twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేశ్‌ సినిమాలో విలన్‌గా నటిస్తా.. మా అమ్మను పరిచయం చేశాడు.. సుధీర్‌బాబు

    హిందీలో భాఘీ చిత్రం తర్వాత సుధీర్‌బాబు ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం శమంతకమణి. ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందింది. సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు నటిస్తున్నారు.

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో సుధీర్‌బాబుది ప్రత్యేకమైన స్టయిల్. మహేశ్‌బాబు లాంటి సూపర్‌స్టార్ కుటుంబం అండ ఉన్నా చాలా సాదాసీదాగా ఉంటాడు. చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాడు. పాత్ర కోసం ఎంతైనా కష్టపడుతాడు. అందుకే ఆయనకు హిట్లు దాసోహం అన్నాయి. హిందీలో భాఘీ చిత్రం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం శమంతకమణి. ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందింది. సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 14న రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సందర్భంగా సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

    యాక్షన్ చిత్రం కాదు..

    యాక్షన్ చిత్రం కాదు..

    శమంతకమణి చిత్రం ట్రైలర్‌లో నా సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఇది యాక్షన్ సినిమా అనుకోవద్దు. భావోద్వేగం, వినోదం లాంటి అంశాలతో ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించే చిత్రం ఇది. శమంతకమణి చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మల్టీ స్టారర్ చిత్రాలల్లో ఓ ట్రెండ్ సెట్టర్ కావొచ్చు

    చుట్టూ ఉన్న పాత్రలను పరిశీలించు..

    చుట్టూ ఉన్న పాత్రలను పరిశీలించు..

    నేను సినిమాల్లో నటించడానికి సిద్ధపడినప్పుడు, సినిమాల్లో నటించడం ప్రారంభించిన రోజుల్లో నా సీనియర్ నటులు నాకు ఒక సలహా ఇచ్చారు. అదేమింటంటే మనం పోషించే పాత్రలకు సంబంధించి మన చుట్టుపక్కలే ఉంటారు. వారిని మన పాత్రల్లో చూసుకోవాలి అని అన్నారు. ఈ క్రమంలో శమంతకమణి చిత్రంలో పోషించిన పాత్ర నా జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. తల్లిలేని యువకుడి రోల్.

    నా జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర

    నా జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర

    నా జీవితానికి చాలా దగ్గరగా ఉండే అంశం. మా అమ్మ పుట్టిన వెంటనే వాళ్ల అమ్మ చనిపోయింది. నాకు ఎంతో ప్రేమతో నన్ను పెంచింది. అదే మా అమ్మ ఎంత ప్రేమగా పెరిగిందనే విషయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సినిమాలో పాత్ర చేస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఈ క్యారెక్టర్ అమ్మను మరోసారి పరిచయం చేసింది అని అనిపించింది.

    దర్శకుడి జీవితంలో జరిగిన సంఘటన

    దర్శకుడి జీవితంలో జరిగిన సంఘటన

    దర్శకుడు ఆదిత్య శ్రీరాం జీవితంలో చోటు చేసుకొన్న ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకొని అల్లుకొన్న కథ. సినిమా చూస్తే దాని విలువ ఏంటో తెలుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఈ చిత్ర కథ భలే మంచి రోజు సినిమా చేసినప్పుడు నాకు లైన్ చెప్పాడు. ఆ తర్వాత కథను డెవలప్ చేసి నాకే మొదటిసారి వినిపించాడు. ఆ తర్వాత ఏ పాత్ర కావాలో ఎంచుకోమని చెప్పాడు. అయితే ప్రతీ పాత్ర చాలా బాగుంటుంది. అందుకే నేను అప్పుడు ఏ పాత్రను ఎంపిక చేసుకోలేదు. తర్వాత దర్శకుడు ఆదిత్య శ్రీరామ్ సూచన మేరకు ఈ పాత్ర చేశాను. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఇందులో ఏ పాత్ర చేసినా నేను సంతోషించేవాడిని.

    మల్టీ స్టారర్ సినిమా చేయకూడదని..

    మల్టీ స్టారర్ సినిమా చేయకూడదని..

    మల్టీ స్టారర్ చిత్రం చేయకూడదని అనుకొన్నాను. కథ వినకముందు ఒప్పుకోవద్దనే స్టోరి విన్నాను. కథ విన్నాక చేయలేక ఉండలేకపోయాను. ఈ సినిమా కథ కొత్త జోనర్. బాహుబలి అంతా సెన్సేషన్ కాకపోయినా.. టాలీవుడ్‌కు కొత్త జోనర్ అవుతుంది. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. కమర్షియల్ ఫార్మూలా ఉండదు.

    ఆదిత్య శ్రీరాం బ్రిల్లియంట్

    ఆదిత్య శ్రీరాం బ్రిల్లియంట్

    దర్శకుడు ఆదిత్య శ్రీరాం చాలా బ్రిల్లియెంట్. భలే మంచి రోజు అప్పుడే ఆయనను చూసి షాక్ అయ్యాను. ఒక్కరోజు సెట్‌కు వెళ్లకుండా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా భలేమంచి రోజు లాంటి సినిమా తీశాడు. కథ మీద నమ్మకంతోనే ఈ సినిమా ఒప్పుకొన్నాను. ఆదిత్యలో గొప్పతనమేమింటే.. ఒక సినిమా హిట్ అయితే మంచి సన్నివేశాల గురించి డిస్కస్ చేస్తాం. కానీ ఆదిత్య మాత్రం ఆ సీన్ ఇంకా బాగా చేయాల్సి ఉండేది అని చర్చిస్తాడు. అలాంటి తపన ఉన్న దర్శకుడు ఆదిత్య. భవిష్యత్‌లో టాలీవుడ్‌లో గొప్ప సినిమాలు తీస్తాడు అనే నమ్మకం ఉంది.

    హీరోలను దృష్టిలో పెట్టుకొని..

    హీరోలను దృష్టిలో పెట్టుకొని..

    ఇది హీరోలను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. మల్టీ స్టారర్ సినిమాల్లో మాదిరిగా ఒక హీరోకు ఒక సీన్ ఆ తర్వాత మరో హీరోకు ఇంకో సీన్ అని బేరీజు వేసుకొని తీస్తే కన్విన్స్ చేయడం కష్టం. అలా హీరోలను దృష్టిలో పెట్టుకొని చేసింది కాబట్టే హీరోలందరూ కన్విన్స్ అయ్యారు.

    నారా రోహిత్‌తో మళ్లీ మల్టీస్టారర్

    నారా రోహిత్‌తో మళ్లీ మల్టీస్టారర్

    ఈ సినిమా తర్వాత కూడా మళ్లీ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్నాను. నారారోహిత్‌తో కలిసి ‘వీరభోగ వసంతరాయలు' చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నా పాత్ర ఆకట్టుకుంటుంది. విరించి వర్మ దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాజా దర్శకత్వంలో ఓ ప్రేమకథలో నటించబోతున్నాను అని అన్నాను.

    మంచి సబ్జెక్ట్ కోసం

    మంచి సబ్జెక్ట్ కోసం


    బాలీవుడ్‌లో వర్షం రీమేక్‌గా తీసిన బాఘీ' చిత్రంలో విలన్‌గా నటించాను. తెలుగులో అలాంటి పాత్రలు వస్తే మహేష్‌బాబు చిత్రంలోనైనా చేయడానికి సిద్ధమే. కనీసం ఒక్క సీన్‌ అయినా చేస్తా. ఎందుకంటే మహేశ్‌తో మల్టీ స్టారర్ చిత్రం గురించి ఇక మీరూ అడగరు. ప్రతీ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న కంపల్సరీగా అడుగుతారు. మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూడటం వల్లనే భాఘీ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ రావడం జరిగింది. నా తొలిసినిమాకు రెండో సినిమాకు కూడా ఇలాంటి గ్యాపే వచ్చింది అని చెప్పారు.

    పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో..

    పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో..

    ప్రస్తుతం పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో నటిస్తున్నా. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకుడు. గోపీచంద్‌ బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా కసరత్తు చేస్తున్నా. ఇందులో నా పాత్రను గోపీచంద్‌కు దగ్గరగా ఉండేలాచూపించేందుకు విదేశాల నుంచి మేకప్‌ నిపుణులు వస్తున్నారు. ప్రోస్తటిక్ మేకప్ చేస్తారు. బ్యాడ్మింటన్‌పై పూర్తి అవగాహన ఉండటంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ఇటీవల బయోపిక్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. తల్లిదండ్రులు సైతం చిన్నారులు ఆటలు ఆడేందుకు ప్రోత్సహిస్తున్నారు అని సుధీర్ బాబు అన్నారు.

    English summary
    The multi starrer film 'Shamantakamani' will surely be an eye feast for all movie lovers of Tollywood. Directed by Sriram Adittya of "Bhale Manchi Roju" fame the film has a unique storyline revolving around a car. The film starring Nara Rohith, Sundeep Kishan, Aadi and Sudheer Babu in the lead roles has Ananya Soni as the female lead. Befor release Sudheer Babu given a interview for media. In that, he said If chance comes, I will act as a villain in Maheshbabu movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X