మన ఊరి రామాయణం ఆడియో రిలీజ్
జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు.దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన మన ఊరి రామాయణం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ దసపల్లా హోటల్లో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరై బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.
prakash raj mana oori ramayanam priyamani raghu babu ప్రకాష్ రాజ్ మన ఊరి రామాయణం ఇళయరాజా ప్రియమణి రఘు బాబు


Click it and Unblock the Notifications