twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలు చంపుకొనే పరిస్థితి రావొద్దు.. సినీ పరిశ్రమలో తీవ్రవాదం.. మనోజ్ (ఇంటర్వ్యూ)

    తాజాగా హీరో మంచు మనోజ్ చేసిన చిత్రం ఒక్కడు మిగిలాడు. ఈ చిత్రంలో ఓ వర్గానికి నాయకుడి పాత్రను, స్టూడెంట్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

    By Rajababu
    |

    టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం ఒక్కడు మిగిలాడు. ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్, ఇతర విషయాల్లో వివాదం నెలకొన్నది. ఈ అంశంపై మంచు మనోజ్ ఇటీవల తీవ్రంగా స్పందించాడు. నవంబర్ 10న ఒక్కడు మిగిలాడు సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడాడు. పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందిస్తూ.. పరిశ్రమలో నెలకొన్న కొన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నాడు. మంచు మనోజ్ వెల్లడించిన మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

    కొత్తవాళ్లతో పనిచేయడం ఇష్టం

    కొత్తవాళ్లతో పనిచేయడం ఇష్టం

    నైజాంలో ఒక్కడు మిగిలాడు సినిమా పంపిణీ హక్కులు, థియేటర్లకు సంబంధించిన వ్యవహారంలో తలెత్తిన విషయాల గురించి నాకు ఎక్కువగా తెలియదు. పాత డిస్టిబ్యూటర్లు ఇచ్చిన ఆఫర్ నచ్చకపోవడం వల్లే కొత్త వారికి ఈ సినిమా పంపిణీ హక్కులను ఇచ్చాం. వారు కూడా మంచి రేటు, ఆఫర్ ఇచ్చారు. నాకు కూడా కొత్త వాళ్ళతో పనిచేయడం ఇష్టం. కొత్త వారిని ప్రోత్సాహించడం నాకు ఇష్టం.

    డిస్టిబ్యూటర్లకు మధ్య విభేదాలు

    డిస్టిబ్యూటర్లకు మధ్య విభేదాలు

    ఒక్కడు మిగిలాడు పంపిణీ విషయంలో పాత డిస్టిబ్యూటర్లకు కొత్త డిస్టిబ్యూటర్లకు మధ్య విభేదాలు వచ్చాయి. వారి మధ్య మాట మాట పెరుగడంతో గొడవ జరిగింది. ఫిలిం ఛాంబర్‌లో వాగ్వాదం జరుగడంతో పోలీసులను పిలిచారు. సినిమా పరిశ్రమలో ఇంత మంది పెద్దలు ఉండగా పోలీసుల జోక్యం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.

    మంత్రి కేటీఆర్‌ను కలుస్తాను..

    మంత్రి కేటీఆర్‌ను కలుస్తాను..

    సినీ పరిశ్రమలో ఎలాంటి వివాదం చోటుచేసుకొన్నగానీ ఫిలిం చాంబర్ డిసైట్ చేస్తుంది. వారికి ఆ హక్కు ఉంది. సినిమా పంపిణీ విషయంలో జరిగే వివాదాల గురించి మంత్రి కేటీఆర్‌ను, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాసయాదవ్ గారిని కలుస్తాను. సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను వారికి వివరిస్తాను.

    నిర్మాతకు నానా అవస్థలు

    నిర్మాతకు నానా అవస్థలు

    ఓ సినిమాను విడుదల చేయడానికి పరిశ్రమలో నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా తీయడానికి హీరోను ఒప్పించి, పెళ్లాం తాళిబొట్టు, ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తే రిలీజ్ చేయడానికి నిర్మాత నానా అవస్థలు పడుతున్నారు.

    రిలీజ్‌ను అడ్డుకొంటున్నారు..

    రిలీజ్‌ను అడ్డుకొంటున్నారు..

    ప్రజల వినోదం కోసం నిర్మాతలు సినిమా తీస్తే రిలీజ్‌ను అడ్డుకొంటున్నారు. థియేటర్లు ఇవ్వడం లేదు. చర్చలు జరిపి సమస్యను పరిష్కరిద్దామంటే మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటున్నారు. దొంగల్లా పారిపోతున్నారు.

    సినీ పరిశ్రమలో తిరుగుబాటు

    సినీ పరిశ్రమలో తిరుగుబాటు

    నిర్మాతలు అన్యాయానికి గురవుతున్నామని అనిపిస్తే తిరుగుబాటు మొదలవుతుంది. ఏదైనా విషయాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తే ఓ నాయకుడు పుడుతాడు. అప్పుడే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటును తొక్కేయ్యాలని చేస్తే తీవ్రవాదం మొదలవుతుంది. ప్రస్తుతం తిరుగుబాటు స్థాయిలో ఉన్నాం. ఆ పరిస్థితి తీవ్రవాదంగా మారకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది.

    నిర్మాతలు చంపుకొనే స్థితి రావొద్దు

    నిర్మాతలు చంపుకొనే స్థితి రావొద్దు

    ఒకడి కడుపు కాలిపోయి.. ఫ్యామిలీ అంతా నాశనమైతే దానికి కారణం మరొకడు అని భావిస్తే ఆ ఫ్యామిలీని ఏదో ఒకరోజు వేసేయాలని చూస్తాడు. ఆ పరిస్థితి వస్తే మన ఇండస్ట్రీకి వస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఒక నిర్మాత, మరో నిర్మాతను చంపేశాడట అనే విషయం చాలా దరిద్రంగా ఉంటుంది.

    అందరం కలిసి ఉంటున్నాం

    అందరం కలిసి ఉంటున్నాం

    ఇప్పుడు పరిశ్రమలో అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్నారు. దేవుడి దయవల్ల మా జనరేషన్‌లో ఆర్టిస్టులమందరం చాలా క్లోజ్‌గా ఉంటున్నాం. సినీ పరిశ్రమలో తీవ్రవాదం మొదలు కాకముందే ఈ పరిస్థితికి పుల్‌స్టాప్ పెట్టాలి.

    ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను దేవుడిగా..

    ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను దేవుడిగా..

    ఇక ఒక్కడు మిగిలాడు సినిమా విషయానికి వస్తే మంచి చెడుల గురించి చెప్పలేదు. వాస్తవ కథను తెరకెక్కించాం. సినిమా ట్రైలర్‌లో చెప్పినట్టే.. అల్లూరి, భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ ఇప్పటికి స్వాతంత్య పోరాటం చేస్తుంటే వాళ్లను మనం టెర్రరిస్టులుగానే పిలుస్తామా?. వీరిలో కొందరి పేర్లు మన రికార్డుల్లో టెర్రరిస్టులుగానే ఉన్నాయి.

    ఎల్టీటీఈ ప్రభాకరన్ గురించి

    ఎల్టీటీఈ ప్రభాకరన్ గురించి

    నా స్నేహితుల ఇళ్లలో గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు, దేవుడితోపాటు ఎల్టీటీఈ ప్రభాకరన్ ఫొటో కూడా ఉంది. హిట్లర్‌‌ను దేవుడిగా చూస్తున్నారా? కానీ ప్రభాకరన్ కొంత మంది ప్రజలు దేవుడిగా చూస్తున్నారు. మేము చూసిన లీడర్లలో ప్రభాకరన్ చాలా గొప్పవాడు. ఆయన కూల్ డ్రింక్ తాగడు. కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే తాగుతాడు. ఆయన భార్య కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. కేవలం మూడు చీరెలు మాత్రమే ఉంటాయి. ఒకటి ఒంటి మీద, రెండోది ఉతకడానికి, మూడోది వేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ ఛీప్ చెప్పిన విషయాన్ని మనోజ్ తెలిపారు.

    English summary
    Tollywood hero Manchu Manoj's latest movie Okkadu Migiladu. This movie is directed by Ajay Andrews Nuthakki. Okkadu Migiladu movie is based on War story. This movie set to release on November 10th. In this occassion, Manchu Manoj speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X