లక్కీ లక్ష్మణ్‌గా బిగ్‌బాస్ సోహైల్.. కథ నచ్చితేనే సినిమా అంటూ కామెంట్
వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా ఎఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లక్కీ లక్ష్మణ్. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల మధ్య వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాతలు మిరియాల రవీందర్‌రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ను అందించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో సోహైల్ హీరోయిన్ మోక్షపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అప్పిరెడ్డి "లక్కీ లక్ష్మణ్" మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో సినీ ప్రముఖులు మాట్లాడుతూ..

చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ.. చాలా మంది సొహైల్ సినిమా మీద సినిమా ఒప్పుకుంటున్నాడు ఏంటి అనుకోవచ్చు.అయితే నాకు కథ నచ్చితేనే సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాను. మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండాక్ సీనియర్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిరుచి ఉన్న మహిళా నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మూవీలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు
హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ లాంటి మంచి సినిమాలో సీనియర్‌తో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు లక్కీగా ఫీల్ అవుతున్నా. నాకిలాంటి మంచి అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సినీ పెద్దలకు ధన్యవాదాలు. కెరీర్ పరంగా ఐటి రంగంతో స్టార్ట్ అయిన నా జర్నీ రియల్ ఎస్టేట్ రంగంలో సెటిల్ అయ్యాను. దర్శకుడు అభి ఎంతో ట్యాలెంటెడ్ పర్సన్. తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఎప్పుడూ సినిమా డైలాగ్స్ చెపుతూ కథలు డిస్కషన్ చేసేవాడు. తను పడే తపన చూసి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ లను పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా నీ కోసం నేనే సినిమా చేస్తాను మంచి కథ ఉంటే చెప్పామన్నాను. అభి చెప్పిన కథ ఫ్రెష్ గా అనిపించడంతో సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యాను అని అన్నారు.

చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ... మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. అయితే సొంతంగా ఒక సినిమా తీయాలని ఈ కథ రాసుకుని నిర్మాతలకు చెబుదాం అనుకున్నప్పుడు హరిత గోగినేని నాతో నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పామన్నారు. లక్కీగా నేను చెప్పిన కథ తనకు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అందుకే ఈ సినిమా టైటిల్ కు లక్కీ అని పెట్టాను అని అన్నారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. "లక్కీ లక్ష్మణ్" టైటిల్ లోనే లక్ ఉన్నట్టు సొహైల్ కు కూడా మంచి లక్ ఉందన్నారు. డివోపీ అండ్రూ మాట్లాడుతూ.. ఎన్నో లవ్ స్టోరీలు తీసిన నేను చాలా రోజుల తర్వాత మంచి లవ్ స్టొరీ ఉన్న సబ్జెక్ట్ తీస్తున్నాం అని అన్నారు.
నటీనటులు: సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ తదితరులు
బ్యానర్స్: వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా
నిర్మాతలు: హరిత గోగినేని, రమ్యా ప్రభాకర్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: ఏఆర్ అభి
సంగీతం: అనూప్ రూబెన్స్


Click it and Unblock the Notifications











