‌యం సాధించిన‌ సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలోను సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. శ్రేయ, హేమమాలిని ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ అతిధి పాత్రలో సందడి చేసాడు. అయితే గౌత‌మి పుత్ర శాత‌కర్ణి చిత్రాన్ని ఆర్ఎన్సీ సంస్థ త‌మిళంలో భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ వర్షన్

గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ వర్షన్

సోమవారం రాత్రి చెన్నైలోని కలైవానర్‌ ఆరంగంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ వర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరుగగా, బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు. బాలయ్య తమిళ్ చూసి ఇటు మనవాళ్ళూ, అటు తమిళులూ కూడా ఆశ్చర్య పోయారు.నేను ఇక్కడే పుట్టాను

నేను ఇక్కడే పుట్టాను

నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడి నీళ్లే తాగాను. ఇక్కడి గాలి పీలుస్తూ ఎదిగాను. గర్వంగా చెప్పగలను... నేను తమిళబిడ్డనని. మీ ఇంటి బిడ్డనని" అని హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి చెన్నైలోని కలైవానర్‌ ఆరంగంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ వర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరుగగా, బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు.ప్రాంతీయ భాషా చిత్రం కాదు

ప్రాంతీయ భాషా చిత్రం కాదు

'వీరపాండి కట్టబొమ్మన్‌' చిత్రంలో శివాజీ గణేశన్ చెప్పిన డైలాగులు చెప్పి తమిళ అభిమానులను అలరించిన బాలయ్య, 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రాంతీయ భాషా చిత్రం కాదని, దేశం మొత్తం చూడవలసిన ఓ వీరుడి కథని, దీన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపారు.ఎంజీఆర్ నాకు పెదనాన్న

ఎంజీఆర్ నాకు పెదనాన్న

ఈ కార్యక్రమంలో మరో హీరో కార్తి, దర్శకుడు కేఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్, నిర్మాతలు సీ కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్, చిత్ర దర్శకుడు క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఆర్ తనకు పెదనాన్న అయితే, శివాజీ గణేశన్ చిన్నాన్నని, వీరి మధ్య తిరుగుతూనే తాను పెరిగి పెద్దవాడిని అయ్యానని బాలకృష్ణ చెప్పిన మాటలకు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది.

English summary
Nandamuri Balakrishna got a grand welcome for the Tamil audio launch of Gautamiputra Satakarni in Chennai. Speaking on the occasion, Balakrishna said that Tamil Nadu is my birth place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu