»   » బాలయ్యకు ఫుడ్ పాయిజన్ జరిగింది: పూరి

బాలయ్యకు ఫుడ్ పాయిజన్ జరిగింది: పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం శ‌మంత‌క‌మ‌ణి. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్లో సోమవారం గ్రాండ్ గా జరిగింది.

ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలయ్య, పూరి జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని నిర్మాతలు ప్రకటించారు. అయితే బాలయ్య హాజరు కాలేదు. పూరి మాత్రమే వచ్చారు. బాలయ్య రాక పోవడంపై పూరి వివరణ ఇచ్చారు.


Balakrishna Food Poison

ప్రస్తుతం పూరి దర్శకత్వంలో 'పైసా వసూల్' చిత్రంలో బాలయ్య నటిస్తున్నారు. పూరి మాట్లాడుతూ...'నిన్న షూటింగ్ అయిపోయాక రేపు సాయంత్రం శమంతకమణి ఆడియో ఫంక్షన్ కు వెళదామని బాలయ్య చెప్పారని, ఈ రోజు ఉదయం కూడా షూటింగులో ఈ విషయం గుర్తు చేశారు. ప్యాకప్ అయిన తర్వాత మనం ఫంక్షన్ లో కలుద్దామని చెప్పి ఇంటికెళ్లారు. అయితే ఆయనకు ఈరోజు ఫుడ్ పాయిజన్ అయింది. అందుకే చివరి నిమిషంలో ఆయన రాలేక పోయారు. ఆయన తరుపున నన్ను సారీ చెప్పమన్నారు, అభిమానులు డిసప్పాయింట్ అవ్వొద్దు, మళ్లీ ఆయన్ను పైసా వసూల్ ఫంక్షన్లో కలుద్దాం అని.... పూరి తెలిపారు. శమంతకమణి చిత్రం మంచి హిట్ కావాలంటూ టీంకు విషెస్ తెలిపారు.


ఈ చిత్రాన్ని జులై 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, చాందినీ చౌద‌రి, జెన్నీ హ‌నీ, అన‌న్యా, సోనీ, ఇంద్ర‌జ‌, క‌స్తూరి, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, హేమ‌, సురేఖావాణి, స‌త్యం రాజేశ్‌, బెన‌ర్జీ, అదుర్స్ ర‌ఘు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారుల్లో న‌టించిన ఈ సినిమాకు సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, కెమెరా: స‌మీర్ రెడ్డి, ఆర్ట్: వివేక్ అన్నామ‌లై, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి, నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌, క‌థ - స్క్రీన్‌ప్లే - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.


English summary
Balakrishna not attends Shamantakamani pre-release function because of Food Poison.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu