Don't Miss!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Bigg Boss Sohel Accident: సముద్రంలో సోహెల్‌కు ప్రమాదం.. కాపాడిన లోకల్ బాయ్.. అండర్‌వేర్‌తోనే!
చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి.. దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. అయితే, గుర్తింపును మాత్రం అంతగా దక్కించుకోలేకపోయాడు. కానీ, బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని గుర్తింపును అందుకున్నాడు. దీని తర్వాత ఏకంగా హీరోగా వరుస పెట్టి సినిమాలను కూడా చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ సోహెల్ నడి సముద్రంలో అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

అలా పరిచయం.. గుర్తింపు రాలే
'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో సోహెల్ యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం 'సరైనోడు' వంటి బడా మూవీలలో పాటు చిన్న సినిమాల్లోనూ నటించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు. కానీ, సరైన గుర్తింపును మాత్రం సోహెల్ అందుకోలేకపోయాడు.
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

బిగ్ బాస్ ఛాన్స్... ఫేల్ ఫేమస్
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సోహెల్ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు. హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు సోహెల్. ఇందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏ టాస్క్ అయినా తానే నెంబర్ వన్ అనేలా ఆడుతూ వచ్చాడు. అలా ఫినాలేకు చేరుకున్నాడు.

డబ్బుకు డబ్బు.. ఆఫర్లు కూడా
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. తద్వారా ఇలా షో చరిత్రలో డబ్బులు తీసుకుని వచ్చిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. దీని తర్వాత ఎనలేని క్రేజ్‌ను అందుకున్న సోహెల్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో అతడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

హీరోగా ఎన్నో సినిమాలు చేస్తూ
బిగ్ బాస్ షో తర్వాత సోహెల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అతడు 'మిస్టర్ ప్రెగ్నెంట్', 'లక్కీ లక్ష్మణ్', 'బూట్‌కట్ బాలరాజు', 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' వంటి చిత్రాల్లో హీరోగా చేస్తోన్నాడు. ఇప్పటికే వీటికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. వీటితో పాటు సోహెల్ మరిన్ని సినిమాల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

సినిమా రిలీజ్... ప్రమోషన్లతో
సోహెల్ నటించిన తాజా చిత్రమే 'లక్కీ లక్ష్మణ్'. మోక్ష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్ అభి దర్శకత్వంలో దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఇది డిసెంబర్ 30న విడుదల కాబోతుంది. దీంతో సోహెల్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఎన్నో ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశాడు.
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

చేపల వేటకు వెళ్లి.. ప్రమాదం
వరుస సినిమాలతో తీరక లేని షెడ్యూల్‌ను గడుపుతోన్న సయ్యద్ సోహెల్.. తాజాగా ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో కలిసి విశాఖపట్నం సమీపంలో చేపల వేటకు పడవపై సముద్రంలోకి వెళ్లాడు. అక్కడ వాళ్లతో ముచ్చటించిన తర్వాత పడవ చివర్లో నిల్చున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ పట్టు తప్పి సోహెల్ ఒక్కసారిగా సముద్రంలో పడిపోయాడు.

కాలికి గాయం.. కాపాడిన నాని
సముద్రంలో పడిపోయిన సయ్యద్ సోహెల్‌ను యూట్యూబర్ నాని ప్రాణాలకు తెగించి కాపాడాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లతో పాటు అతడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, సోహెల్ ప్రాణాలతో బయట పడిన సమయంలో అండర్‌వేర్ తప్ప ఏమీ లేవు. అంతలా కాసేపు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.