»   » బన్నిపై సెల్ఫీ రాజా సెటైర్, శర్వానంద్ వాయిస్, నోటి దూలతో సమస్యలు

బన్నిపై సెల్ఫీ రాజా సెటైర్, శర్వానంద్ వాయిస్, నోటి దూలతో సమస్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన బన్ని... 'చెప్పను బ్రదర్' అన్న ఒక్క మాటతో చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతా దాన్ని మర్చిపోయారు అనుకున్న టైమ్ లో అల్లరి నరేష్ దాన్ని తవ్వి తీసే కార్యక్రమం పెట్టుకున్నాడు. అల్లరి నరేష్ తాజా చిత్రం సెల్ఫీ రాజా లో ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ చేత చెప్పను బ్రదర్ అనే డైలాగ్ చెప్పి ట్రైలర్ వదిలారు.

సినిమా గురించి జనం మాట్లాడుకోవటం కోసం ఆ పంచ్ ఈ సినిమాలో వేసినా, బన్ని అభిమానులకు మాత్రం మండుతోంది. ఎందుకంటే కొందరు ఫృద్వీ అన్న డైలాగుని కట్ చేసి ట్విట్టర్, ఫేస్ బుక్ లలో షేర్ చేస్తున్నారు.

అల్లరి నరేష్ చేస్తున్న సెల్ఫీ రాజా సినిమా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ట్రైలర్ అంతా నరేష్ నవ్వులతో బాగానే ఉన్నా.. పృధ్వి పోలీస్ పాత్రలో ట్రైలర్ ఎండింగ్ లో ఎవడ్రా నువ్వు అంటే చెప్పను బ్రదర్ అంటూ బన్ని వాడిన ఫేమస్ డైలాగ్ వాడారు. ట్రైలర్ అంతా ఓ ఎత్తైతే పృధ్వి అన్న ఆ ఒక్కమాట ఎన్నో అర్ధాలకు దారితీయటం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.మొత్తానికి పృధ్వి బన్ని టార్గెట్ చేసి ఆ డైలాగ్ చెప్పించారన్నమాట.

ఈశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సెల్ఫీ రాజా ఈ నెల 15న రిలీజ్ కు సిద్ధమైంది. అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో కామ్న రనావత్, సాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సెల్ఫీ రాజాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లరి నరేష్.

Bunnyh's Cheppanu Brother spoof in Selfie Raja

దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. సినిమా కూడా అలాగే కొత్తగా ఉంటుంది. రెండు గంటలపాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. అతనికి సెల్ఫీవీక్‌నెస్‌. దానివల్ల మంచి, చెడు రెండూ జరుగుతాయి. నోటి దూలవల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ వచ్చాయి, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ప్రధాన కధాంశం. '' అన్నారు.

శర్వానంద్ సాయిం..

మరో ప్రక్క సెల్ఫీరాజాకి శర్వానంద్ వాయిస్ ఓవర్ చెప్పి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేసాడు. అల్లరి నరేష్ కీ శర్వానంద్ కీ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇద్దరూ కలిసి చేసిన గమ్యం చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మరో చిత్రం సైతం వీళ్లిద్దరూ కలిసి చేసారు. ఆ రిలేషన్ తోనే శర్వాని అడగ్గానే నరేష్ సినిమాకి మాట సాయం చేశాడని తెలుస్తోంది.

English summary
Icing on the cake is the satirical punch in the end of the Selfie Raja trailer in which conveyance 30 Years Industry Prudhvi repeating Bunny's controversial "Cheppanu Brother" dialogue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu