X
తెలుగు » సినిమాలు » సెల్ఫీ రాజా
సెల్ఫీ రాజా

సెల్ఫీ రాజా

Comedy | Romance | 15 Jul 2016 | U/A | 126 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సెల్ఫీ రాజా స్టోరీ

సెల్ఫీ రాజా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, సాక్షిచౌదరి, కామ్నా రనవత్, నాగినీడు, కృష్ణ భగవాన్, పృద్వి  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఈశ్వర్ రెడ్డి నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత రామబ్రహ్మాం సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు. కథ సెల్ఫీరాజా(అల్లరి నరేష్)కు సెల్పీల పిచ్చి, అతను పోలీస్ కమీషనర్ కూతురు శ్వేత(కామ్న రనావత్)ని ప్రేమించి,పెళ్లిచేసుకుంటాడు. ఫస్ట్ నైట్ తమకు వచ్చిన గిప్ట్ లు చూస్తూంటే అందులో ఓ లెటర్, నరేష్ వేరే అమ్మాయితో ఉన్నట్లు ఉన్న కొన్ని ఫొటోలు ఉంటాయి. వీటిని చూసిన భార్య..తట్టుకోలేక.... సెల్పీరాజాను అనుమానించి గొడవ పెట్టుకుని రాజాని వదిలేసి వెళ్లిపోతుంది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేకుండా తను బ్రతకలేనని గ్రహించిన రాజా ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తాడు. అవేమి సక్సెస్ కాకపోవటంతో సీరియల్ కిల్లర్ (రవిబాబు)కు సుపారి ఇస్తాడు తనను చంపమని. ఈలోగా భార్యకు అవన్నీ వేరేవాళ్లు కావాలని చేసారని, అసలు నిజం తెలిసి తిరిగి వెనక్కి వస్తుంది. కానీ రాజా కు ఆనందం మిగలదు. ఎందుకంటే తను ఒప్పుకున్న పనిని ఎట్టిపరిస్దితుల్లోనూ పూర్తి చేసే కిల్లర్ రవిబాబు అప్పటికే రాజాని చంపటానికి బయిలుదేరిపోయాడు. అంతేకాదు మరికొంత మంది సెల్ఫీ రాజాని చంపాలని తిరుగుతూంటారు. ఆ సిట్యువేషన్ లో సెల్ఫీ రాజా ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎలా కిల్లర్ నుంచి, మిగతావాళ్లనుంచి తప్పించుకుంటాడు... కిల్లర్ కాకుండా సెల్పీరాజా ని ఇంకెవరు చంపాలనుకుంటారు అనేది మిగతా కథ.
Read More

సెల్ఫీ రాజా కాస్ట్ & క్రూ

సెల్ఫీ రాజా సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఈశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత రామబ్రహ్మం సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సెల్ఫీ రాజా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అల్లరి నరేష్ కు మిగతా హీరోలు ఎవరికీ లేని ఓ పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. ఎన్ని పరాజయాలు వచ్చినా కామెడీ హీరో అనే ముద్ర ఉండటంతో మినిమం గ్యారెంటి చిత్రం ఇవ్వగలిగితే హాళ్లు నిండుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకోవటానికి వస్తారు. అయితే అల్లరి నరేష్ ఎందుకనో తనకు తగిన కామెడీ కథలు ఎంచుకోవటంలో వెనకపడుతున్నాడు. దానికి తోడు అతని సినిమా అంటే స్పూఫ్ ల మయంగా ఉంటాయనే పేరు వచ్చేసింది. సుడిగాడు హిట్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ స్పూఫ్ లతో నింపేయటమే కారణం కావచ్చు. అయితే ఎన్ని స్ఫూఫ్ లు ఉన్నా చెప్పుకోవటానికి సినిమాలో ఓ స్టోరీ లైన్ అనేది ఉంటే బాగానే ఉంది కదా అనిపిస్తుంది. అయితే ఈ సారి స్ఫూఫ్ లు చేయను.. అంటూనే సెల్పీ రాజా మొత్తం స్పూఫ్ లతో నింపేసాడు.

సెల్ఫీ రాజా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సెల్ఫీ రాజా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+