»   » ఆ వెధవలు ఇండస్ట్రీలో ఇంకా ఉన్నారు, అలీ బాధపడ్డాడు: పోసాని సంచలనం

ఆ వెధవలు ఇండస్ట్రీలో ఇంకా ఉన్నారు, అలీ బాధపడ్డాడు: పోసాని సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్‌, మియాజార్జ్‌ హీరో హీరోయిన్లుగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదలవ్వబతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. 'సినిమా ట్రైలర్ చూశాక, అందులో సునీల్ చెప్పిన డైలాగ్ విన్నాక.... భారత దేశం వెనకపడిపోతుంది డబ్బుల్లేక కాదు, మానవత్వం లేక అని... ఈ డైలాగ్ వినగానే ఒక 32 ఏళ్ల క్రితం నేనెలాగైతే మద్రాసులో తిండి కోసం, డబ్బు కోసం కష్టపడి, ఏడ్చి, నవ్వి, బాధపడి, చంపుతామని, చచ్చిపోతామని ఎన్నిరకాల విన్యాసాలు చేశానో... గుర్తొచ్చింది అన్నారు.


ఆ 32 ఏళ్ల క్రితం నా జీవితం గుర్తొచ్చింది

ఆ 32 ఏళ్ల క్రితం నా జీవితం గుర్తొచ్చింది

మానత్వం లేదు అని సునీల్ చెప్పిన డైలాగ్ విన్న తర్వాత..... ‘32 ఏళ్ల తర్వాత కూడా నేను ఇంత బావుండి, బాగా సంపాదించి, వెల్ సెటిల్డ్ అయి రేపు నాకు సినిమా లేకున్నా ఫర్వా లేదు. జీవితాంతం నా కుటుంబం చాలా సంతోషంగా, విలాసంగా బ్రతుకుతాను అన్నంత సంపాదించాక కూడా ఇప్పుడు ఈ డైలాగ్ విన్న తర్వాత 32 ఏళ్ల కిందట ఆ జీవితమే నాకు గుర్తొచ్చింది' అన్నారు.


అలీ అలా చెప్తుంటే.. గుండె పగిలిపోయేoత బాధ కలిగింది. - పోసాని
మానవత్వం లేదు

మానవత్వం లేదు

ఎందుకంటే మానవత్వం లేదు అనేది వాస్తవం, నాకు ఇపుడు ఈ స్టేజీలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అలీ నాకు 32 ఏళ్ల ప‌రిచ‌యం. ఏ రోజూ అబద్దం చెప్పడం, డ్రామాలు ఆడటం, కన్నింగ్ నేచర్ లేవు. వీలైతే సహాయం చేస్తాడు, లేదంటే చిరు నవ్వుతో ఇంటికెళ్లిపోతాడు. ఏ రోజూ ఆలీ చీటర్, ఆలీ వెధవ అని పరిశ్రమలో ఎవరూ అనలేదు. అంత మంచి వ్యక్తి అలీ, ఎప్పుడూ నవ్విస్తుంటాడు. కానీ ఆ అలీ నా దగ్గరకు వారం క్రితం వచ్చి బాధ పడ్డాడు అని పోసాని తెలిపారు.


ఇండస్ట్రీలో ఇంకా అలాంటి వెధవలు ఉన్నారు

ఇండస్ట్రీలో ఇంకా అలాంటి వెధవలు ఉన్నారు

అలీ బాధ పడుతుంటే ఏమైంది? అని అడిగాను. అపుడు ఆయన.... ‘మురళీ, నీకో మాట చెబుతా విను. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో నువ్వు, నేను, ఇంకొకడు మెయిన్ క్యారెక్టర్. కానీ ఒకడు వచ్చి... నీ పేరు పక్కన పెట్టి, నా పేరు పక్కన పడేసి వీళ్లెందుకన్నా ఇంత డబ్బులడుగుతారు... వాడైతే తక్కువకు వస్తాడు, వీడైతే తక్కువ వస్తాడు అని మన ఇద్దరినీ పక్కకు నెట్టి వేరే వాళ్లకు వేషాలు ఇప్పించి ఆ సినిమాలో యాక్ట్ చేయించారు. ఇన్నాళ్ల తర్వాత కూడా, ఇంత జీవితం చూసిన తర్వాత కూడా, ఇంకా వెన్ను పోట్లు ఉంటాయా? ఇంకా చీటింగ్ ఉంటుందా? ఇంకా ఇలాంటి వెధవలు ఉంటారా? ఇండస్ట్రీలో...? అంటే నాకు అదే డైలాగ్ నాకు గుర్తొచ్చింది.... అని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.


వాళ్ల పేర్లు చెప్పను

వాళ్ల పేర్లు చెప్పను

ఎందుకు మానవత్వం లేకుండా పోతుంది మనిషిలో? స్టేజీ మీద నవ్వులు వేరు, స్టేజీ మీద సిన్సియార్టీ వేరు... నిజ జీవితంలో వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు గుండె పగిలి పోయేంత బాధ కలిగింది అలీ చెబుతుంతే, ఒక నిజాయితీ పరుడు చెబుతుంటే, ఒక అబ్బదం ఆడవి వాడు చెబుతుంటే.... చాలా బాధేసింది. వారి పేర్లు ఇపుడు అప్రస్తుతం. ఈ డైలాగ్ రాసిన రచయితకు థాంక్స్, దర్శుడు క్రాంతి మాధవ్ ఐ లవ్ యూ.... అంటూ పోసాని వ్యాఖ్యానించారు.


అలీ

అలీ

అలీ మాట్లాడుతూ ``ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా క‌మెడియ‌న్ల‌కు క‌లిసి ఉండ‌టం తెలీదు. ఎంత‌మంది ఉన్నా, ఎంత పోటీ ఉన్నా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మాత్ర‌మే ఒక ఫ్యామిలీగా ఉండ‌గ‌ల‌రు. ఆ గౌర‌వం తెలుగు ప‌రిశ్ర‌మ‌కే ద‌క్కింది. న‌టించేట‌ప్పుడు మాత్ర‌మే ఆయా పాత్ర‌ధారులుగా మారుతాం. బ‌య‌టికి వ‌చ్చాక మా మ‌ధ్య భేదాలు ఉండ‌వు... అని అలీ అన్నారు.


సునీల్ అన్నీ కోణాలు చూపించాడు

సునీల్ అన్నీ కోణాలు చూపించాడు

సునీల్ త‌న‌లోని అన్నీ కోణాల‌ను చూపించాడు. నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డి సునీల్ చేసిన సిక్స్ ప్యాక్ ప్ర‌శంస‌నీయం. కామెడీ చేసినోడు ఏదైనా చేయ‌గ‌ల‌డ‌ని అప్పుడెప్పుడో ర‌జ‌నీకాంత్ గారు అన్నారు. క‌మెడియ‌న్ కామెడీ, ట్రాజెడీ ఏదైనా చేయ‌గ‌ల‌డు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా సునీల్‌ను తీసుకోవ‌చ్చు`` అని అలీ అన్నారు.


సునీల్ మాట్లాడుతూ

సునీల్ మాట్లాడుతూ

సునీల్ మాట్లాడుతూ ``చేసుకున్న క‌ర్మ‌ను అనుభ‌వించేవారిని న‌వ్వించ‌డ‌మే మేం చేయాల్సిన ప‌ని. ఈ మంచి ప‌ని భ‌విష్య‌త్తులో మా పిల్ల‌ల‌కు మంచి చేస్తుంద‌ని కోరిక‌. క్రాంతిమాధ‌వ్ నాలో ఒక యాక్ట‌ర్‌ని చూశారు. క్వాలిటీ కోస‌మే సినిమా కాస్త లేట్ అయింది. ఈ నెల 15న విడుద‌ల చేస్తున్నాం. నాక్కూడా మంచి సినిమా అవుతుంది`` అని తెలిపారు.


English summary
Tollywood actor Posani Krishna murali sensational speech at Sunil's Ungarala Rambabu pre release event. There are Cheaters in the industry, he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu