X
తెలుగు » సినిమాలు » ఒక్కడు మిగిలాడు
ఒక్కడు మిగిలాడు

ఒక్కడు మిగిలాడు

Action | Thriller | 10 Nov 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఒక్కడు మిగిలాడు స్టోరీ

ఒక్కడు మిగిలాడు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, అనీషా ఆంబ్రోస్, అజయ్ అండ్ ర్యూస్ నౌతాక్కి, సుహాసిని మణిరత్నం, మిలింద్ గునాజి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అజయ్ అండ్ ర్యూస్ నౌతాక్కి వహించారు మరియు నిర్మాతలు ఎస్ ఎస్ రెడ్డి, లక్ష్మికాంత్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శివ నందిగామ స్వరాలు అందించారు.  కథ ఇండియాలో జరిగే కథ నేపథ్యానికి వస్తే.....సూర్య (మంచు మనోజ్) పసి బిడ్డగా ఉన్నపుడే శ్రీలంక నుండి భారత దేశం వలస వస్తాడు. అందరినీ పోగొట్టుకున్న అతడిని తోటి శరణార్థులు చేరదీసి పెంచుతారు. స్థానిక యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన సూర్య.... ఇక్కడ శరణార్థుల పట్ల కొందరు రాజకీయ నాయకులు, స్వార్థపరులు చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తాడు. శ్రీలంకలో ఇది మీ దేశం కాదు మీరు శరణార్థులు అంటున్నారు. భారత దేశం వస్తే ఇది మీ దేశం కాదు శరణార్థులు అంటున్నారు. మాకు దేశం అంటూ లేదా? మాకు ఎక్కడా స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా? అని పోరాడే పాత్ర సూర్య పాత్ర. పీటర్ (మంచు మనోజ్) తమిళ ప్రజల పక్షాన పోరాడే నాయకుడు. శ్రీలంక స్వాతంత్రం తర్వాత అక్కడి ప్రభుత్వం తమిళులను భారత దేశం నుండి వలస వచ్చిన శరణార్థులుగా పేర్కొంటూ వారిని బానిసలుగా చూస్తుంది. వారికి విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయ పరంగా తొక్కేస్తుంది. వారు చేసే అన్యాయాలు సహిస్తూ బానిసలుగా బ్రతకడం కంటే ప్రత్యేక దేశం కోసం సాయుధ పోరాటం చేసి భావితరాలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుంటాడు. శ్రీలంకలో జరిగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం కంటే.... భారత దేశానికి శరణార్థులుగా వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలనుకునే వారిని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు పీటర్. పరాయి దేశం వలస వెళ్లినా అక్కడ శరణార్థులుగా బానిస బ్రతకు తప్పదు. ఇక్కడే మన స్వేచ్ఛ కోసం పోరాడితే భావితరాలకు మేలు జరుగుతుంది అని వాదిస్తుంటాడు. మరి సూర్యకు, పీటర్‌కు సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఒక్కడు మిగిలాడు కాస్ట్ & క్రూ

ఒక్కడు మిగిలాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం అజయ్ అండ్ ర్యూస్ నౌతాక్కి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శివా ఆర్ నందిగామ్
నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒక్కడు మిగిలాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా ఫస్టాఫ్ శ్రీలంకలో ప్రభుత్వానికి, తమిళ టైగర్లకు మధ్య జరిగే యుద్ధంతో రక్తపాతంతో వయొలెంట్‌గా సాగుతుంది. ఈ ఎపిసోడ్ చూస్తుంటే గతంలో వచ్చిన ‘రావణ దేశం' సినిమా సీన్లను గుర్తుకు తెస్తుంది. యాక్షన్ సీన్లతో స్క్రీన్ ప్లే స్పీడ్‌గా సాగడం వల్ల ప్రేక్షకులకు పెద్దగా బోర్ అనిపించదు. సెకండాఫ్ లో శ్రీలంక నుండి ఇండియా వైపు సముద్ర మార్గంలో వలస వస్తున్న శరణార్థుల బోటు జర్నీ ఎక్కువ చూపించారు. సాగదీత ఎక్కువగా ఉన్నట్లు ఉండటంతో ప్రేక్షకులు బోర్ పీలవుతారు.

ఒక్కడు మిగిలాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఒక్కడు మిగిలాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+