ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు స్టోరీ
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, సోహెల్ సయ్యద్ సోహైల్, మృణాళిని రవి, మీనా, వరుణ్ సందేశ్, రష్మీ, సునీల్, అలీ, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, పృథ్వి, రాజా రవీంద్ర, కృష్ణ భగవాన్, వివా హర్ష, హేమ, సునీల్ , సురేఖ వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి వహించారు. నిర్మాత కోనేరు కల్పన నిర్మించారు. సంగీతం ఎస్ వి కృష్ణ రెడ్డి అందించారు. కథ విజయ్ (సోహెల్ సయ్యద్ ర్యాన్) రెండు డిజాస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్. మధ్య తరగతి కుటుంబం (హేమ, సూర్య) కుమారుడైన విజయ్.. బిజినెస్ మ్యాన్ వెంకట రమణ (రాజేంద్ర ప్రసాద్, మీనా) దంపతుల కుమార్తె (హాసిని)తో తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. డబ్బు, సంస్కారానికి ప్రాధాన్యం ఇచ్చే వెంకటరమణ తన కూతురు ప్రేమను నిరాకరిస్తాడు. ఈ క్రమంలో విజయ్‌కి నిర్మాత ముణికొండ అనకొండ ( సునీల్) మూడో సినిమా అవకాశం ఇస్తాడు. రెండు సినిమాలు ఫ్లాఫైన తర్వాత విజయ్ పరిస్థితి ఏమిటి? పగటి కలలు కనే విజయ్‌కి తన తండ్రి చేసిన ఉపదేశం ఏమిటి? హాసినితో పెళ్లికి నిరాకరించిన తర్వాత విజయ్ ఏం చేశాడు? మూడో సినిమా అవకాశం వచ్చిన తర్వాత హిట్ కొట్టాడా? తన ప్రేమను గెలిపించుకోవడానికి విజయ్ ఏం చేశాడు? చివరకు విజయ్, హాసిని ప్రేమను వెంకటరమణ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు సినిమా
Read More