»   » ఉంగరాలతో గేమ్: బిగ్ బాస్ ఇంట్లో హీరో సునీల్ సందడి (ఫోటోస్)

ఉంగరాలతో గేమ్: బిగ్ బాస్ ఇంట్లో హీరో సునీల్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Hero Sunil Entry In Today's Episode

సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలవుతుంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సునీల్ బిగ్ బాస్ ఇంటికి వచ్చారు. బుధవారం ఆయన బిగ్ బాస్ ఇంట్లో గడిపారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ గురవారం రాత్రి ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోలో చూడొచ్చు.

హ్యాపీగా గడిపిన కంటెస్టెంట్స్

హ్యాపీగా గడిపిన కంటెస్టెంట్స్

సునీల్ బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టడంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. ఎప్పుడూ వాళ్ల మొహాలు మాత్రమే చూసుకుంటూ విసుగెత్తిపోయిన కంటెస్టెంట్స్ సునీల్ రాకతో కాస్త రిలాక్స్ అయ్యారు.

ఉంగరాల గేమ్

ఉంగరాల గేమ్

ఉంగరాల రాంబాబుగా బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన సునీల్.... బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఉంగరాలతో గేమ్ ఆడించారు. మాటీవీ వారు విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే షో చాలా ఆసక్తిగా సాగుతోందని తెలుస్తోంది.

నటీనటులు

సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున తదితరులు నటించారు.

తెర వెనక

తెర వెనక

మ్యూజిక్ - జిబ్రాన్, లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్, సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్, ఫైట్ మాస్టర్ - వెంకట్, డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ, ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్, కొరియో గ్రఫి - భాను మాస్టర్, పబ్లిసిటీ - ధని, పిఆర్ఓ - ఏలూరు శ్రీను, బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్, ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి, డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్.

English summary
Comedian turned hero Sunil is getting ready for the release of his latest film 'Ungarala Rambabu' on September 15. he is aggressively promoting the film. Sunil is flying to Pune for entering Bigg Boss house. He said to have made his preparations to give special tasks to the contestants in the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu