»   » అల్లరి నరేష్ ‘సెల్ఫీ రాజా’ టీజర్ అదిరింది (వీడియో)

అల్లరి నరేష్ ‘సెల్ఫీ రాజా’ టీజర్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య అల్లరి నరేష్ సినిమాలు లేక ఆయన స్టైల్ లో సాగే సినిమాలు మిస్సవుతున్నట్లు చాలా మంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇపుడు ఆ లోటును తీర్చడానికే అన్నట్లు అల్లరి నరేష్ 'సెల్ఫీ రాజా'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజైంది.

ఆ మధ్య అల్లరి నరేష్ సినిమాలు చాలా రోటీ అయ్యాయనే విమర్శలు వచ్చాయి. అందుకే ఆయన వరుస సిసినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. అందుకే ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న ఈ కామెడీ స్టార్ సరికొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Also See: సెల్ఫీ కోసం ఎక్కడున్నాడో కూడా చూసుకోకుండా అల్లరి నరేష్

ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో వరల్డ్ మొత్తం సెల్పీ పిచ్చిలో పడి ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే కాన్సెప్టును తన సినిమా కాన్సెప్టుగా వాడుకున్నాడు. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం అనే చిత్రాన్ని తెరకెక్కించిన ఈశ్వర్ రెడ్డి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు ఈవీవీ సత్యనారాయణ జయంతి కావడంతో సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అల్లరి నరేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రపంచమంతా సెల్ఫీ మాయలో ఉండగా, సెల్ఫీ రాజా అనే చిత్రం నరేష్‌కు మంచి హిట్‌ను అందిస్తోందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈచిత్రంలో అల్లరి నరేష్ సరసన సాక్షి చౌదరి, కామ్నా రనావత్ నటిస్తున్నారు.

English summary
The Teaser of Allari Naresh's upcoming Comedy entertainer Selfie Raja is out here for you. Sakshi Chaudhary & Kamna Ranawat paired with him for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu