X
తెలుగు » సినిమాలు » ఉంగరాల రాంబాబు
ఉంగరాల రాంబాబు

ఉంగరాల రాంబాబు

Comedy | 15 Sep 2017 | U/A |
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

ఉంగరాల రాంబాబు స్టోరీ

ఉంగరాల రాంబాబు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, వెన్నేల కిశోర్,  మధు నంధన్, వేణు (జబర్దస్థ్), సత్యం రాజేష్, ఆర్ జె హేమంత్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతిమాధవ్ వహించారు మరియు యూనైటేడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరిటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జిబ్రాన్ అందించారు. కథ రాంబాబు (సునీల్) 200 కోట్ల ఆస్తికి వారసుడు. వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పులపాలై ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. బాదాం బాబా(పోసాని) చూపిన దారిలో నడిచి రూ. 200 కోట్లు విలువైన బంగారం దొరకడంతో పోగొట్టుకున్న తన ఆస్తులన్నీ చేజిక్కించుకుని..... 200 బస్సులు కొని ట్రావెల్ సంస్థను మొదలు పెడతాడు. బాదాం బాబా సూచన మేరకు తనకు బాగా కలిసొచ్చే జాతకం ఉన్న సావిత్రి (మియా జార్జ్)ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో రాంబాబు, సావిత్రి ప్రేమలో పడతారు. అయితే పెళ్లి జరుగాలంటే తన తండ్రి రంగ నాయర్(ప్రకాష్ రాజ్) అనుమతి తప్పనిసరి అంటుంది సావిత్రి. రంగ నాయర్ కేరళలో చెగునె పూగొండి వనం అనే గ్రామపెద్ద. కరడుగట్టిన కమ్యూనిస్ట్ లీడర్. క్యాప్టలిస్టు బుద్దులున్న రాంబాబు అంటే రంగనాయక్ కు అస్సలు నచ్చదు. మరి సావిత్రిని దక్కించుకోవడానికి వాళ్ల రంగనాయర్ పెట్టిన పరీక్షలు ఎలా పాసయ్యాడు? అనేది తెరపై చూడాల్సింది.   
Read More

ఉంగరాల రాంబాబు కాస్ట్ & క్రూ

ఉంగరాల రాంబాబు సిబ్బంది సమాచారం

దర్శకత్వం క్రాంతి మాదవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత పరుచూరి కిరిటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉంగరాల రాంబాబు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్పార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సునీల్... సునీల్ మాదిరిగానే చేశాడు. డాన్సులు, ఫైట్లు రొటీన్‌. ఇంతకు మించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. కాక పోతే సునీల్ లుక్ పరంగా గత సినిమాల కంటే ఇంకా వరస్టుగా కనిపించాడు. అతడి ఫేసులో గ్లామర్, బాడీ లాంగ్వేజల్‌లో గ్రేస్ బాగా తగ్గిపోయింది. ఈ అంశాల పరంగా సునీల్‌కు మైనస్ మార్కులే. అంతకు ముందు సునీల్ సిక్స్ ప్యాక్ చూసిన వారికి ఈ సినిమాలో అతడు మరింత హెవీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ మియా జార్జ్ లుక్ పరంగా. పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే. సునీల్ పక్కన బావుంది. ఆమెను ఎక్కువగా పాటలకే పరిమితం చేశారే తప్ప.... పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత చెప్పుకోదగ్గ ముఖ్యమైన పాత్ర ప్రకాష్ రాజ్ పోషించిన రంగనాయర్ పాత్ర. కరడుకట్టిన కమ్యూనిస్టు పాత్రలో ప్రకాష్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో అతడి గెటప్, బాడీలాంగ్వేజ్ ఆయన పాత్రకు మరింత వన్నె తెచ్చింది. బాదాం బాబా పాత్రలో పోసాని నవ్వులు పూయించారు. లెనిన్ సుధాకర్ పాత్రలో చెగోవిరా గెటప్‌లో వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వేణు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే.... ఈ సినిమా కథే. ఇలాంటి రోటీన్ కథలు చూసీ చూసీ ప్రేక్షకులు విసుగెత్తిపోయి ఉన్నారు. సునీల్ మరోసారి ఇలాంటి బోరింగ్ కథతో వచ్చి ప్రేక్షకులను మరోసారి బోర్ కొట్టించారు. సినిమా స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకోలేదు. సునీల్ సినిమా అంటే చాలా మంది కామెడీ ఆశించి వెళతారు. రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడా పెద్దగా కామెడీ పండలేదు. పరమ రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో చాలా సీన్లు లాజిక్ లేకుండా ఉన్నాయి. లాజిక్ పక్కన పెట్టి సినిమా ఎంజాయ్ చేద్దామన్నా... అలాంటి పరిస్థితులు సినిమాలో ఎక్కడా కనిపించలేదు.

ఉంగరాల రాంబాబు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఉంగరాల రాంబాబు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+