X
తెలుగు » సినిమాలు » లక్కీ లక్ష్మణ్
లక్కీ లక్ష్మణ్

లక్కీ లక్ష్మణ్

Drama | 30 Dec 2022 | U | 133 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

లక్కీ లక్ష్మణ్ స్టోరీ

లక్కీ లక్ష్మణ్ సినిమా డ్రామా, ఫ్యామిలీ  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో స‌య్య‌ద్ సోహైల్, మోక్క్ష, దేవి ప్రసాద్, సమీర్, రాజా రవీంద్ర, రచ్చ రవి, గీతు రాయల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఏ ఆర్ అభి వహించారు. నిర్మాత హరిత గోగినేని నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.  కథ పేదరికంతో పెరిగిన యువకుడు లక్ష్మణ్ (సయ్యద్ సోహైల్ ర్యాన్) ఇంజినీరింగ్ స్టూడెంట్. పేదరికం కారణంగా జీవితంలో చిన్న చిన్న విషయాలు, కోరికల తీర్చుకోలేక రాజీపడాల్సి రావడంతో తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకొంటాడు. అలాంటి పరిస్థితుల్లో శ్రావ్య (మోక్ష) తనకు అండగా నిలుస్తుంది. డబ్బుకు కొరత లేకుండా చూసుకొంటూ లక్ష్మణ్‌కు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. అయితే అంతా సవ్యంగా సాగిపోతుందనుకొనే సమయంలో లక్ష్మణ్, శ్రావ్య మధ్య బ్రేకప్ జరుగుతుంది. లక్ష్మణ్ ఫ్యామిలీ ఎందుకు పేదరికంలోకి నెట్టివేయబడింది? లక్ష్మణ్ కోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగం చేశారు? తల్లిదండ్రులను దూరంగా పెడుతూ.. వారి నుంచి విడిపోయిన లక్ష్మణ్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? లక్ష్మణ్‌కు సంపన్న కుటుంబానికి చెందిన శ్రావ్య ఎలా దగ్గరైంది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా ఎలా మారింది. లక్ష్మణ్, శ్రావ్యల మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? ఒంటరివాడైన లక్ష్మణ్ తన స్నేహితులతో కలిసి మ్యారేజ్ బ్యూరో ఎందుకు పెట్టాడు? మ్యారేజ్ బ్యూరో పెట్టిన లక్ష్మణ్‌ ఎలాంటి ఫలితాలను సాధించాడు? తల్లిదండ్రులను దూరంగా బతుకుతున్న లక్ష్మణ్ రియలైజ్ అయ్యాడా? తల్లిదండ్రుల విషయంలో తప్పు చేశానని రియలైజ్ అయితే అందుకు కారణం ఏమిటి? శ్రావ్య మనసును ఎలా గెలుచుకొన్నాడు? చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగిన లక్ష్మణ్.. బాగా డబ్బు సంపాదించి లక్కీ లక్ష్మణ్ ఎలా అయ్యాడనే ప్రశ్నలకు సమాధానమే Lucky Lakshman సినిమా కథ.
Read More

లక్కీ లక్ష్మణ్ కాస్ట్ & క్రూ

లక్కీ లక్ష్మణ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఏ ఆర్ అభి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత హరిత గోగినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లక్కీ లక్ష్మణ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్యామిలీ వ్యాల్యూస్, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, లవ్ స్టోరి, ఎమోషన్స్ కలిసిన చిత్రం లక్కీ లక్ష్మణ్. అయితే ఫస్టాఫ్‌లో రైటింగ్ చాలా వీక్‌గా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సన్నివేశాలు బలంగా రాసుకొని ఉంటే లక్కీ లక్ష్మణ్ ఫ్రెష్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఉన్న ఎమోషనల్ సీన్లు ఈ సినిమా వరకు మరో రేంజ్‌కెళ్లినట్టు అనిపిస్తుంది. బిగ్‌బాస్ ద్వారా విశేషంగా అభిమానులను సంపాదించుకొన్న సోహైల్ ఫ్యాన్స్‌కు లక్కీ లక్ష్మణ్ తప్పకుండా నచ్చుతుంది. ఈ వారాంతంలో ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీ, ఫన్ ఎంటర్‌టైనర్‌ చూడాలనుకొనే వారికి లక్కీ లక్ష్మణ్ మంచి అనుభూతిని పంచుతుంది.

లక్కీ లక్ష్మణ్ ట్రైలర్

Video Thumbnail

లక్కీ లక్ష్మణ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లక్కీ లక్ష్మణ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+