»   » రోటీన్ రాంబాబు.... (‘ఉంగరాల రాంబాబు’ రివ్యూ)

రోటీన్ రాంబాబు.... (‘ఉంగరాల రాంబాబు’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

"Ungarala Rambabu" Public Talk ‘ఉంగరాల రాంబాబు’ పబ్లిక్ టాక్

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్.... హీరోగా నిలబడటానికి సినిమాల మీద సినిమాలు తీస్తూ తెగ కష్టపడుతున్నాడు. అయితే సునీల్ ఆశించిన విజయం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో సునీల్ చేసిన మరో ప్రయత్నం 'ఉంగరాల రాంబాబు'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజుగ్రాండ్ గా రిలీజైంది.

సునీల్ వరుస ప్లాపుల్లో ఉన్నా.... యునైటెడ్ కిరీటీ మూవీస్ లిమిటెడ్ అధినేత పరుచూరి కిరీటి సునీల్ సినిమా మీద భారీగా ఇన్వెస్ట్ చేశాడు. దర్శకుడు క్రాంతి మాధవ్ మీద నమ్మకమో? లేక కథ మీద ఇంట్రెస్టో? లేక సునీల్ ఈ సారి హిట్టు కొడతాడనే నమ్మకమో తెలియదుకానీ హీరో మార్కెట్‌కు మించిన ఖర్చు పెట్టి పెద్ద సాహమే చేశాడు.

'ఉంగరాల రాంబాబు'గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సునీల్ ప్రేక్షకలను ఏ మేరకు మెప్పించాడు? ఈ సారైనా హిట్ అందుకునే అవకాశం ఉందా? అనేది రివ్యూలోచూద్దాం....


కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

రాంబాబు (సునీల్) 200 కోట్ల ఆస్తికి వారసుడు. వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పులపాలై ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. బాదాం బాబా(పోసాని) చూపిన దారిలో నడిచి రూ. 200 కోట్లు విలువైన బంగారం దొరకడంతో పోగొట్టుకున్న తన ఆస్తులన్నీ చేజిక్కించుకుని..... 200 బస్సులు కొని ట్రావెల్ సంస్థను మొదలు పెడతాడు. బాదాం బాబా సూచన మేరకు తనకు బాగా కలిసొచ్చే జాతకం ఉన్న సావిత్రి (మియా జార్జ్)ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు....
ప్రేమ కోసం కష్టాలు

ప్రేమ కోసం కష్టాలు

ఈ క్రమంలో రాంబాబు, సావిత్రి ప్రేమలో పడతారు. అయితే పెళ్లి జరుగాలంటే తన తండ్రి రంగ నాయర్(ప్రకాష్ రాజ్) అనుమతి తప్పనిసరి అంటుంది సావిత్రి. రంగ నాయర్ కేరళలో చెగునె పూగొండి వనం అనే గ్రామపెద్ద. కరడుగట్టిన కమ్యూనిస్ట్ లీడర్. క్యాప్టలిస్టు బుద్దులున్న రాంబాబు అంటే రంగనాయక్ కు అస్సలు నచ్చదు. మరి సావిత్రిని దక్కించుకోవడానికి వాళ్ల రంగనాయర్ పెట్టిన పరీక్షలు ఎలా పాసయ్యాడు? అనేది తెరపై చూడాల్సింది.
సునీల్... సునీలే

సునీల్... సునీలే

పెర్పార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సునీల్... సునీల్ మాదిరిగానే చేశాడు. డాన్సులు, ఫైట్లు రొటీన్‌. ఇంతకు మించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. కాక పోతే సునీల్ లుక్ పరంగా గత సినిమాల కంటే ఇంకా వరస్టుగా కనిపించాడు. అతడి ఫేసులో గ్లామర్, బాడీ లాంగ్వేజల్‌లో గ్రేస్ బాగా తగ్గిపోయింది. ఈ అంశాల పరంగా సునీల్‌కు మైనస్ మార్కులే. అంతకు ముందు సునీల్ సిక్స్ ప్యాక్ చూసిన వారికి ఈ సినిమాలో అతడు మరింత హెవీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.


మియా జార్జ్

మియా జార్జ్

హీరోయిన్ మియా జార్జ్ లుక్ పరంగా. పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే. సునీల్ పక్కన బావుంది. ఆమెను ఎక్కువగా పాటలకే పరిమితం చేశారే తప్ప.... పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు.


ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత చెప్పుకోదగ్గ ముఖ్యమైన పాత్ర ప్రకాష్ రాజ్ పోషించిన రంగనాయర్ పాత్ర. కరడుకట్టిన కమ్యూనిస్టు పాత్రలో ప్రకాష్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో అతడి గెటప్, బాడీలాంగ్వేజ్ ఆయన పాత్రకు మరింత వన్నె తెచ్చింది.
బాదాం బాబా... ఇతర కమెడియన్స్

బాదాం బాబా... ఇతర కమెడియన్స్

బాదాం బాబా పాత్రలో పోసాని నవ్వులు పూయించారు. లెనిన్ సుధాకర్ పాత్రలో చెగోవిరా గెటప్‌లో వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వేణు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక అంశాలు

సాంకేతిక అంశాలు

జిబ్రాన్ మ్యూజిక్ ఫర్వాలేదు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బావుంది. దుబాయ్‌లో పాటల చిత్రీకరణ, కేరళలోని సీన్లు బాగా చూపించాడు. కోటగిరి వెంకటేశ్వర్రావ్ ఎడిటింగ్ చాలా పూర్‌గా ఉంది. సినిమాలో విసుగుతెచ్చే సీన్లు ఇంకా కట్ చేస్తే బావుండు. చంద్రమోహన్ చింతాడ రాసిన డైలాగ్స్ అక్కడక్కడ ఒకే. హ్యూమనిజం విషయంలో ఆయన రాసిన డైలాగులు ఆకట్టుకున్నాయి.


సినిమాలో పెద్ద మైనస్

సినిమాలో పెద్ద మైనస్

సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే.... ఈ సినిమా కథే. ఇలాంటి రోటీన్ కథలు చూసీ చూసీ ప్రేక్షకులు విసుగెత్తిపోయి ఉన్నారు. సునీల్ మరోసారి ఇలాంటి బోరింగ్ కథతో వచ్చి ప్రేక్షకులను మరోసారి బోర్ కొట్టించారు.


ఆకట్టుకోని స్క్రీన్ ప్లే

ఆకట్టుకోని స్క్రీన్ ప్లే

సినిమా స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకోలేదు. సునీల్ సినిమా అంటే చాలా మంది కామెడీ ఆశించి వెళతారు. రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడా పెద్దగా కామెడీ పండలేదు. పరమ రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో చాలా సీన్లు లాజిక్ లేకుండా ఉన్నాయి. లాజిక్ పక్కన పెట్టి సినిమా ఎంజాయ్ చేద్దామన్నా... అలాంటి పరిస్థితులు సినిమాలో ఎక్కడా కనిపించలేదు.


ఫస్టాఫ్-సెకండాఫ్

ఫస్టాఫ్-సెకండాఫ్

సినిమా ఫస్టాఫ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లతో ఓ మోస్తరుగా టైమ్ పాస్ అవుతుంది. ఇక సెకండాఫ్ సాగే తీరు పరిశీలిస్తే ప్రేక్షకుడు శుభం కార్డు పడే వరకు కూర్చునే పరిస్థితి లేదు. ఈ విషయంలో దర్శకుడు క్రాంతి మాధవ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.


ఇలా అయితే సునీల్ కష్టమే

ఇలా అయితే సునీల్ కష్టమే

హీరో సునీల్ ఇలా రొటీన్ కథలు, రొటీన్ స్క్రీన్ ప్లే ఫార్మాట్లతో ఎన్నిసార్లు బాక్సాఫీసు మీద దాడి చేసినా విజయం అందుకోవడం కష్టం. తనకు సెట్టయ్యేలా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బావుంటుంది. సునీల్ ఇప్పటికైనా ఈ విషయంలో మరింత ఫోకస్ పెట్టకపోతే కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్

సునీల్ ఇలాంటి ఉంగరాలను నమ్ముకోకుండా కథ, కథనాలను నమ్ముకుంటే మంచింది.


English summary
Ungarala Rambabu review and rating. It is just like typical sunil film. First half is an average timepass, second half is below average.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu