»   » స్ఫూఫ్ లు ఆపు రాజా ( అల్లరి నరేష్ ‘సెల్ఫీ రాజా’రివ్యూ)

స్ఫూఫ్ లు ఆపు రాజా ( అల్లరి నరేష్ ‘సెల్ఫీ రాజా’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

అల్లరి నరేష్ కు మిగతా హీరోలు ఎవరికీ లేని ఓ పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. ఎన్ని పరాజయాలు వచ్చినా కామెడీ హీరో అనే ముద్ర ఉండటంతో మినిమం గ్యారెంటి చిత్రం ఇవ్వగలిగితే హాళ్లు నిండుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకోవటానికి వస్తారు. అయితే అల్లరి నరేష్ ఎందుకనో తనకు తగిన కామెడీ కథలు ఎంచుకోవటంలో వెనకపడుతున్నాడు. దానికి తోడు అతని సినిమా అంటే స్పూఫ్ ల మయంగా ఉంటాయనే పేరు వచ్చేసింది.

ముఖ్యంగా సుడిగాడు హిట్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ స్పూఫ్ లతో నింపేయటమే కారణం కావచ్చు. అయితే ఎన్ని స్ఫూఫ్ లు ఉన్నా చెప్పుకోవటానికి సినిమాలో ఓ స్టోరీ లైన్ అనేది ఉంటే బాగానే ఉంది కదా అనిపిస్తుంది. అయితే ఈ సారి స్ఫూఫ్ లు చేయను.. అంటూనే సెల్పీ రాజా మొత్తం స్పూఫ్ లతో నింపేసాడు. కన్నడ సినిమా విక్టరీ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం నరేష్ నేటివిటికి తగ్గట్లు స్ఫూఫ్ లతో నింపేయటం ఎంతవరకూ కలిసి వచ్చిందో చూద్దాం.


సెల్ఫీరాజా(అల్లరి నరేష్)కు సెల్పీల పిచ్చి, అతను పోలీస్ కమీషనర్ కూతురు శ్వేత(కామ్న రనావత్)ని ప్రేమించి,పెళ్లిచేసుకుంటాడు. ఫస్ట్ నైట్ తమకు వచ్చిన గిప్ట్ లు చూస్తూంటే అందులో ఓ లెటర్, నరేష్ వేరే అమ్మాయితో ఉన్నట్లు ఉన్న కొన్ని ఫొటోలు ఉంటాయి. వీటిని చూసిన భార్య..తట్టుకోలేక.... సెల్పీరాజాను అనుమానించి గొడవ పెట్టుకుని రాజాని వదిలేసి వెళ్లిపోతుంది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేకుండా తను బ్రతకలేనని గ్రహించిన రాజా ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తాడు.


అవేమి సక్సెస్ కాకపోవటంతో సీరియల్ కిల్లర్ (రవిబాబు)కు సుపారి ఇస్తాడు తనను చంపమని. ఈలోగా భార్యకు అవన్నీ వేరేవాళ్లు కావాలని చేసారని, అసలు నిజం తెలిసి తిరిగి వెనక్కి వస్తుంది. కానీ రాజా కు ఆనందం మిగలదు. ఎందుకంటే తను ఒప్పుకున్న పనిని ఎట్టిపరిస్దితుల్లోనూ పూర్తి చేసే కిల్లర్ రవిబాబు అప్పటికే రాజాని చంపటానికి బయిలుదేరిపోయాడు. అంతేకాదు మరికొంత మంది సెల్ఫీ రాజాని చంపాలని తిరుగుతూంటారు. ఆ సిట్యువేషన్ లో సెల్ఫీ రాజా ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎలా కిల్లర్ నుంచి, మిగతావాళ్లనుంచి తప్పించుకుంటాడు... కిల్లర్ కాకుండా సెల్పీరాజా ని ఇంకెవరు చంపాలనుకుంటారు అనేది మిగతా కథ, కథనం.


సెల్పీల పిచ్చి నుంచి వచ్చే కామెడీ అంటూ పబ్లిసిటీలో ఊదరకొట్టారని కానీ ఎక్కడా ఈ కథలో ఆ ఛాయలే లేవు. ఏదో టైటిల్ పెట్టాం కదా అని, కొన్ని సెల్పీ పిచ్చి సీన్స్ పెట్టారు కానీ కథకు, ఆ సీన్స్ కు సంభంధం ఉండదు. సెల్పీ పిచ్చి అని ఎత్తుకున్నప్పుడు ఆ సెల్ఫీ పిచ్చి వల్ల ఒకడు జీవితంలో వచ్చిన సమస్యలు, దాంతో వాడి లైఫ్ లో వచ్చిన మార్పు చూపిస్తే బాగుండేది.


స్లైడ్ షో లో మిగతా రివ్యూ ...


స్ఫూఫ్ లు పేర్చుకుంటూ

స్ఫూఫ్ లు పేర్చుకుంటూ


అలాగే....స్టోరీ లైన్ బాగా చిన్నది కావటంతో తమకు తోచిన, స్ఫూఫ్ లన్నీ పోగు చేసి పేర్చుకుంటూ పోయారు. సీన్స్ పెంచే ప్రాసెస్ లో తాము ఎత్తుకున్న స్టోరీలైన్ కు దూరంగా వెళ్తున్నామనే ఆలోచన కూడా లేకుండా చేసేసారు.డబుల్ క్యాకర్టర్ ఏమిటో

డబుల్ క్యాకర్టర్ ఏమిటో


ఈ సినిమా సెకండాఫ్ లో అల్లరి నరేష్ డ్యూయిల్ రోల్ లో కనపడతాడు. కానీ అర్దం పర్దం లేని సీన్స్ తో ఆ క్యారక్టర్ సాగుతుంది. అప్పటివరకూ కిల్లర్ నుంచి తప్పించుకునే కథగా సాగింది..డ్యూయిల్ గా మారి తికమకపెడుతుంది.హైలెట్

హైలెట్


ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బాగా నవ్చించాయి. ముఖ్యంగా హీరో ఆత్మహత్యాప్రయత్నం సమయంలో ఒకళ్లు తరవాత మరొకరు కలవటం అనేది బాగా నవ్వించింది.సెకండాఫ్ డల్

సెకండాఫ్ డల్


ఫస్టాఫ్..కు సరపడ స్టఫ్ ఉండటంతో ఏ సమస్యా రాలేదు. సెకండాఫ్ కు వచ్చేసరికి... కిల్లర్ , అల్లరి నరేష్ కు జరగాల్సిన కథ దారి తప్పి ఎటెటో వెళ్తూ చిరాకు పెడుతుంది.పేస్ బుక్ డైలాగ్స్

పేస్ బుక్ డైలాగ్స్

ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ ఎక్కడో విన్నట్లు ఉండటానికి కారణం ..వాటిలో చాలా భాగం ఫేస్ బుక్ లో షేర్ అవుతున్నవే కావటం. మరీ ఇంతలా రైటర్స్...ఫేస్ బుక్ రాజాలుగా మారిపోతే కష్టం. ఎందుకంటే ఫేస్ బుక్ లో ఆ డైలాగులని అందరూ చూసి షేర్ చేస్తూనే ఉన్నారు.పేలని జోక్స్

పేలని జోక్స్


చాలా చోట్ల కథకు సంభంధం లేకుండా పంచ్ లు, జోక్ లు రావటంతో అవి ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేని పరిస్దితి ఏర్పడింది. అవి టీవీ వాళ్లు కట్ చేసుకుని బిట్స్ గా వేసుకోవటం కోసం పెట్టినవి అయ్యింటాయి.తప్పనిపించలేదా

తప్పనిపించలేదా


కృష్ణ భగవాన్ , అతని భార్య చెమిటివాళ్లుగా చూపించి సినిమా మొత్తం ఓ ట్రాక్ లా వాళ్లపై కామెడీ చేసే ప్రయత్నం చేసారు. శారీరిక లోపాలపై కామెడీ చెయ్యకూడదనే ఆలోచన ఎందుకు దర్శక,నిర్మాతకు రాలేదో మరి.ఎప్పటిలాగే

ఎప్పటిలాగే


నరేష్ అద్బుతంగానూ చెయ్యలేదు..అలాగని బాగా చెయ్యకుండాను పోలేదు. ఎప్పటిలాగే స్ఫూఫ్ ల్లో మిగతా హీరోలను అనుకరిస్తూ నవ్వండి అంటూ మనవంక చూస్తూ చేసేసాడు.మరో హైలెట్

మరో హైలెట్


సినిమాలో మరో హైలెట్..ధర్టీ ఇయిర్స్ పృధ్వీ. బాలయ్యను, అల్లు అర్జున్ అనుకరిస్తూ చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నిజానికి అతనే హీరో అన్నట్లు చెలరేగిపోయాడు.టెక్నికల్ గా

టెక్నికల్ గా


ఈ సినిమాలో టెక్నికల్ గా చెప్పుకునే విధంగా ఏ విభాగం అద్బుతంగా లేదు. సంగీతం నుంచి ఎడిటింగ్ దాకా ప్రతీది మనని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతూనే ఉంది. ఎవరెవరు

ఎవరెవరు


బ్యానర్ : ఎకె ఎంటర్ట్నైమ్మెంట్స్, గోపీ ఆర్ట్స్
నటీనటులు :అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్మ రనావత్, ఫృధ్రీ, రవిబాబు, కృష్ణ భగవాన్, నాగినీడు, సప్తగిరి తదితరులు
సంగీతం : సాయి ఖార్తీక్
ఎడిటర్ : ఎమ్.ఆర్ వర్మ
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : జి ఈశ్వరరెడ్డి
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
విడుద‌ల‌ తేదీ : 15-07-2016English summary
Allari Naresh’s latest Selfie Raja directed by Eshwar Reddy released today with divide talk. This movie can be called a time pass movie with few scenes that can be laughed aloud.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu