X
తెలుగు » సినిమాలు » శతమానం భవతి
శతమానం భవతి

శతమానం భవతి

Romance | 14 Jan 2017 | U | 135 Mins
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

శతమానం భవతి స్టోరీ

శతమానం భవతి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజు, జయసుధ, తనికెళ్ళ భరణి , నరేష్, ఇంద్రజ, రాజ రవింద్ర, ప్రవీణ్, శిజు, దిల్ రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విగ్నేష సతీష్ వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు.  కథ తూర్పు గోదావరి జిల్లా ...ఆత్రేయపురంలో రాఘవ రాజు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) ఒంటిరిగా జీవితాన్ని లీడ్ చేస్తూంటారు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఆ పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో ఈ జంట ఒంటిరిదైపోయింది. గత జ్ఞాపకలాతో గడిపే ఈ పెద్ద వాళ్లిద్దరితో పాటు మనవడు రాజు (శర్వానంద్) కూడా కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయిన వారి పిల్లలు తమ జీవితాల్లో బిజీ అయ్యి... ఎప్పుడూ ఇటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోరు. అయితే తన పిల్లలంతా ఈ సంక్రాంతి పండుగకు అయినా వస్తే బాగుండును అని రాజుగారు భావిస్తారు. పిలిస్తే రారు అని తెలిసిన ఆయన అందుకోసం ఓ ప్లాన్ వేసి అమలు చేస్తారు. ఆ ప్లాన్‌ వర్కవుట్ అయ్యి... పిల్లలంతా కూడా విదేశాల నుండి తన ఊరుకి సంక్రాంతికి వస్తారు. వారితో పాటు ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజుగారి కూతురు ఇంద్ర‌జ కుమార్తె, రాజు గారి మ‌న‌వ‌రాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) కూడా ఆత్రేయ‌పురం వ‌స్తుంది. మన హీరో రాజు, నిత్యాలు బావా మరదలు అవ్వడంతో ఇద్దరి మద్య ప్రేమ ఆటోమెటిక్ గా మొదలవుతుంది. ఆ ఇంట్లో సంక్రాంతి సంబ‌రాల్లో అంద‌రూ మునిగి తేలుతుండ‌గానే రాజుగారు వేసిన ప్లాన్ భార్య జాన‌క‌మ్మ‌కు తెలిసి పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది. ఆ కుటుంబంలో పెద్ద క‌ల‌త‌లు చెల‌రేగుతాయి. అస‌లు రాజు గారు వేసిన ప్లాన్ ఏంటి ? ఆయ‌న త‌న పిల్ల‌ల‌కు ఏం చెప్పాల‌నుకున్నాడు ? చివ‌ర‌కు రాజు-నిత్య‌ల ప్రేమ క‌థ ఏమైంది ? అన్న‌ది తెలియాలంటే ..ఈ సినిమా చూసి తెలుసుకోండి.
Read More

శతమానం భవతి కాస్ట్ & క్రూ

శతమానం భవతి సిబ్బంది సమాచారం

దర్శకత్వం విగ్నేష సతీష్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శతమానం భవతి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నిజానికి ఇలాంటి కథలు తెలుగు సినిమాకు కొత్తేం కాదు. అయితే ఈ మధ్యకాలంలో అయితే రాలేదు. నిజ జీవితంలో కనుమరుగైపోతున్న అనుబంధాలను, ఆత్మీయతలను తెరపై చూసి ఆనందించాలనే ఆంకాంక్షకు ఇవి ప్రాణం పోస్తాయి. ఇదే దృష్టిలో పెట్టుకుని దర్శకుడు, నిర్మాత ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లున్నారు. ట్విస్ట్ లు, కథలో కలవని కమర్షియల్ ఎలిమెంట్స్ లు వంటి అనవసరమైన ప్రయాసలు పెట్టుకోకుండా ట్రీట్ మెంట్ ని నడిపారు. ముఖ్యంగా గ్రామీణ నేపధ్యాన్ని చూపిన తీరు బాగుంది. అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత వేగం, ఉత్సాహం సెకండాఫ్ లో లేవనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన గోవిందుడు అందరి వాడేలే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు చూసిన వాళ్లకు ఇది వాటి సీక్వెల్ ఏమో అని డౌట్ వచ్చేలా సీన్స్ వస్తూంటాయి. దానికి తోడు ఈ మూడింటిలోనూ ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించటం జరిగింది. అయితే ఇలాంటి సినిమాలు ఇలాగే ఉంటాయి...ఈ కాలంలో ఆ పాత్రకు ప్రాణం పోసేది ప్రకాష్ రాజ్ అనేది కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. అలాగే సినిమాలో చాలా చోట్ల కామెడీ పేలలేదు. దర్శక,రచయిత వేగేశ్న సతీష్ కు కామెడీ మీద మంచి గ్రిప్ ఉందనే విషయం చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. కానీ కావాలని ఇరికించిన కామెడీ సీన్స్ కలిసిరాలేదు. అయినా అంత స్లోగా కథ నడపటం బోర్ కు కూడా దారి తీసింది. అలాగే చాలా చోట్ల సందేశాలు,స్పీచ్ లు చెప్పే కార్యక్రమం పెట్టుకోవటం కూడా నచ్చని అంశం.

శతమానం భవతి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

శతమానం భవతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+