X
తెలుగు » సినిమాలు » SR కల్యాణమండపం
SR కల్యాణమండపం

SR కల్యాణమండపం

Action | Romance | 06 Aug 2021 | U/A | 148 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

SR కల్యాణమండపం స్టోరీ

SR కల్యాణమండపం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీధర్ గాదె వహిస్తున్నారు. నిర్మాత ప్రమోద్ నిర్మిస్తున్నారు. సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.  కథ రాయలసీమలోని రాయచోటిలోని ధర్మ (సాయి కుమార్) అనే పెద్ద మనిషి ఎస్ఆర్ కల్యాణ మండపాన్ని నిర్వహిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఏ పెళ్లి జరిగినా అదే ఫంక్షన్ హాల్‌లో జరిగాల్సిందనే గొప్ప పేరు ఉంటుంది. తండ్రి వారసత్వంగా వచ్చిన ఆ ఫంక్షన్‌ను సరిగా నడపలేకపోతాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఫంక్షన్ హాల్‌ పరిస్థితి దారుణంగా మారుతుంది. ధర్మ కుమారుడు కల్యాణ్ (కిరణ్ అబ్బవరం), అతడి తల్లి (తులసి)కి తండ్రి నిర్వాకం నచ్చదు. పదేళ్లుగా తండ్రి, కొడుకుల మధ్య మాటలు ఆగిపోతాయి. ఇదిలా ఉండగా, తన కాలేజీలో తోటి విద్యార్థిని సింధూ (ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంటాడు కానీ ఆమె కిరణ్‌ను పట్టించుకోకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తమ కుటుంబానికి ప్రతిష్టగా మారిన ఆ ఫంక్షన్ హాల్‌ను నిర్వహించేందుకు కల్యాణ్ ముందుకు వస్తాడు. SR కల్యాణ మండపం వెనుక ఉన్న అసలు కథేంటి? కల్యాణ మండపాన్ని నడిపించడంలో ధర్మ ఎందుకు విఫలమయ్యారు? తన తండ్రితో కిరణ్ ఎందుకు మాట్లాడకుండా ఉంటాడు? కిరణ్ ప్రేమను సింధూ ఎందుకు నిరాకరిస్తుంది? తమ కుటుంబానికి ప్రతిష్టగా మారిన కల్యాణ మండపానికి పూర్వ వైభవం సంపాదించారా? ధర్మ, కిరణ్ మళ్లీ కలుసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానం SR కల్యాణ మండపం సినిమా కథ.
Read More

SR కల్యాణమండపం కాస్ట్ & క్రూ

SR కల్యాణమండపం సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీధర్ గాదె
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత ప్రమోద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

SR కల్యాణమండపం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
SR కల్యాణమండపం సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. కమర్షియల్ విలువలు, కామెడీ టచ్‌, ఎమోషనల్ అంశాలతో రూపొందించిన పక్కా నేటివిటి చిత్రం. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆ మట్టివాసన నటీనటుల్లో కనిపిస్తుంది. కాకపోతే పక్కాగా స్క్రీన్ ప్లేను రాసుకోకపోవడం వల్ల కథ సాగే విధాణంలో చిన్న అసంతృప్తి అనిపిస్తుంది. థియేటర్లలో ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమాగా SR కల్యాణమండపం రూపొందింది. వారాంతంలో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టించే తీరే ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం తేలుతుంది.

SR కల్యాణమండపం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

SR కల్యాణమండపం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+