»   » ‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమా ప్రారంభం (ఫోటోలు)

‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమా ప్రారంభం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉయ్యాల జంపాల ఫేం అవిక గోర్, శౌర్య హీరో హీరోయిన్లుగా 'లక్ష్మి రావే మా ఇంటికి' టైటిల్‌తో గిరిధర్ ప్రొడక్షన్స్ బేనర్లో కొత్త సినిమా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో గురువారం సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మామాడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్నారు. కె.యం. రాధాకృష్ణన్ సంగీతం అందిస్తున్నాడు.

'లక్ష్మి రావె మా ఇంటికి' చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేసారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మార్చి 2వ వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన వివరాలు,ఫోటోలు స్లైడ్ షోలో......

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...


నంద్యాల రవి చెప్పిన కథ బాగా నచ్చింది. ఆ నెలల హీరోయిన్ కోసం వెయిట్ చేసాం. ఇడియట్ తర్వాత రవితేజకి ఎంత ఇమేజ్ వచ్చిందో, ఈ సినిమాతో శౌర్యకి అంత ఇమేజ్ వస్తుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


నేను చెప్పిన కథ, స్క్రిప్టు వినగానే గిరిధర్ వెంటనే ఒప్పుకున్నారు. దాదాపు 8 నెలలు స్క్రిప్టు వర్కు సాగింది. శౌర్యకి ఇది మంచి సినిమా అవుతుంది. రాధాకృష్ణన్ అందించిన సంగీతం చాలా బాగా వచ్చింది అన్నారు.

హీరో శౌరి మాట్లాడుతూ...

హీరో శౌరి మాట్లాడుతూ...


ప్రస్తుతం చందమామ కథలు, సాయి కొర్రపాటి సినిమాల్లో చేస్తున్నాను. ఇవి చేస్తుండగానే ‘లక్ష్మి రావే మా ఇంటికి' లాంటి మంచి సినిమాలో చాన్స్ రావడం ఆనందంగా ఉంది అన్నారు. ఉయ్యాల జంపాల చిత్రం తర్వాత ఈ కథ బాగా నచ్చింది అని హీరోయిన్ అవిక గోర్ తెలిపింది.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్


ఈ చిత్రంలో షాయాజీ షిండే, అలీ, ముఖేష్ రిషి, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.యం.రాధాకృష్ణన్, కెమెరా: సాయి శ్రీరామ్, పాటలు: భాస్కరభట్ల, వనమాలి, ఆర్ట్: రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాంబాబు, నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, దర్శకత్వం: నంద్యాల రవి.

English summary

 Lakshmi Raave Maa Intiki movie opening event held at Hyderabad. Actor Sourya, Actress Avika Gor, D.Ramanaidu, Dasari Narayana Rao, Tammareddy Bharadwaja, KL Damodar Prasad graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu