»   » ప్రకాష్ రాజ్ ‘మనవూరి రామాయణం’ (ట్రైలర్)

ప్రకాష్ రాజ్ ‘మనవూరి రామాయణం’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రకాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్‌, ఫస్ట్‌ కాపీ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై ప్రకాష్‌ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'మనవూరి రామాయణం'. ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి, సత్య తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసారు.

'ఆకాశమంత', 'ధోని', 'ఉలవచారు బిర్యాని', 'గౌరవం' లాంటి పలు అభిరుచి గల సినిమాలను రూపొందించి దర్శక నిర్మాతగా ప్రకాశ్, తనదైన బ్రాండ్ సృష్టించారు. తాజాగా ఆయన దర్శకత్వంలో 'మన ఊరి రామాయణం' సినిమా వస్తుండంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Mana Oori Ramayanam Trailer

మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో అంతా కొత్తవాళ్ళే నటించగా ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పక్కాగా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Mana Oori Ramayanam Trailer - A film by Prakash Raj. directed and produced by Prakash Raj. music by: Ilayaraja. starring: Prakash Raj and Priyamani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu