»   » అనుకున్నంతా అయ్యింది... రానా మెడకు చుట్టుకున్న కేసు... అరెస్ట్ చేస్తారా??

అనుకున్నంతా అయ్యింది... రానా మెడకు చుట్టుకున్న కేసు... అరెస్ట్ చేస్తారా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోలు సినిమాల ప్రమోషన్ కంటే యాడ్ లలో ప్రోడక్ట్ లని ప్రమోట్ చెయ్యడం లో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అది వారికి సినిమా కంటే ఎక్కువ డబ్బులు తెచ్చిపెడుతుంది కాబట్టి. ఒక సినిమా కోసం దాదాపు నాలుగు నెలలు పడిన కష్టం ఇక్కడ కేవలం రెండు రోజులు మొఖానికి మేకప్ వేసుకుంటే ఒచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు - తమిళ పరిశ్రమ లో పెద్ద స్టార్ లు అయిన ప్రకాష్ రాజ్ , రానా దగ్గుబాటి లు రమ్మీ సర్కిల్ అనే ఆన్ లైన్ పేకాట వెబ్సైటు కోసం ప్రచారం చెయ్యడం విశేషంగా మారింది.

Prakash Raj and Rana roped in as Junglee brand ambassadors

రానా దగ్గుబాటి - ప్రకాశ్ రాజ్ ఇద్దరూ కలిసి చేసిన రమ్మీ సర్కిల్ యాడ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పేకాట సులువుగా ఎలా ఆడాలో చెప్పే ఈ యాడ్ లో రానా - ప్రకాష్ రాజ్ లు తండ్రీ కొడుకులుగా చేసారు . ఇంట్లో పేకాట ఆడితే ఎలాంటి ఇబ్బందులు ఒస్తాయి అనేది ప్రాక్టికల్ గా చూపిస్తూ ఆన్ లైన్ రమ్మీ బెటర్ అని చూపించే లాగా సాగుతుంది ఈ యాడ్.

మన దేశంలో పేకాట ఆడ్డం తప్పే కానీ.. అదే ఆన్ లైన్లో అయితే నిక్షేపంగా ఆడేసుకోవచ్చు. అందుకే నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న యాక్టర్లతో యాడ్ ఇచ్చేసింది జంగ్లీ రమ్మీ. ఇందులో మన బొమ్మరిల్లు ఫాదర్ ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక దగ్గుబాటి రానా కూడా జంగ్లీ రమ్మీ యాడ్ లో మెరిశాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో పేకాట ఆడుకోవడంలో ఇబ్బందులను ప్రాక్టికల్ గా చూపించి మరీ.. ఆన్ లైన్ లో రమ్మీ ఆడుకోమని సలహా ఇస్తున్నారు. ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నవాళ్లు.. యాడ్స్ చేస్తే వచ్చే డబ్బుల కోసం.. ఇంటింటికే కాదు.. ఫోన్ ఫోన్ కీ రమ్మీ ఆడుకోమని చెప్పడం చాలా దారుణమైన విషయం.

Prakash Raj and Rana roped in as Junglee brand ambassadors

కోయంబత్తూరుకు చెందిన ఓ సోషల్ యాక్టవిస్ట్.. రానా-ప్రకాష్ రాజ్ లపై అక్కడి కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పి ఇళగోవన్ అనే ఈ సామాజిక వేత్త.. ఈ సినిమా స్టార్లు ఇద్దరూ రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తున్నారని కేసులో వివరించాడు. 'ప్రకాష్ రాజ్.. బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటిలో వెబ్ సైట్ల ద్వారా గ్యాంబ్లింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇవి టీవీల్లో కూడా ప్రదర్శితమవుతున్నాయి. వీరు ప్రచారం చేసే సైట్ తో పాటు మరికొన్ని వెబ్ పోర్టల్స్ కూడా బెట్టింగ్ కు పురిగొల్పుతున్నాయి' అంటూ కోయంబత్తూర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు ఇళగోవన్. బెట్టింగ్.. రమ్మీ.. గ్యాంబ్లింగ్ లపై నిషేధం ఉండడంతో.. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నారు కోయంబత్తూరు పోలీసులు. ఒకవేళ కేసు నమోదైతే మాత్రం రానాకి చిక్కులు తప్పక పోవచ్చు..

English summary
Coimbatore based social activist filed a case on Rana and Prakash Raj for featuring in the advertisement for junglerummy.com website which promotes gambling.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu