»   » వావ్... లొకేషన్లు అదిరాయి (ఫోటోలు)

వావ్... లొకేషన్లు అదిరాయి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై నాగ శౌర్య, అవికా గోర్ జంటగా నటిస్తోన్న 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం షూటింగ్ కూర్గ్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. మే 18 నుండి మొదలైన షెడ్యూలు షూటింగులో నాగ శౌర్య, అవికాగోర్ పై నృత్య దర్శకుడు శేఖర్ రూపకల్పనలో ఓ మెలొడీ పాటను చిత్రీకరించారు.

కె.ఎం.రాధాకృష్ణ నటించిన అద్భుతమైన మెలోడి పాటను కూర్గ్ ప్రకృతి అందాల మధ్య చిత్రీకరిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇంత దూరం వచ్చామని నిర్మాత గిరిధర్ మామిడిపల్లి చెప్పారు. అలాగే చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హీరో, హరోయిన్లు, సప్తగిరి, పవిత్రలోకేష్ లపై నాలుగు రోజుల పాటు చిత్రీకరించామని తెలిపారు. మే 31 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.

నంద్యాల రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య, అవికా గోర్, రావు రమేష్, నరేష్, ప్రగి, పవిత్రలోకేష్, సప్తగిరి, వెన్నెల కిషోర్, అనితా చౌదరి, కాశీ విశ్వనాథ్, వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: బాలిరెడ్డి, కూర్పు: శేఖర్

కూర్గు లొకేషన్లు

కూర్గు లొకేషన్లు

కూర్గ్ లొకేషన్లలో ‘లక్ష్మీ రావే మా ఇంటికి' షూటింగ్

గిరిధర్ ప్రొడక్షన్స్

గిరిధర్ ప్రొడక్షన్స్

గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై నాగ శౌర్య, అవికా గోర్ జంటగా నటిస్తోన్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం షూటింగ్ కూర్గ్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.

నృత్య దర్శకుడు శేఖర్

నృత్య దర్శకుడు శేఖర్

మే 18 నుండి మొదలైన షెడ్యూలు షూటింగులో నాగ శౌర్య, అవికాగోర్ పై నృత్య దర్శకుడు శేఖర్ రూపకల్పనలో ఓ మెలొడీ పాటను చిత్రీకరించారు.

31 నుండి హైదరాబాద్‌లో...

31 నుండి హైదరాబాద్‌లో...

మే 31 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.

English summary
Lakshmi Raave Maa Intiki is the forthcoming film starrer Naga Shourya and Avika Gor in the lead roles is in its second schedule of shoot at brisk pace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu