For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘చెప్పను బ్రదర్‌’చూస్తే బన్ని, ఆయన ఫ్యాన్స్ పడి పడీ నవ్వుతారు

  By Srikanya
  |

  హైదరాబాద్ :ఈ రోజు విడుదల అవుతున్న అల్లరి నరేష్ తాజా చిత్రం 'సెల్ఫీ రాజా' టీజర్‌లో 'చెప్పను బ్రదర్‌' డైలాగ్‌ గురించి అందరూ మాట్లాడుకొంటున్నారనే సంగితి తెలిసిందే. బన్నిని చెప్పిన మాటను స్ఫూఫ్ చేసిన ఈ డైలాగు గురించి అల్లరి నరేష్ వివరణ ఇచ్చారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై స్పందించారు.

  అల్లరి నరేష్ మాట్లాడుతూ... "ఏవండీ... ఆ ట్రైలర్‌లో బోలెడు డైలాగులున్నాయి. అవన్నీ వదిలేసి అదొక్కటే అడిగితే ఎలా? ఓ సరదా సందర్భంలో వచ్చే డైలాగ్‌ అది. అల్లు అర్జున్‌కీ ఆ సన్నివేశం నచ్చుతుంది." అన్నారు.

  అలాగే చిత్రంలో డైలాగు కాంట్రవర్శి అవుతుందేమో అనే విషయమై చెప్తూ... 'మేము చెప్పను బ్రదర్ ను సరదాగానే ఉపయోగించాం. సినిమా చూస్తే కానీ.. దాని అసలు మీనింగ్ అర్ధం కాదు. ఎంత సున్నితంగా ఈ డైలాగ్ ఉంటుందంటే.. ఒకవేళ బన్నీ ఈ సీన్ ని చూసినా పడీపడీ నవ్వుతాడు' అంటున్నాడు నరేష్.

  అల్లరి నరేష్ ఇంకే చెప్పాడు..ఆ విశేషాలు..స్లైడ్ షోలో

  నిజంగానే మీకూ సెల్ఫీలంటే ఇష్టమా?

  నిజంగానే మీకూ సెల్ఫీలంటే ఇష్టమా?

  ఇష్టం కాదు భయం. నాలుగేళ్ల క్రితం వరకూ మనకు సెల్ఫీ అంటే ఏంటో తెలీదు. కానీ ఇప్పుడు శవంతోనూ సెల్ఫీలు తీసుకొంటున్నారు. ఆ పిచ్చి వల్ల కలిగే అనర్థాల్ని సరదాగా చూపించాం.

  ‘సెల్ఫీరాజా' ఏం చేస్తుంటాడు?

  ‘సెల్ఫీరాజా' ఏం చేస్తుంటాడు?

  పేరుకి తగ్గట్టే సెల్ఫీలు తీసుకొంటుంటాడు. అదో సరదా వాడికి. కానీ చివరికి అదే వాడి ప్రాణంమీదకు తీసుకొస్తుంది. అదెలా, ఆ తరవాత ఏమైంది? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

  ఇబ్బందే కానీ..

  ఇబ్బందే కానీ..

  సినిమా వాళ్లు ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీ అంటూ హడావుడి చేస్తుంటారు. నిజానికి అదో గౌరవం. కానీ సమయం, సందర్భం ఇవి రెండూ చూసుకోవాలి. ఓసారి సినిమా నటుడెవరో చనిపోతే ఆయనింటికి వెళ్లా. ఆ బాధలో నేనుంటే ‘సార్‌ మీతో సెల్ఫీ తీసుకోవొచ్చా' అని ఒకాయన అడిగారు.

   స్పూఫ్‌లను వదలరా?

  స్పూఫ్‌లను వదలరా?

  వాటిని నేనెప్పుడో వదిలేశా. ‘సుడిగాడు' తరవాత దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశా. ఒక్క సినిమాలోనూ నేను స్పూఫ్‌ చేయలేదు. కానీ స్పూఫ్‌ అనగానే అందరికీ నేనే గుర్తొస్తున్నా.

  వరుసగా ఫ్లాఫ్ లు చుట్టుముట్టాయి...

  వరుసగా ఫ్లాఫ్ లు చుట్టుముట్టాయి...

  అవునండీ. కానీ నేను ఈ విషయంలో ఎవ్వరినీ నిందించడం లేదు. అవన్నీ నా ఇష్టంతో చేసిన సినిమాలే. ‘లడ్డుబాబు', ‘యాక్షన్‌ త్రీడీ', ‘బ్రదరాఫ్‌ బొమ్మాళి', ‘బందిపోటు' కొత్తదనం చూపిద్దామని చేసిన సినిమాలు. దురదృష్టవశాత్తూ ఆడలేదు. అందుకే ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నా.

  పోటీ పెరిగిందనుకుంటాను

  పోటీ పెరిగిందనుకుంటాను

  కామెడీ చేసే హీరోలు ఎక్కువైపోయారు... దాంతో పోటీ పెరిగిపోయినట్టుంది... కానీ ఆ పోటీ కూడా మంచిదే. ఇది వరకు కామెడీని కేవలం ట్రాక్‌ల కోసం వాడేవారు. ఇప్పుడు వినోదం లేకపోతే సినిమా నడవడం లేదు. వినోదం విలువ అంతలా పెరిగింది.

  English summary
  Talking about the 'Cheppanu Brother' controversy , Allari Naresh said, "We don't mean any offence to Bunny or his fans with this dialogue.You've to watch the film to find about it. Even Bunny will break into laughs if he sees that scene".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X