»   » ‘ఉంగరాల రాంబాబు’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ

‘ఉంగరాల రాంబాబు’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Ungarala Rambabu" Public Talk ‘ఉంగరాల రాంబాబు’ పబ్లిక్ టాక్

సునీల్ హీరోగా, మియాజార్జ్ హీరోయిన్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ రోజు ఈ చితం (సెప్టెంబ‌ర్ 15) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌లైంది. కామెడీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమాలో సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున తదితరులు నటించారు.

సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు, వారి నుండి సేకరించిన అభిప్రాయాల ప్రకారం సినిమా టాక్ ఇలా ఉంది.....


ఖైదీ నెం 150 స్టైల్ లో ఇంట్రడక్షన్

ఖైదీ నెం 150 స్టైల్ లో ఇంట్రడక్షన్

ఖైదీ నెం.150 మూవీలో చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ సునీల్ ఎంటరైన తీరు ఆకట్టుకుందని ఆయన అభిమానులు అంటున్నారు. సునీల్ తనదైన డాన్స్ స్టెప్పులు, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని అంటున్నారు.


ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయట

ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయట

సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావున్నాయని అంటున్నారు. సునీల్ మార్కెట్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే అని అంటున్నారు. యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్ బేనర్లో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు.


సునీల్, పోసాని మధ్య కామెడీ

సునీల్, పోసాని మధ్య కామెడీ

ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి బాదమ్ బాబాగా నటించారు. సునీల్, పోసాని మధ్య వచ్చే సన్నీ వేశాల్లో కామెడీ ఓకే అనేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ

హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ

సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బావుందని..... రాంబాబు పాత్రలో సునీల్, సావిత్రి పాత్రలో మియా జార్జ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, వీరిపై దుబాయ్ లో చిత్రీకరించిన ‘సెనోరీటా సెనోరీటా' బావుందనేది ఆడియన్స్ నోటి మాట.


కమ్యూనిస్టు పాత్రలో ప్రకాష్ రాజ్

కమ్యూనిస్టు పాత్రలో ప్రకాష్ రాజ్

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ హీరోయిన్ తండ్రి పాత్రలో, కమ్యూనిస్టు భావజాలం ఉన్న పాత్రలో కనిపించాడని, ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు.ఫస్టాఫ్ టైమ్ పాస్

ఫస్టాఫ్ టైమ్ పాస్

సినిమా ఫస్టాఫ్ డీసెంట్ కామెడీతో ఫర్వాలేదనే విధంగా ఉందని, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయని అంటున్నారు. టైమ్ పాస్ అవుతుందని అంటున్నారు.సెండాఫ్ బిలో యావరేజ్

సెండాఫ్ బిలో యావరేజ్

ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బిలో యావరేజ్ గా ఉందని అంటున్నారు.కథ పెద్ద మైనస్

కథ పెద్ద మైనస్

సినిమా చాలా రోటీన్ గా ఉందని..... రొటీన్ కమర్షియల్ ఎంటర్టెనర్ మాదిరిగా సినిమాను తీశారని సినిమా చూసిన వారు అంటున్న మాట.


కమ్యూనిజమ్ డైలాగులు

కమ్యూనిజమ్ డైలాగులు

సినిమా ఫార్మాట్‌కు, సినిమాలో చెప్పే కమ్యూనిజం డైలాగులకు సూట్ కాలేదని...... కొందరు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.రొటీన్ సునీల్ సినిమా

రొటీన్ సునీల్ సినిమా

సినిమా చూసిన చాలా మంది రొటీన్ సునీల్ సినిమాలా ఉందని, అంత గొప్పగా ఏమీ లేదని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ లో చాలా బోరింగ్ ఉందని అంటున్నారు.
English summary
Ungarala Rambabu public talk, audience review. It is just like typical sunil film. First half is an average timepass, second half is below average.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu