»   »  ఈ ఏడాది కూడా లేనట్టే: మళ్ళీ నందమూరి అభిమానులకు నిరాశ తప్పదు

ఈ ఏడాది కూడా లేనట్టే: మళ్ళీ నందమూరి అభిమానులకు నిరాశ తప్పదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షఙ్ఞ ఎంట్రీపై ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్‌ కూడా ఎదురుచూస్తుంది. గతేడాది మోక్షఙ్ఞ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చినా అది వర్కౌట్ కాలేదు. నిజానికి బాలయ్య తనయుడి అరంగేట్రం గురించి రెండు మూడేళ్లుగా చర్చ నడుస్తోంది.

అడుగు ముందుకు పడలేదు

అడుగు ముందుకు పడలేదు

బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి 2017లోనే కొడుకు అరంగేట్రం అంటున్నాడు కానీ అడుగు ముందుకు పడలేదు. ఈ సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైనపుడు కూడా ఈ ఏడాదే కొడుకు తెరంగేట్రం జరుగుతుందని నొక్కి వక్కాణించాడు బాలయ్య. ఐతే తాజా సమాచారం ప్రకారం మోక్షఙ్ఞ ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవట.

అరంగేట్రం 2018లో

అరంగేట్రం 2018లో

బాలయ్య తనయుడి అరంగేట్రం 2018లోనే జరగబోతోందని సమాచారం. జాతకం, ఇతర లెక్కల ప్రకారం బాలయ్య 2017లోనే కొడుకును అరంగేట్రం చేయాలని భావించినప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడలేదని.. కథ, దర్శకుడు ఖరారవ్వలేదని.. హడావుడిగా ఏదో ఒక సినిమాతో అరంగేట్రం చేయించడం సరి కాదని భావించి.. అరంగేట్రాన్ని వాయిదా వేశారని సమాచారం.

బాయ్ నెక్స్ట్ డోర్

బాయ్ నెక్స్ట్ డోర్" లాంటి ఇమేజ్ తో

మరీ పెద్ద పెద్ద ఫైట్లు ఉండకూడదని మోక్షఙ్ఞ ఎంట్రీ సింపుల్ గానూ "బాయ్ నెక్స్ట్ డోర్" లాంటి ఇమేజ్ తోనూ ఉండాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. ఇక దర్శకుల విషయానికి వస్తే, రాజమౌళి .. త్రివిక్రమ్ .. కొరటాల శివ వంటి దర్శకులు ఆయన దృష్టిలో వున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ దర్శకులలో మోక్షజ్ఞని ఎవరు తెర మీదకి తీసుకొస్తారో చూడాలి...

ట్రైనింగ్ తీసుకుంటున్నాడు

ట్రైనింగ్ తీసుకుంటున్నాడు

సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య తెర వెనక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మాత్రంమోక్షఙ్ఞ అరంగేట్రం పక్కా అంటున్నారు.

అభిమానుల్లో నిరాశ

అభిమానుల్లో నిరాశ

మంచి ముహూర్తం చూసి కొడుకును తెలుగు తెరపైకి తీసుకురావాలని బాలయ్య బావిస్తున్నాడు. ఐతే 2017లోనే కొడుకు అరంగేట్రం అని చెప్పి అభిమానుల్ని ఊరించిన బాలయ్య ఇలా మాట తప్పేస్తున్నాడేంటి అని అభిమానుల్లో ఒకింత నిరాశ కనిపిస్తోంది. నందమూరి వారసుడిని తెరమీద చూడటానికి అభిమానులు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు.

English summary
As per reliable sources, Nandamuri Balakrishna is keen to launch his son Mokshagna as hero next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu