twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకులకు అటెన్షన్ డిజార్డర్.. ఆ రూమర్లు నిజం కాదు.. నేను వేస్ట్ ఫెలోనే.. హను రాఘవపూడి

    |

    భావోద్వేగభరిత ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది ఓ ప్రత్యేకమైన పంథా. ఆయన ప్రతిభకు అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి చిత్రాలు అద్దంగా నిలిచాయి. హను రాఘవపూడి తాజాగా రూపొందించిన చిత్రం పడిపడి లేచే మనసు. తొలి ఆట నుంచే ఈ చిత్రం మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్నది. పడి పడి లేచే మనసు సినిమా రిలీజ్ తర్వాత హను ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలు మీకోసం..

    నాపై మణిరత్నం సినిమాల ప్రభావం

    నాపై మణిరత్నం సినిమాల ప్రభావం

    నా సినిమాలపై మణిరత్నం చిత్రాల ప్రభావం ఉంటుందనే విమర్శ గురించి నాకు తెలుసు. అది అందాల రాక్షసి సినిమాలో చెప్పించిన డైలాగ్స్ వల్ల అలాంటి ఒపీనియన్ ఏర్పడిందనుకొంటాను. ఆ విమర్శ నుంచి నేను బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక ముందు అలాంటి విమర్శలు రాకుండా చూసుకొంటాను.

    నా కారణంగా బడ్జెట్ పెరగడం

    నా కారణంగా బడ్జెట్ పెరగడం

    నా సినిమాలకు బడ్జెట్ పెరిగిపోతుందనే అపవాదు ఉంది. పడి పడి లేచే మనసు చిత్రానికి కొద్దిగా బడ్జెట్ పెరిగింది. కోల్‌కతాలో వాతావారణం సహకరించకపోవడం వల్లే అలా బడ్జెట్ పెరిగిపోయింది. అంతేకాని నా వల్ల, నా పనితీరు వల్ల బడ్జెట్ పెరుగలేదు.

    తల్లిగా ప్రియారామన్ తీసుకోవడం

    తల్లిగా ప్రియారామన్ తీసుకోవడం

    సినిమా ఫ్రెష్‌గా ఉండటానికి ప్రియారామన్‌ను తల్లిగా తీసుకోవాలనే ఆలోచన చేశాం. తల్లి పాత్రలు చూస్తే రొటీన్ కావొద్దని, అలాగే తల్లిదండ్రుల మధ్య ఉండే భావోద్వేగాలను పండించడానికి కొత్తవారైతే బాగుంటుందని అనుకొన్నాం. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ సూచన మేరకే ప్రియారామన్‌ను తీసుకొన్నాం.

     నా దృష్టికి రూమర్లు వచ్చాయి

    నా దృష్టికి రూమర్లు వచ్చాయి

    పడి పడి లేచే మనసు చిత్రంపై ఓ రూమర్ నా దృష్టికి వచ్చింది. సినిమాలో చాలా సీన్లు రీషూట్ చేశామనే మీడియాలో వార్తలు చూశాం. కానీ ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు. నేను పక్కాగా షాట్ డివిజన్ చేసుకొని షూట్‌కు వెళ్తాను. స్పాట్‌లో ఇంప్రూవైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను అని హను రాఘవపూడి తెలిపారు.

    అటెన్షన్ డిజార్డర్‌తో ప్రేక్షకులు

    అటెన్షన్ డిజార్డర్‌తో ప్రేక్షకులు

    ప్రస్తుతం ప్రేక్షకుల్లో అటెన్షన్ డిజార్డర్ ఉంది. తెరపైన చూసేదాని కంటే ఆలోచించే తత్వం ఎక్కువైంది. ఎవరైనా చెబుతుంటే వినకుండా విశ్లేషణ ఎక్కువైంది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. గతంలో కథ చెబుతుంటే ఏమి జరుగుతుందో అనే విషయంతో ఆసక్తిగా పూర్తిగా చూసేవారు. ఇప్పుడది లేకపోవడం చాలా కష్టమవుతున్నది.

     కెమెరా ముందు నేను వేస్ట్ ఫెలోని

    కెమెరా ముందు నేను వేస్ట్ ఫెలోని

    ప్రస్తుతం ఆడియెన్స్‌లో సహనం లేదు. ఒక్క క్షణం కూడా నిశ్శబ్దం ఉండకూడదు. ఏదో ఒకటి తెరపైన జరిగిపోవాలి. ప్రేక్షకులకు సహనం లేకపోవడం వల్ల నా డైరెక్టర్లకు కథ చెప్పడంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రంలో నేను ఒక్క సీన్‌లో కనపడిన విషయం నిజమే. ఎదో తప్పనిపరిస్థితుల్లో నటించాను. నేను కెమెరా ముందు వేస్ట్ ఫెలోని అని హను రాఘవపూడి అన్నారు.

    English summary
    Padi Padi Leche Manasu has done an average business at the worldwide box office in its first weekend. With this, actor Sharwanand has tasted his first flop of his career. Sharwanand and Sai Pallavi starrer opened to an average response at the ticket counters on First week. As per reports, This movie collected nearly Rs.7.5 crores worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X