»   » ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి అప్పుడే తెలిసింది.. నాగశౌర్యకు థ్యాంక్స్.. నారా రోహిత్

ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి అప్పుడే తెలిసింది.. నాగశౌర్యకు థ్యాంక్స్.. నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం, సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో యువ హీరో నారా రోహిత్‌ది ప్రత్యేకమైన పంథా. ఆయన నటించిన తొలి చిత్రం బాణం డిఫరెంట్ ఫిలింగా విమర్శకుల ప్రశంసలందుకొన్నది. ఆ తర్వాత నారా రోహిత్ చేసిన సావిత్రి, అసుర, జో అచ్చుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. తాజాగా శమంతకమణి అనే మల్టీ స్టారర్ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం జూలై 14న విడుదల అవుతున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలను నారా రోహిత్ మీడియాతో పంచుకొన్నారు.

సినిమా స్క్రిప్ట్ బాగున్నది..

సినిమా స్క్రిప్ట్ బాగున్నది..

శమంతకమణి చిత్రం చాలా మంచి సినిమా. మల్టీ స్టారర్ సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి నటించాలంటే చాలా కష్టం. అలాంటిది నలుగురు హీరోలు కలిసి నటించడం మామూలు విషయం కాదు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది. ఏ హీరోకు కావాల్సిన స్పేస్‌లో వారికి క్యారెక్టర్లు ఉన్నాయి. అందుకే ఎలాంటి సమస్యలు రాలేదు.


నా పాత్ర చాలా టిపికల్

నా పాత్ర చాలా టిపికల్

ఈ చిత్రంలో పోలీస్ పాత్ర. ఈ మధ్యకాలంలో పోలీస్ పాత్ర పోషించడం నాలుగో సారి. ఈ చిత్రంలో నా పాత్ర చాలా టిపికల్. ఎప్పుడు కోపం వస్తుందో.. ఎప్పుడు మామూలుగా ఉంటుందో నాకే తెలీదు. పోలీసు పాత్రలో నటించ వద్దని అనుకొన్నాను. కానీ కథ విన్నాక నటించాలని అనుకొన్నాను. రంజిత్ కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంది. న్యూ డైమన్షన్ కనిపిస్తుంది. ఈ కథలో కారుది ప్రధాన పాత్ర. కారును దొంగిలించిన నలుగురు అనుమానితుల గురించి దర్యాప్తు చేస్తుంటాం. మిగితా విషయాలన్నీ తెరపైనే చూస్తేనే బాగుంటుంది.


Ramajogayya Sastry @Shamanthakamani Pre Release Event
 37 రోజుల్లో సినిమా పూర్తి

37 రోజుల్లో సినిమా పూర్తి

శ్రీరాం తీసిన భలేమంచి రోజు సినిమా నేను చూశాను. చాలా బాగా చేశాడు. రెండో సినిమాను కేవలం 37 రోజుల్లో పూర్తి చేశాడు. స్క్రిప్ట్ బాగా రాశాడు. కథపై తనకు స్పష్టమైన అవగాహన ఉంది. క్లియర్ కట్ ఐడియా ఉంది. ఈ చిత్రంలో ఆదిత్య శ్రీరాంకు కెమెరామెన్ సమీర్ చాలా ప్లస్ అయ్యాడు. తన అనుభవం సినిమాను వేగంగా పూర్తి చేయడానికి పనికి వచ్చింది.


నాగశౌర్యకు ముందు కథ చెప్పాడు..

నాగశౌర్యకు ముందు కథ చెప్పాడు..

శమంతకమణి' కథ విన్నాక కొత్తగా అనిపించి ఓకే చేశాను. ఈ సినిమాలో నటించడానికి కారణం నాగశౌర్య. ఎందుకంటే దర్శకుడు శ్రీరామ్‌ ఈ కథను ముందు నాగశౌర్యకు వినిపించారు. ఆ తర్వాత శౌర్య నాకు ఫోన్‌చేసి నువ్వు కథ విను నీకు తప్పుకుండా నచ్చుతుంది అని చెప్పాడు. కథ విన్నాక మళ్లీ పోలీస్ పాత్రనేనా అనే విసుగు వచ్చింది. ఒక పోలీస్ డ్రెస్ కుట్టించుకొని పెట్టుకోవాలేమో అనిపించింది.


నాగశౌర్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి..

నాగశౌర్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి..

శమంతకమణి చిత్రంలో ఈ పాత్ర నాకు దక్కినందుకు ముందు శౌర్యకి ధన్యవాదాలు చెప్పాలి సినిమాలో నాతో పాటు నలుగురు హీరోలు ఉన్నారు. ప్రతీ పాత్ర కథలో కీలకమే. ఎవరిదీ ఎక్కువా తక్కువా అనిలేదు. నలుగురు హీరోలతో మంచి క్వాలిటీతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ సినిమాను కేవలం 37 రోజుల్లో పూర్తిచేశాడు దర్శకుడు శ్రీరాం. ఆ క్రెడిట్‌ అంతా ఆయనకే. రంజిత్ కుమార్ పాత్ర కాకుండా నాకు నచ్చిన పాత్ర సుధీర్ పాత్ర. ఆ పాత్ర సెంటిమెంట్‌తో కూడుకొన్నది.


అందుకోసం బరువు తగ్గలేదు.

అందుకోసం బరువు తగ్గలేదు.

శమంతకమణి చిత్రంలో పాత్ర కోసం బరువు తగ్గలేదు. మరో సినిమాలో పాత్ర కోసం బరువు తగ్గుతుంటే రంజిత్ కుమార్ పాత్ర వచ్చింది. పవన్ సాదినేని చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ జూలై 25న వస్తున్నది. పక్కా కమర్షియల్ సినిమా. నాకు కొత్త జోనర్. అందుకోసం బరువు తగ్గాను.


నేను చేస్తున్న సినిమాలు ఇవే..

నేను చేస్తున్న సినిమాలు ఇవే..

కథలోరాజకుమారి, వీరభోగ వసంతరాయలు, పవన్ సాదినేని చిత్రాల్లో నటిస్తున్నాను. వీరభోగ వసంతరాయలు చిత్రం కొత్తగా ఉంటుంది. ఈ సినిమా పేరు విని అంతా చారిత్రాత్మక చిత్రం అని అనుకుంటున్నారను. కానీ ఇదో కమర్షియల్‌ చిత్రం. హిందీలో వెడ్‌నెస్ డే సినిమా మాదిరిగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా.. కొత్త జోనర్‌గా ఉంటుంది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్‌గా సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు కూడా నటిస్తున్నాడు.


ఎవరి పాత్ర వారిదే..

ఎవరి పాత్ర వారిదే..

‘‘జ్యో అచ్యుతానంద', ‘అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాల్లోనూ ఇద్దరు హీరోలు ఉన్నారు. కథ కొత్తగా ఉన్నప్పుడు ఎంత మంది హీరోలున్నా ఓకే. ఎవరి పాత్ర వారిదే. ‘జ్యో అచ్యుతానంద' మంచి విజయం అందుకుంది. అందులో నాకు రావాల్సిన పేరు నాకొచ్చింది అని మల్టీ స్టారర్ సినిమాలు చేయడంపై నారా రోహిత్ వివరణ ఇచ్చారు.


 ఎన్టీఆర్ పాత్ర పేరని తెలీదు..

ఎన్టీఆర్ పాత్ర పేరని తెలీదు..

రంజిత్ కుమార్ పాత్ర కొండవీటి సింహంలో ఎన్టీఆర్ పాత్ర పేరని, రౌడీ ఇన్స్‌పెక్టర్ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పేరని తెలియదు. శమంతకమణి చిత్రం ఫస్ట్‌లుక్ వచ్చిన తర్వాత నా స్నేహితుడు మెసేజ్ చేస్తే నాకు తెలిసింది. అప్పటివరకు నాకు తెలియదు. షూటింగ్‌లో డైలాగ్స్ చదువుకుంటూ వెళ్లాను అని నారా రోహిత్ చెప్పారు.English summary
Tollywood hero Nara Rohit again playing police cap in Shamantakamani. He is playing as Ranjith Kumar in this movie. Shamantakamani slated to release on July 14th. In this occassion, Nara Rohit speaks with his mind about this movie with media. He shares different experiences about this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu