»   » కామెడీ, క్రైమ్, థ్రిల్... శమంతకమణి ట్రైలర్: టాలీవుడ్ మల్టీస్టారర్ హవా మొదలైనట్టేనా?

కామెడీ, క్రైమ్, థ్రిల్... శమంతకమణి ట్రైలర్: టాలీవుడ్ మల్టీస్టారర్ హవా మొదలైనట్టేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శమంతకమణి. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది,రాజేంద్ర ప్రసాద్, అనన్య సోనిలు ఈ మల్టీ స్టారర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుధీర్ బాబు తనయుడు దర్శన్ కూడా ఈ మూవీలో న‌టిస్తున్నాడు. తొలి సారి తండ్రి, తనయులు శమంతకమణి చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.నలుగురు మీడియం హీరోలు వున్నా కూడా జస్ట్ పది కోట్ల లోపు బడ్జెట్ లో ఈ సినిమా ఫినిష్ చేయడం విశేషం.

రోల్స్ రాయిస్ కారు చుట్టూ

రోల్స్ రాయిస్ కారు చుట్టూ

ఖరీదైన రోల్స్ రాయిస్ కారు చుట్టూ తిరిగే థ్రిల్లర్ జోనర్ కథ ఇది. ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటిస్తున్నారు. పదికోట్ల లోపు బడ్జెట్ తో తయారైన ఈ సినిమాకు శాటిలైట్ ముందే ఫినిష్ చేసేసారు. రెండున్నర కోట్ల రేంజ్ లో ఫినిష్ అయింది. ఆంధ్రను నాలుగు నుంచి అయిదు కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు.


అఫీషియల్ ట్రైలర్‌

అఫీషియల్ ట్రైలర్‌

ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ‘శమంతకమణి'ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో అన్ని క్యారెక్ట‌ర్ల‌ను చూపిస్తూ హైద‌రాబాద్‌లోని ఏదో స్టార్‌ హోట‌ల్‌లో ఓ కారు చుట్టూ తిర‌గే క్రైమ్ కామెడీగా రూపొందింది.


 థ్రిల్లర్ స్టోరీ

థ్రిల్లర్ స్టోరీ

మోషన్ పోస్టర్ దగ్గరి నుంచీ ఇప్పటి ఈ ట్రైలర్ దాకా శమంతకమణి మంచి బజ్ నే క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. కామెడీ ని కలుపుకొని సరదాగా సాగిపోయే థ్రిల్లర్ స్టోరీ కా కనిపిస్తోంది. గతం లో వచ్చిన టీజర్, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఈ శమంతకమణి చుట్టూనే తిరుగుతుందని అర్థమైపోతోంది.


కారు పేరే శమంతకమణి

ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ కారుని దొంగిలించాలనుకునే క్యారెక్టర్ సుధీర్ బాబు ది అనిపించేలా ఉంది, ఆదీ, సందీప్ కిషన్ ల ని, నారా రోహిత్ నీ చూస్తూంటే ఆకారు చుట్టూ తిరిగే క్రైం కథ అనీ, ఆ కారు పేరే శమంతకమణి అని అర్థమౌతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. జూలై లోనే మూవీని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారట‌. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.English summary
Shamantakamani’, directed by Sriram Aditya, Theatrical Trailer Released
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu