రాజావారి చేపలచెరువు స్టోరీ
రాజావారి చేపలచెరువు సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పోసాని కృష్ణ మురళి, గైనా, జుబైన్ ఖాన్, బృహ్మానందం, అలీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, సునీల్, వేణు మాధవ్, గిరిబాబు, కొండవలస, బ్రహ్మాజీ, ఈటీవి ప్రభాకర్, సన తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి నిర్వహించారు మరియు నిర్మాతలు: వై రూపేష్, బి.సుబ్రమణ్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చారు. కథ 'ఆపరేషన్ దుర్యోధన'ను గుర్తు చేసేలా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తనను ఇబ్బంది పెట్టిన పై అధికారులకు, రాజకీయనాయకులకు తెలివిగా బుద్ది చెప్పటమే ఈ చిత్ర కధాంశం. లోకల్ ఎమ్మల్యే తమ్ముడు తనను రిజెక్టెడ్ చేసినందుకు ఓ అమ్మాయి కళ్ళు పోగెడతాడు. అవినీతిని సహించలేని పవర్ ఫుల్ ఎస్సై రాజా(పోసాని) ఆ కేసును టేకప్ చేస్తాడు. ఎమ్మల్యే తమ్ముడు(కళ్ళు పోగెట్టాడని)అతని కళ్ళు బలవంతంగా తీసి ఆ అమ్మాయికి పెట్టించి న్యాయం చేస్తాడు. దాంతో పగపట్టిన ఎమ్మల్యే..రాజా ఉద్యోగాన్ని, అతని భార్య(గైనా) గర్భకోశాన్ని తీసేసి పగ తీర్చుకుంటాడు. ఆ స్ధితిలో రాజా బ్రతుకు తెరువు కోసం ఎందరికో లంచాలు అవీ ఇచ్చి ఓ చేపల చెరువు పెట్టుకుంటాడు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న స్ధితిలో తన అందమైన చేపలు చెరువును ఎవరో కిడ్నాప్ చేసారంటూ రాజా పోలీస్ స్టేషన్ కి వెళతాడు. వాళ్ళు ఆ కేసు నమోదు చేసుకోరు. అప్పుడు మీడియా వారి సాయంతో ఆ కేసును రిజస్టర్ చేస్తాడు. ఆ తర్వాత ఆ చేపల చెరువు ని ఎవరు కిడ్నాప్ చేసారు..పోలీసులు పట్టుకోలగిలిగారా..అసలేం జరిగింది అనేది మిగతా కథ.
Read More